EPAPER

Kamal’s Brain Should be Examined: కమల్‌ని పిచ్చాసుపత్రిలో చేర్పించండి.. నోటి దురుసు ఎవరది..?

Kamal’s Brain Should be Examined: కమల్‌ని పిచ్చాసుపత్రిలో చేర్పించండి.. నోటి దురుసు ఎవరది..?

Kamal’s brain should be examined Said By Annamalai: సార్వత్రిక ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న వేళ నేతలు మాటలు హద్దులు దాటుతున్నాయి. నేతల మాటలకు కౌంటర్లు పడిపోతున్నాయి. మరికొందరైతే వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తూ తమ నోటికి పని చెబుతున్నారు.


తాజాగా సినీనటుడు, మక్కల్ నీధి మయ్యం చీఫ్ కమల్‌హాసన్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు తమిళనాడు బీజేపీ చీఫ్ అన్నామలై. దేశ రాజధాని మార్పు అని ఎవరైనా ఈ తరహా ఆరోపణలు చేస్తే వెంటనే వారిని పిచ్చాసుపత్రికి చేర్పించాలన్నారు. అంతేకాదు వారి మెదడు పని చేస్తుందో లేదో వెంటనే పరీక్షలు చేయించాలన్నారు. ముఖ్యంగా మానసిన వైద్యుడి వద్దకు వెళ్లి కమల్ సలహాలు తీసుకోవాలన్నారు. దేశ రాజధానిని ఎలా మారుస్తారని ప్రశ్నించారు.

రాజ్యసభ ఎంపీ కావాలనే ఆలోచనతోనే కమల్ ఇలాంటి వ్యాఖ్యలు చేశారని విమర్శించారు. చెన్నైని దేశానికి వేసవి లేదా శీతాకాల రాజధానిగా చేయాలని కమల్ చెబితే అందుకు తాను ఓకే చెబుతానని అన్నారు. అటు అన్నామలై వ్యాఖ్యలపై ఎంఎన్ఎం కార్యకర్తలు, కమల్ ఫ్యాన్స్ మండిపడుతున్నారు. ఆ రేంజ్‌లో నోటి దురుసు పనికి రాదని అంటున్నారు. రాజకీయాల్లోకి వచ్చాక కాస్త అణిగి మణిగి ఉండాలని హితవు చెబుతున్నారు. ఇలాగైతే తాము కూడా మాట్లాడుతామన్నారు.


Kamal Haasan's brain should - Tamilnadu Bjp Chief Annamalai
Kamal Haasan’s brain should – Tamilnadu Bjp Chief Annamalai

Also Read: లోయలో పడిన బస్సు, 12 మంది మృతి.. కాసేపట్లో చేరుకుంటామనగా..

ఇంతకీ కమల్‌హాసన్ ఏమన్నారు? ఉత్తర చెన్నై నియోజకవర్గంలో డీఎంకె-ఎంఎన్ఎం కూటమి అభ్యర్థి కళానిధి వీరాస్వామికి మద్దతుగా ప్రచారం చేశారు కమల్‌హాసన్. ఈ సందర్భంగా మాట్లాడిన కమల్, మళ్లీ ఎన్డీఏ వస్తే.. నాగ్‌పూర్‌ను ఇండియాకు కొత్త రాజధానిగా చేస్తుందన్నారు. ఇదే సమయంలో గుజరాత్ మోడల్ కన్నా ద్రవిడ మోడల్ ఉత్తమమని అన్నారు. తాము ఈ మోడల్‌ని అనుసరిస్తామని, బీజేపీ అయితే ద్రవిడ మోడల్‌ను విస్మరిస్తోందని కామెంట్స్ చేశారు. అంతేకాదు జాతీయజెండాను ఒకే రంగులోకి మార్చాలని ప్రయత్నిస్తున్నారని దుయ్యబట్టారు.

అన్నామలైకి వివాదాలు కొత్తేమీకాదు.. మొన్నటికి మొన్న జాతిపిత మహాత్మాగాంధీని ప్రధానమంత్రి అని సంభోదించారు. ఈ వ్యవహారంలో ఆయనపై ఇంటాబయటా విమర్శలు వెల్లువెత్తాయి. మొత్తానికి నేతల వ్యాఖ్యలు హుందాగా తీసుకోవాలని, ఇలా వ్యక్తిగతంగా టార్గెట్ చేయడం మంచిదికాదంటున్నారు రాజకీయ విశ్లేషకులు.

Tags

Related News

Mahalakshmi Scheme: కాంగ్రెస్ హామీని కాపీ కొట్టిన బీజేపీ

Rahul Gandhi: ఖర్గే, నడ్డాల లేఖల యుద్ధం

Toxic Workplace: వర్క్ ప్రెజర్‌ తట్టుకోలేక ప్రైవేట్ ఉద్యోగిని మృతి.. రంగంలోకి దిగిన సర్కారు

Delhi CM: ఢిల్లీ సీఎంగా అతిశీ ప్రమాణానికి డేట్ ఫిక్స్

Rahul Gandhi Vs Ravneet Bittu: జాతీయ పార్టీల అధినేతల మధ్య లేఖల యుద్ధం..

Monkeypox Case in India: భారత్‌ను వణికిస్తున్న మంకీపాక్స్.. రెండో కేసు నమోదు.

Train accident in Uttar Pradesh: పట్టాలు తప్పిన మరో రైలు.. రైళ్ల రాకపోకలకు అంతరాయం

Big Stories

×