EPAPER

Jagan Not Celebrates Ugadi: రాజయోగం లేనట్టేనా? అందుకే ఉగాది వేడుకలు రద్దా?

Jagan Not Celebrates Ugadi: రాజయోగం లేనట్టేనా? అందుకే ఉగాది వేడుకలు రద్దా?
CM Jagan not attend Ugadi Celebrations
CM Jagan not attend Ugadi Celebrations

YS Jagan Reddy Not Participating in Ugadi Celebrations 2024: వైసీపీ అధినేత జగన్‌కు ఈసారి రాజయోగం లేదా? ఈ విషయం ఆయనకు ముందే తెలుసా? ఈ నేపథ్యంలో బస్సుయాత్రకు ప్లాన్ చేశారా? అవుననే సంకేతాలు బలంగా వినిపిస్తు న్నాయి. ఇప్పుడు ఏపీ అంతటా దీనిపైనే చర్చ జరుగుతోంది. గడిచిన నాలుగేళ్లగా క్రమం తప్పకుండా ఉగాది వేడుకల్లో పాల్గొన్నారు సీఎం జగన్ దంపతులు. ఈ సందర్భంగా వేద పండితులు చెప్పిన పంచాంగ శ్రవణం శ్రద్ధగా వినేవారు. మీకంతా రాజయోగమేనని చెప్పుకొచ్చారు. మీకు తిరుగులేదని చెప్పుకొచ్చారు.. ఇదంతా గతం.


అసలే ఎన్నికల ఏడాది.. పైగా అన్నివైపుల నుంచి వ్యతిరేక పవనాలు.. ఈ సమయంలో పంచాంగం వినడం కంటే దూరంగా ఉండడమే బెటరని జగన్ నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఈ క్రమంలో ఉగాది వేడుక రద్దు చేసుకున్నట్లు పార్టీ వర్గాల నుంచి బలంగా వినిపిస్తున్నమాట. బస్సుయాత్రలో భాగంగా ప్రస్తుతం పల్నాడులో పర్యటిస్తున్నారు సీఎం జగన్.

మంగళవారం జరగనున్న ఉగాది వేడుకలకు సీఎం జగన్ పాల్గొంటారని తొలుత స్థానిక వైసీపీ నేతలు ప్రచారం చేశారు. అందుకు తగ్గట్టుగానే ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. పల్నాడు జిల్లా గంటావారిపాలెంలో ఉగాది వేడుకలు జరుగుతాయని షెడ్యూల్ విడుదలైంది. ఈ క్రమంలో భారీ సెట్టింగులు వేయడానికి వచ్చిన ఈవెంట్ నిర్వాహకులను వైసీపీ నాయకులు వెనక్కి పంపేశారట. తాజాగా ఈ కార్యక్రమాన్ని రద్దు చేసినట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.


Also Read: రాష్ట్రంలో అభివృద్ధి లేదు.. జగన్ మరోసారి అధికారంలోకి రావడం కష్టమే: ప్రశాంత్ కిశోర్

ఈ ఏడాది ఉగాది వేడుకలు ఉండవని, పంచాంగ శ్రవణం కూడా ఉందని నేతలు అంటున్నారు. గంటా వారిపాలెంలోనే ముఖ్యమంత్రి రెస్ట్ తీసుకుంటారని చెబుతున్నారు. ఈ విషయాన్ని వైసీపీ నేతలు మరోవిధంగా చెబుతున్నారు. గతంలో ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి. అప్పట్లో విమర్శలు కూడా అదే రేంజ్‌లో వచ్చాయని అంటున్నారు. ఎన్నికల సమయం కావడంతో మళ్లీ అలాంటి కార్యక్రమం నిర్వహించ డం మంచిది కాదన్నది సీనియర్ నేతల మాట. ఈ క్రమంలో ఉగాది వేడుకలను రద్దు చేసినట్టు జోరుగా ప్రచారం సాగుతోంది.

ఉగాది వేడుకలను రద్దు చేయడంతో టీడీపీ నేతలు రియాక్టయ్యారు. బహుశా ఈసారి జగన్‌కు రాజయోగం ఉండదని ముందే తెలుసుకున్నారని అంటున్నారు. ఆ విషయం తెలిసే ముందుగా  ఉగాది వేడుకలు రద్దు చేసుకున్నారని చెబుతున్నారు. మరి దీనిపై ప్రభుత్వం ఏ విధంగా క్లారిటీ ఇస్తుందో చూడాలి.

Related News

Tirumala Laddu: ఛీ, ఇంత నీచమా? ఏపీ ప్రజల సెంటిమెంట్‌పై గట్టి దెబ్బ.. వైసీపీని ఈ పాపం వెంటాడుతుందా?

Adani Foundation: ఏపీ వరద బాధితులకు అదానీ ఫౌండేషన్ భారీ విరాళం.. ఎంతనో తెలిస్తే ఆశ్చర్యపోతారు!

Tirupati Laddu: తిరుమల లడ్డూ ప్రసాదంలో గొడ్డు మాంసం? ఇదిగో ప్రూఫ్.. ల్యాబ్ టెస్ట్‌లో బయటపడింది ఇదే

Balineni Comments: జగన్ ఏరోజూ సభల్లో నా గురించి మాట్లాడలేదు.. అందుకే పార్టీని వీడా: బాలినేని

Ambati Rambabu: నాణ్యమైన మద్యం అంటే ఏంటి..? ఎంత తాగినా ఆరోగ్యం దెబ్బతినదా..? : అంబటి ఎద్దేవా

YS Jagan: జగన్‌కు మరో భారీ షాక్… తగలనుందా..?

YV Subba Reddy: పెద్ద పాపమే చేశాడు.. చంద్రబాబుకు సుబ్బారెడ్డి కౌంటర్

Big Stories

×