EPAPER

Jagan Comments on Politics: రాజకీయాలపై కొత్త నిర్వచనం, పులి నోట్లో నోరు పెట్టినట్టే..?

Jagan Comments on Politics: రాజకీయాలపై కొత్త నిర్వచనం, పులి నోట్లో నోరు పెట్టినట్టే..?

CM Jagan comments on politics in prakasam


Jagan Latest Comments on Prakasam Poitics: రాజకీయాలంటే సీఎం జగన్‌కు విరక్తి కలిగిందా..? చీటికి మాటీకి తన కుటుంబం గురించి ప్రత్యర్థులు ప్రశ్నించడమే ఇందుకు కారణమా..? చివరకు చెల్లెళ్లు కూడా ఆయన గురించి.. గుచ్చిగుచ్చి ఆరోపణలు చేయడమే.. వైరాగ్యానికి కారణమా..? ఇలా అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఆయన మాటలు విన్నవారు ఇదే విషయాన్ని చెబుతున్నారు. జగన్ బస్సుయాత్ర ప్రస్తుతం ప్రకాశం జిల్లాలో కొనసాగుతోంది. సోమవారం అక్కడి స్థానికులు, రైతులతో ముచ్చటించారు.

ఈ సందర్భంగా మాట్లాడిన సీఎం జగన్.. ప్రస్తుతం రాజకీయాలు పాతాళానికి పడిపోయాయని చెప్పు కొచ్చారు. అంతేకాదు విలువలు, విశ్వసనీయత లేని రాజకీయాలు వచ్చాయని అంటున్నారు. ఉన్నట్లుండి రాజకీయాలపై ఆయనకు ఎందుకు విరక్తి కలిగిందన్న చర్చ అక్కడి ప్రజల్లో మొదలైపోయింది. ఇప్పటి వరకు ఏపీలో పలు సంస్థలు సర్వే చేశాయి. పార్టీల వైపు తప్పించి.. పెద్ద సంస్థలు ఆంధ్రప్రదేశ్‌లో ఓటర్ల నాడిని తెలుసుకునే ప్రయత్నం చేశాయి. దాదాపు 90శాతం టీడీపీ కూటమి విజయం సాధించవచ్చని చెబుతున్నాయి.


చివరకు వైఎస్ఆర్‌కు హార్డ్‌కోర్ అభిమాని, సెఫాలజిస్ట్ గోనె ప్రకాశరావు కూడా ఇదే విషయాన్ని ప్రస్తావిం చారు. కూటమి 130 నుంచి 150 సీట్లు గెలుచుకోవచ్చని తేల్చేశారు. లోక్‌సభ సీట్లయితే 20 నుంచి 22 సీట్లు వస్తాయని మనసులోని మాట బయటపెట్టారు. ఇక పిఠాపురంలో పవన్ కల్యాణ్ అయితే ఏకంగా 50 వేల మెజార్టీతో గెలుస్తారని ధీమా వ్యక్తంచేశారు గోనె ప్రకాశరావు. దీనికితోడు సోషల్ ఇంజనీర్, రాజకీయ స్ట్రాటజిస్టు ప్రశాంత్‌కిషోర్ ఇదే విధంగా చెప్పారు. ఈసారి జగన్‌కి ఓటమి ఖాయమన్నది కుండ బద్దలు కొట్టేశారు.

Also Read: సీక్రెట్‌గా పేపర్లు దహనం, హెరిటేజ్‌కి చెందినవా?

ఈక్రమంలోనే సీఎం జగన్‌ మాటల్లో వైరాగ్యం కనిపించిందని అంటున్నారు. చంద్రబాబుకు అవ్వా తాతలపై కనీసం ప్రేమ లేదని, ఆయనకు ఓటు వేస్తే పులి నోట్లో తల పెట్టినట్టేనని చెప్పుకొచ్చారు. జగన్‌కు అవ్వాతాతలపై అంత ప్రేముంటే.. పెన్షన్ డబ్బులు పంపిణీ చేయడంలో ఎందుకు ఆలస్య మైందని పలువురి ప్రశ్న. రంగురంగుల హామీలతో వస్తున్న చంద్రబాబును అస్సలు నమ్మవద్దని అంటున్నారు. జగన్ మాటలను విన్నవారు మాత్రం రెండు నాలుకల ధోరణి ఏంటంటూ చర్చించుకోవడం మొదలైపోయింది.

Related News

Tirumala Laddu: ఛీ, ఇంత నీచమా? ఏపీ ప్రజల సెంటిమెంట్‌పై గట్టి దెబ్బ.. వైసీపీని ఈ పాపం వెంటాడుతుందా?

Adani Foundation: ఏపీ వరద బాధితులకు అదానీ ఫౌండేషన్ భారీ విరాళం.. ఎంతనో తెలిస్తే ఆశ్చర్యపోతారు!

Tirupati Laddu: తిరుమల లడ్డూ ప్రసాదంలో గొడ్డు మాంసం? ఇదిగో ప్రూఫ్.. ల్యాబ్ టెస్ట్‌లో బయటపడింది ఇదే

Balineni Comments: జగన్ ఏరోజూ సభల్లో నా గురించి మాట్లాడలేదు.. అందుకే పార్టీని వీడా: బాలినేని

Ambati Rambabu: నాణ్యమైన మద్యం అంటే ఏంటి..? ఎంత తాగినా ఆరోగ్యం దెబ్బతినదా..? : అంబటి ఎద్దేవా

YS Jagan: జగన్‌కు మరో భారీ షాక్… తగలనుందా..?

YV Subba Reddy: పెద్ద పాపమే చేశాడు.. చంద్రబాబుకు సుబ్బారెడ్డి కౌంటర్

Big Stories

×