EPAPER

IPL 2024 MI Won the Match: స్టబ్స్ పోరాటం వృథా.. ఐపీఎల్ 2024లో ముంబై తొలి విజయం!

IPL 2024 MI Won the Match: స్టబ్స్ పోరాటం వృథా.. ఐపీఎల్ 2024లో ముంబై తొలి విజయం!
Mumbai Indians vs Delhi Capitals
Mumbai Indians vs Delhi Capitals

Mumbai Indians Records 1st Win in IPL 2024 against Delhi Capitals: ముంబై వాంఖడే వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ విజయం సాధించింది. కాగా ముంబైకి ఈ సీజన్‌లో తొలి విజయం. 235 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ 29 పరుగుల తేడాతో ఓటమి చవిచూసింది. ట్రిస్టన్ స్టబ్స్(71*, 25 బంతుల్లో), పృథ్వీ షా(66, 40 బంతుల్లో) రాణించడంతో 8 వికెట్ల నష్టానికి 205 పరుగులు చేసింది. దీంతో 29 పరుగులతో ఓటమి మూటగట్టుకుంది.


అంతకుముందు రోహిత్ శర్మ(49, 27 బంతుల్లో), ఇషాన్ కిషన్(42, 23 బంతుల్లో), టిమ్ డేవిడ్(45*, 21 బంతుల్లో), షెపర్డ్(39*, 10 బంతుల్లో) చెలరేగడంతో ముంబై 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 234 పరుగులు చేసింది.

పృథ్వీ షో.. స్టబ్స్ వీరవిహారం..

235 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్‌కు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. 10 పరుగలు చేసిన వార్నర్ షెపర్డ్ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు. ఇక ఆ తర్వాత పృథ్వీ షా తో అభిషేక్ పోరెల్ జత కట్టాడు. ఇద్దరు కలిసి ముంబై బౌలర్లపై ఆధిపత్యం చెలాయించారు. ఈ దశలో పృథ్వీ షా హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు.


Also Read: Romario Shepherd: ముంబైని గెలిపించిన వీరుడు.. రొమారియో షెఫర్డ్

66 పరుగులు చేసిన షా.. బుమ్రా వేసిన అద్భుతమైన యార్కర్‌కు బోల్తా కొట్టాడు. దీంతో 110 పరుగుల వద్ద ఢిల్లీ రెండో వికెట్ కోల్పోయింది. ఈ దశలో క్రీజులోకి వచ్చిన స్టబ్స్ సిక్సర్లతో చెలరేగాడు. ఈ దశలో 41 పరుగులు చేసిన పోరెల్ బుమ్రా బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు. చివర్లో స్టబ్స్ చెలరేగినా ఇతరుల నుంచి సహకారం లఢింయకపోవడంతో ఢిల్లీ 8 వికెట్లు కోల్పోయి 205 పరుగులు చేసింది.

చెలరేగిన రోహిత్.. షెపర్డ్ విధ్వంసం

టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ముంబైకు ఓపెనర్లు శుభారంభం అందించారు. రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్ రెచ్చిపోవడంతో ముంబై కేవలం 4.1 ఓవర్లలో 50 పరుగులు చేసింది. ముఖ్యంగా రోహిత్ శర్మ తనదైన శైలిలో రెచ్చిపోయాడు. రిచర్డ్‌సన్ వేసిన 4వ ఓవర్లో రెండు సిక్సర్లు, అక్షర్ పటేల్ వేసిన 5వ ఓవర్లో ఒక సిక్స్, ఒక ఫోర్ కొట్టడంతో ముంబై భారీ స్కోర్ దిశగా అడుగులు వేస్తోంది. ఈ దశలో 49 పరుగులు చేసిన రోహిత్ శర్మ అక్షర్ పటేల్ బౌలింగ్‌లో బౌల్డ్ అయ్యాడు. ఆ తర్వాత సూర్యకుమార్ యాదవ్ డకౌట్ అయ్యాడు. మరో ఓపెనర్ ఇషాన్ కిషన్ 42 పరుగులు చేసి 3వ వికెట్ రూపంలో వెనుదిరిగాడు. కాసేపటికే 6 పరుగులు చేసి తిలక్ వర్మ పెవిలియన్ చేరాడు.

Also Read: CSK vs KKR Live Updates: కోల్‌కతాతో మ్యాచ్.. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న చెన్నై..

39 పరుగులు చేసిన హార్ధిక్ పాండ్యా వెనుదిరగడంతో క్రీజులోకి వచ్చిన వెస్టిండీస్ క్రికెటర్ రోమేరియో షెపర్డ్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. ముఖ్యంగా నోకియా వేసిన 20వ ఓవర్లో షెపర్డ్ 4,6,6,6,4,6 కొట్టడంతో ఆ ఓవర్లో 32 పరుగులు వచ్చాయి. మొత్తంగా 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 234 పరుగులు చేసింది.

Related News

IND vs BAN: అదరగొట్టిన ఆల్ రౌండర్లు : అశ్విన్ సెంచరీ, జడేజా 86 నాటౌట్

Pakistan: మీరింక మారరా…బ్యాట్‌తో బలంగా కొట్టుకున్న పాక్ ప్లేయర్..వీడియో వైరల్‌ !

IND vs BAN Test Match: టెస్టు మ్యాచ్ ఫ్రీ గా.. చూడాలని అనుకుంటున్నారా?

Nikhat Zareen: డీఎస్పీగా గ్రూప్ -1 ఉద్యోగంలో.. తెలంగాణ మహిళా బాక్సర్

SA vs AFG: వన్డే క్రికెట్‌లో పెను సంచలనం..మొదటిసారి దక్షిణాఫ్రికాపై విజయం..

India vs Bangladesh: ఇవాళ్టి నుంచే తొలి టెస్ట్..ఆ ఇద్దరు డేంజరస్ ప్లేయర్లు ఔట్ !

IND vs BAN: వాళ్లిద్దరినీ ఎందుకు తీసుకోవడం లేదంటే: గౌతం గంభీర్

Big Stories

×