EPAPER

CSK Won By 7 Wickets: రుతురాజ్ కెప్టెన్ ఇన్నింగ్స్.. కోల్‌కతాకు తొలి ఓటమి..!

CSK Won By 7 Wickets: రుతురాజ్ కెప్టెన్ ఇన్నింగ్స్.. కోల్‌కతాకు తొలి ఓటమి..!
Chennai Super Kings vs Kolkata Knight Riders
Chennai Super Kings vs Kolkata Knight Riders

Chennai Super Kings Vs Kolkata Knight Riders Highlights: చెన్నై చెపాక్ వేదికగా కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ ఘనవిజయం సాధించింది. రుతురాజ్ గైక్వాడ్(67*) కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడటంతో చెన్నై 7 వికెట్ల తేడాతో గెలుపొందింది.


అంతకుముందు జడేజా, తుషార్ దేశ్‌పాండే చెరో 3 వికెట్లతో చెలరేగడంతో కోల్‌కతా 9 వికెట్ల నష్టానికి 137 పరుగులు చేసింది.

రుతురాజ్ కెప్టెన్ ఇన్నింగ్స్

138 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన చెన్నైకి మూడో ఓవర్లో రచిన్ రవీంద్ర(15) అవుట్ అయ్యాడు. ఆ తరువాత కెప్టెన్ గైక్వాడ్, డారిల్ మిచెల్ రెండో వికెట్‌కు 70 పరుగులు జోడించారు. ఈ దశలో 25 పరుగులు చేసిన డేరిల్ మిచెల్ నరైన్ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు. దీంతో 97 పరుగులకు రెండో వికెట్ కోల్పోయింది.


మరో ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. దీంతో చెన్నై సూపర్ కింగ్స్ స్కోర్ 14వ ఓవర్లో 100 పరుగులు దాటింది. చివర్లో శివమ్ దూబే(28) విజయానికి 3 పరుగుల దూరంలో అవుట్ అయ్యాడు. కానీ రుతురాజ్ ఫోర్ కొట్టి చెన్నై గెలుపును లాంఛనం చేశాడు.

Also Read: Ravindra Jadeja: గురువు ధోనీకి సమానంగా జడ్డూ..

చెలరేగిన జడేజా, తుషార్

ముందుగా టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన కోల్‌కతా నైట్ రైడర్స్‌కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఇన్నింగ్స్ తొలి బంతికే ఓపెనర్ ఫిల్ సాల్ట్(0) తుషార్ దేశ్‌పాండే బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు. ఆ తరువాత మరో ఓపెనర్ సునీల్ నరైన్, వన్ డౌన్ బ్యాటర్ రఘువంశీ రెండో వికెట్‌కు 56 పరుగులు జోడించారు. ఈ తరుణంలో 24 పరుగులు చేసిన రఘువంశీ రవీంద్ర జడేజా బౌలింగ్‌లో ఎల్బీగా వెనుదిరిగాడు. అదే ఓవర్లో 27 పరుగులు చేసిన నరైన్ పెవిలియన్ చేరాడు.

ఆ వెంటనే వెంకటేశ్ అయ్యర్(3)ను రవీంద్ర జడేజా అవుట్ చేశాడు. దీంతో కోల్‌కతా 64 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. మరో ఎండ్‌లో శ్రేయాస్ అయ్యర్ పాతుకుపోగా రమణ్‌దీప్ 13 పరుగులు చేసి తీక్షణ బౌలింగ్‌లో బౌల్డ్ అయ్యాడు. దీంతో 85 పరుగులకే కోల్‌కతా సగం జట్టును కోల్పోయింది. ఆ తరువాత రింకూ సింగ్ 9 పరుగులు చేసి తుషార్ దేశ్‌పాండే బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు. దీంతో 113 పరుగుల వద్ద 6వ వికెట్ కోల్పోయింది. ఆ తరువాత రస్సెల్ 10 పరుగులు చేసి భారీ షాట్‌కు యత్నించి తుషార్ దేశ్‌పాండే బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు. 34 పరుగులు చేసిన అయ్యర్ ముస్తాఫిజుర్ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు. దీంతో 20 ఓవర్లు ముగిసేసరికి కేకేఆర్ 9 వికెట్ల నష్టానికి 137 పరుగులు చేసింది.

Tags

Related News

IND vs BAN: అదరగొట్టిన ఆల్ రౌండర్లు : అశ్విన్ సెంచరీ, జడేజా 86 నాటౌట్

Pakistan: మీరింక మారరా…బ్యాట్‌తో బలంగా కొట్టుకున్న పాక్ ప్లేయర్..వీడియో వైరల్‌ !

IND vs BAN Test Match: టెస్టు మ్యాచ్ ఫ్రీ గా.. చూడాలని అనుకుంటున్నారా?

Nikhat Zareen: డీఎస్పీగా గ్రూప్ -1 ఉద్యోగంలో.. తెలంగాణ మహిళా బాక్సర్

SA vs AFG: వన్డే క్రికెట్‌లో పెను సంచలనం..మొదటిసారి దక్షిణాఫ్రికాపై విజయం..

India vs Bangladesh: ఇవాళ్టి నుంచే తొలి టెస్ట్..ఆ ఇద్దరు డేంజరస్ ప్లేయర్లు ఔట్ !

IND vs BAN: వాళ్లిద్దరినీ ఎందుకు తీసుకోవడం లేదంటే: గౌతం గంభీర్

Big Stories

×