EPAPER

Pawan Kalyan Ugadi Panchangam: పోయిన శని ప్రభావం.. పెరిగిన గురుబలం.. పవన్‌కు రాజయోగం పక్కా!

Pawan Kalyan Ugadi Panchangam: పోయిన శని ప్రభావం.. పెరిగిన గురుబలం.. పవన్‌కు రాజయోగం పక్కా!
Pawankalyan political career super says Ugadi panchangam sravanam
Pawan kalyan political career super says Ugadi panchangam sravanam

Pawan kalyan Ugadi Panchangam: క్రోధి నామ సంవత్సరం జనసేన అధినేత పవన్‌కల్యాణ్ కలిసొస్తుందా? అవుననే అంటున్నారు వేద పండితులు. తాజాగా పిఠాపురం నియోజకవర్గం చేబ్రోలులో గృహ ప్రవేశం చేశారు ఆయన. ఈ సందర్భంగా వేద పండితులు పూజలు నిర్వహించారు. ఇంట్లో నిర్వహించిన ఉగాది వేడుకల్లో పాల్గొన్నారు పవన్ కల్యాణ్. ఆయన వెంట టీడీపీ మాజీ ఎమ్మెల్యే వర్మ కూడా ఉన్నారు.


పవన్‌కల్యాణ్‌కు శని ప్రభావం పోవడంతో.. గురు బలం పెరిగిందని పండితులు చెబుతున్నారు. ముఖ్యంగా ఆయనకు గెలుపు అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని, కాలం కలిసొచ్చే ఆయన కేంద్రమంత్రి అయినా ఆశ్చర్యపోనక్కర్లేదని అంటున్నారు. పవన్ జాతకం కలిసిరావడంతో కొత్త ఇంట్లో ఫుల్‌ఖుషీగా కనిపించారు.

మాజీ కాంగ్రెస్ నేత, సెఫాలజిస్ట్  గోనె ప్రకాశరావు కూడా పవన్ గెలుపును ఎవరూ ఆపలేరని చెప్పుకొచ్చారు. ముఖ్యంగా పిఠాపురం నుంచి దాదాపు 50 వేల మెజార్టీతో గెలుపొందడం ఖాయమన్నారు. ఇందుకు కారణాలు లేకపోలేదు. పవన్ గెలుపు కోసం అంతా తానై చూస్తున్నారు టీడీపీ మాజీ ఎమ్మెల్యే వర్మ. ముద్రగడ వేస్తున్న ఎత్తులను ఎక్కడికక్కడ ఆయన చిత్తు చేస్తున్నారు.


Also Read: Kutami sabha at Tanuku: రెండోసారి, వేదికపైకి ముగ్గురు నేతలు, ఆపై

ఏపీలో ఎన్నికలు వేళ పిఠాపురం నియోజకవర్గానికి ప్రాధాన్యత బాగా పెరిగింది. ఇక్కడ నుంచి పవన్‌కల్యాణ్ బరిలో ఉండటమే ముఖ్యకారణం. దీంతో అందరి కళ్లు ఈ నియోజకవర్గంపై పడ్డాయి. అందుకు తగ్గట్టుగా వర్మతో కలిసి ప్రణాళికలు చేశారు పవన్‌కల్యాణ్. మూడురోజులు మకాం వేసిన పవన్.. డీటేల్స్ ప్లాన్ వర్మకి ఇచ్చారు. అభ్యర్థి పవన్ అయినా.. నియోజకవర్గం అంతా చక్కబెట్టేస్తున్నారు వర్మ. ప్రభుత్వం అధికారం లోకి రాగానే అమలు చేయబోయే హామీలను వివరిస్తూ దూసుకుపోతున్నారు. దీంతో ఇక్కడ కూటమి పవన్ వర్సెస్ వంగా గీత‌గా మారింది.

వైసీపీకి చెందిన వంగా గీతను ఇక్కడి నుంచి పోటీ చేయడానికి కారణాలు చాలానే ఉన్నాయి. ప్రజారాజ్యం తరపున 2009 ఎన్నికల్లో ఆమె ఇదే నియోజకవర్గం నుంచి గెలుపొందారు. దీంతో ఆమె ఎడ్జ్ ఉంటుందని భావించిన జగన్.. ఆమెని బరిలోకి దించారు. టీడీపీ ఆవిర్భావం తర్వాత ఈ నియోజకవర్గంలో ఒకే వ్యక్తి, ఒకే పార్టీ వెంట వెంటనే గెలిచిన సందర్భాలు లేవు.

Also Read: అస్సాంకు రఘురామ్‌రెడ్డి, జగన్‌కు షాకింగ్? అందుకోసమేనా?

1983లో టీడీపీ అభ్యర్థిగా నాగేశ్వరావు గెలుపొందారు. ఆ తర్వాత జరిగిన ఉప ఎన్నికల్లో విజయం ఆయన్ని వరించింది. మరల 1994లో కూడా ఆయనే విజయం సాధించారు. 2004లో బీజేపీ తరపున దొరబాబు గెలుపొందారు. మరల 2019లో వైసీపీ తరపున ఆయన విజయం సొంతం చేసుకున్నారు. అక్కడ ఏ పార్టీకి వరసగా గెలిచిన చరిత్ర కూడా లేదు. ఈ లెక్కన పవన్ విజయం నల్లేరు మీద నడకగా చెబుతున్నారు ఆ ప్రాంతవాసులు.

Related News

Tirumala Laddu: ఛీ, ఇంత నీచమా? ఏపీ ప్రజల సెంటిమెంట్‌పై గట్టి దెబ్బ.. వైసీపీని ఈ పాపం వెంటాడుతుందా?

Adani Foundation: ఏపీ వరద బాధితులకు అదానీ ఫౌండేషన్ భారీ విరాళం.. ఎంతనో తెలిస్తే ఆశ్చర్యపోతారు!

Tirupati Laddu: తిరుమల లడ్డూ ప్రసాదంలో గొడ్డు మాంసం? ఇదిగో ప్రూఫ్.. ల్యాబ్ టెస్ట్‌లో బయటపడింది ఇదే

Balineni Comments: జగన్ ఏరోజూ సభల్లో నా గురించి మాట్లాడలేదు.. అందుకే పార్టీని వీడా: బాలినేని

Ambati Rambabu: నాణ్యమైన మద్యం అంటే ఏంటి..? ఎంత తాగినా ఆరోగ్యం దెబ్బతినదా..? : అంబటి ఎద్దేవా

YS Jagan: జగన్‌కు మరో భారీ షాక్… తగలనుందా..?

YV Subba Reddy: పెద్ద పాపమే చేశాడు.. చంద్రబాబుకు సుబ్బారెడ్డి కౌంటర్

Big Stories

×