EPAPER

Atchannaidu Vs Kalamata Venkata Ramana: కలమట కలకలం.. అచ్చెన్న గరంగరం..!

Atchannaidu Vs Kalamata Venkata Ramana: కలమట కలకలం.. అచ్చెన్న గరంగరం..!
Andhra Pradesh Assembly Elections 2024
Andhra Pradesh Assembly Elections 2024

Atchannaidu Vs Kalamata Venkata Ramana: సిక్కోలు జిల్లా టీడీపీ అంటే ముందుగా గుర్తొచ్చేది కింజరపు ఫ్యామిలీనే  టీడీపీ ఆవిర్భావం నుంచి కింజరపు ఎర్రన్నాయుడు జిల్లాలో ఆ పార్టీకి పెద్దదిక్కుగా ఉంటూ వచ్చారు. తర్వాత ఆయన తమ్ముడు అచ్చెన్నాయుడు పెద్దన్న పాత్ర పోషిస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా ఉన్న అచ్చెన్న జిల్లాపై మరింత పట్టుబిగించడానికి వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారు. ఈ సారి అభ్యర్ధుల ఎంపికలో తన మాట చెలాయించుకున్న మాజీ మంత్రి  జిల్లాలో పేరున్న రాజకీయ కుటుంబాలను పక్కనపెట్టి.. తన వారికి టికెట్లు ఇప్పించుకోవడంలో సక్సెస్ అయ్యారు. మరి ఆయన ప్రయోగం సక్సెస్ అవుతుందా? టికెట్ దక్కని సీనియర్లు పార్టీకి సహకరిస్తారా?


ఏపీలో టీడీపీకి గట్టి పట్టున్న జిల్లా శ్రీకాకుళం ఎన్టీఆర్ పార్టీ పెట్టిన నాటి నుంచి ఈ జిల్లాలో టీడీపీ ఆధిపత్యం కొనసాగుతూ వచ్చింది. గడచిన నాలుగు దశాబ్ధాల కాలంలో జిల్లా టీడీపీ నేతలు రాష్ట్ర , జాతీయ స్థాయిలో చక్రం తిప్పారు. అయితే దివంగత వైఎస్ఆర్, సీఎం జగన్‌‌లు జిల్లాలో సైకిల్ స్పీడ్‌కి బ్రేకులు వేయగలిగారు. గత ఎన్నికల్లో జిల్లాలోని పది స్థానాల్లో వైసీపీ నుంచి 8 మంది ఎమ్మెల్యేలు గెలిస్తే ఇచ్ఛాపురం, టెక్కలి సెగ్మెంట్లను మాత్రమే టీడీపీ దక్కించుకోగలిగింది.అయితే శ్రీకాకుళం ఎంపీగా కింజరపు రామ్మోహన్‌నాయుడు గెలవడం ఆ పార్టీకి ఒకింత ఊరటనే చెప్పాలి.

Also Read: రాజయోగం లేనట్టేనా? అందుకే ఉగాది వేడుకలు రద్దా?


గత ఎన్నికలో రాష్ట్రవ్యాప్తంగా ఊహించని పరాభవం ఎదుర్కొని ప్రతి పక్షానికి పరిమితమైన టీడీపీ ప్రస్తుతం పుంజుకునే ప్రయత్నాలు చేస్తోంది. శ్రీకాకుళం జిల్లాలోనూ గత వైభవం సాధిస్తామన్న ధీమాతో కనిపిస్తున్నారు తెలుగు తమ్ముళ్లు. అయితే వారి ధీమాకి నేతల మధ్య విభేదాలు గండికొట్టే పరిస్థితి కనిపిస్తుంది.. వివిధ నియోజకవర్గాల్లో స్వయంగా రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడే గ్రూపు రాజకీయాలన్నిప్రోత్సహిస్తున్నారంట. జిల్లాలోని సీనియర్ నేతలకు చెక్ పెట్టేందుకు అచ్చెన్నే తన వర్గీయులని ప్రొత్సహిస్తున్నారన్న టాక్ వినిపిస్తోంది. దానికి తగ్గట్లే జిల్లాలో ప్రకటించిన అభ్యర్ధుల్లో అచ్చెన అనుచరులకే టికెట్లు దక్కాయి.

శ్రీకాకుళం అసెంబ్లీ నియోజకవర్గంతో పాటు పాత పట్నం , ఎచ్చెర్ల , పాలకొండలలో గత రెండేళ్లుగా పార్టీ ఇన్చార్జులకు పోటీగా ఇతరనే తలు టీడీపీ కార్యక్రమాలు నిర్వహిస్తూ వచ్చారు. శ్రీకాకుళం ఇన్చార్జ్‌గా గుండ లక్ష్మీదేవి వయస్సును లెక్కచేయకుండా పార్టీ బలోపేతానికి కృషి చేశారు. ఆమెకు పోటీగా గొండు శంకర్ కూడా యాక్టివ్‌గా పనిచేసారు. దాంతో సొంతం పార్టీలో వర్గ విభేదాలు సరిచేయాలని అచ్చెన్నాయుడికి చెప్పినా ఖాతరుచేయలేదని లక్ష్మీదేవి బాహటంగానే విమర్శించారు. వర్గరాజకీయలకు చెక్ పెట్టాల్సిన అచ్చెన్న వాటిని ఎగదోస్తూ వచ్చారని గుండ లక్ష్మీ తన మనసులోని ఆవేదనను కార్యకర్తలు ముందు వెళ్ళగక్కారు.

తాజాగా గొండు శంకర్‌ని శ్రీకాకుళం అభ్యర్ధిగా ప్రకటించింది టీడీపీ.. అక్కడ నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన గుండ అప్పలసూర్యనారాయణ, ఆయన సతీమణి, 2014లో ధర్మాన ప్రసాదరావుపై ఎమ్మెల్యేగా విజయం సాధించిన గుండ లక్ష్మీదేవిలను పక్కన పెట్టేసింది. దాంతో గొండు శంకర్‌కి టికెట్ రావడం వేనుక అచ్చెన్నాయుడు హస్తం ఉందని, ఆయన ఉద్దేశపూర్వకంగానే తమకు టికెట్ దక్కకుండా చేసారని గుండ దంపతులు ఆరోపిస్తున్నారు. పార్టీ నిర్ణయంపై తన అనుచరుల ముందు కన్నీటి పర్యంతరమయ్యారు గుండ లక్ష్మీదేవి కింజరపు కుటుంభం గుండ కుటుంబానికి వెన్నుపోటు పోటించిందని గుండ అభిమానులు ఆరోపిస్తున్నారు. కింజరాపు కుటుంబానికి తగిన గుణపాఠం చెపుతామని అవసరమైతే గుండ దంపతులను ఇండిపెండేంట్లుగా పోటీ చేయించి ఏంపి కింజరపు రామ్మోహన్‌నాయుడుని సైతం ఓడిస్తామని హెచ్చరిస్తున్నారు. కార్యకర్తల నిర్ణయం మేరకే ముందుకు వెళ్తామని గుండ దంపతులు అంటున్నారు.

Also Read: బీజేపీ సీబీఐ రాగం.. అసలు కథేంటి?

ఇక పాతపట్నంలో సైతం ఇదే పరిస్థితి .. మాజీ ఎమ్మేల్యే కలమట వెంకటరమణకి పోటీగా మామిడి గోవింద్‌ని  అచ్చెన్నాయుడు ప్రోత్సహించారనే ప్రచారం ఉంది. టీడీపీతో సుదీర్ఘ అనుబంధం ఉన్న కలమట కుటుంబాన్ని కాదని ఈ సారి మామిడి గోవింద్‌ని పాతపట్నం అభ్యర్ధిగా ప్రకటించడంతో పాతపట్నం టీడీపీలో రచ్చమోదలైంది. అచ్చేన్నాయుడు కలమట వెంకటరమణ కు అన్యాయం చేసారంటూ బారీ బహిరంగ సభను నిర్వహించింది కలమట వర్గం  ఆ క్రమంలో టెక్కలి , పాతపట్నంలో ఇండి పెండేంట్ గా బరిలో దిగుతానని కలమట వెంకటరమణ ప్రకటించారు.

అన్ని ప్రాంతాల్లోనూ పర్యటించి వారంలోగా తన నిర్ణయాన్ని ప్రకటిస్తామంటున్నారు కలమట వెంకటరమణ.. అయితే కలమట మోహనరావు టీడీపీ ఆవిర్భావం నుంచ పార్టీలో ఉండి పాతపట్నం నుంచి అయిదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచినప్పటికీ  వెంకటరమణ 2014లో వైసీపీలోకి వెళ్లి గెలిచి తిరిగి టీడీపీలోకి వచ్చారు.. గత ఎన్నికల్లో వైసీపీ అభ్యర్ధిని రెడ్డి శాంతి చేతిలో ఓడిపోయారు .. ఆ సారి సర్వే ఫలితాలు ఆయనకు వ్యతిరేకంగా రావడం వల్లే టికెట్ ఇవ్వలేదని పార్టీ వర్గాలు అంటున్నాయి

Also Read: Chandrababu Naidu: టీడీపీ విరాళాల వెబ్‌సైట్‌ ప్రారంభం.. తొలి చందా ఎంతంటే..!

ఇక సీనియర్ నేత టిడిపి పాలిట్ భ్యూరో సబ్యుడు కళావెంకట్రావుకు సైతం ఎచ్చెర్ల టిక్కేట్ రాకుండా అడ్డుకుంది అచ్చెన్నాయుడేనని కళా వర్గం మండిపడుతోంది. సీనియర్ నేత అయినా కళా గెలిస్తే అచ్చెన్న హవాకు చెక్ పడుతుందనే అక్కడ కలిశెట్టి అప్పలనాయుడును అచ్చెన్న ప్రోత్సహించారని కలవర్గం గుర్రుగా ఉంది. అయితే ఎచ్చెర్ల టికెట్ కళా, కలిశెట్టి ఇద్దరికీ కాకుండా చేసిన చంద్రబాబు వారిని విజయనగరం జిల్లాకు పంపించారు. కళా వెంకట్రావు చీపురుపల్లి బరిలో దిగితే , కలిశెట్టి విజయనగరం ఎంపీ అభ్యర్ధిగా పోటీలో నిలిచారు. కళా శిష్యుడైన పాలకొండ టీడీపీ ఇన్చార్జ్ జయకృష్ణకు సైతం సీటు దక్కకుండా.. పాలకొండ సెగ్మెంట్‌ను జనసేనకు కేటాయించడం వెనుక కూడా అచ్చెన్నాయుడి హస్తం ఉందని కళా వెంకట్రావు వర్గం కారాలు మిరియాలు నూరుతోంది.

మరో వైపు విజయనగరంలో అనేకమంది సీనియర్లు ఉన్నా..  శ్రీకాకుకం జిల్లా కి చెందిన కలిశెట్టి అప్పలనాయుడికి విజయనగరం ఎంపి సీటు కేటాయించడంపై విజయనగరం జిల్లా టీడీపీ నేతలు అచ్చెన్నాయుడుపై గుర్రుగా ఉన్నారట. విజయనగరం జిల్లాలో కాపు నేతలు లేనట్లు  ఆ వర్గానికి చెందిన శ్రీకాకుళం జిల్లా నాయకులకు విజయనగరంలో దించడం సరికాదని పెదవి విరుస్తున్నారట. మొత్తమ్మీద శ్రీకాకుళం జిల్లాలో అంత మంది సీనియర్లకు టీడీపీ టికెట్ దక్కకపోవడం చర్చనీయాంశంగా మారింది. మరి అచ్చెన్న లెక్కలేంటో కాని.. ఆయన ప్రయోగం ఎంత వరకు సక్సెస్ అవుతుందో చూడాలి.

Related News

Rushikonda Palace: రుషికొండ ప్యాలెస్.. అధికారులు దాస్తున్న నిజాలు

Lebanon Pager Explosions: వామ్మో ఇలా కూడా చంపొచ్చా..పేజర్ బాంబ్స్!

YS Jagan vs Anil Kumar: అనిల్‌కు జగన్ మాస్టర్ స్ట్రోక్.. ఈ జిల్లాలో సీటు గల్లంతైనట్లేనా?

Bigg Boss 8 Telugu : మొన్నటిదాకా గుడ్డు.. నేడు హగ్ లు.. ఈ టచింగ్ గొడవ ఏంటి మహా ప్రభో..

Land Grabbing: వంశీరాం టు సోహిణి.. లిటిగేషన్స్ సో మెనీ.. కేటీఆర్ డైరెక్షన్‌లో సుబ్బారెడ్డి కబ్జా కథలు

One Nation One Election: జమిలి ఎన్నికలతో ఎవరికి లాభం? దీని వల్ల కలిగే నష్టాలేమిటీ?

Vegetables Price: కూరగాయల ధరలకు రెక్కలు.. జేబుకు చిల్లు.. ఇంతలా పెరగడానికి రీజనేంటి ?

Big Stories

×