Ratnadeep Fire Accident : హైదరాబాద్ నగరంలోని రాజేంద్రనగర్ లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. రాజేంద్రనగర్ పరిధిలో గల బండ్లగూడ రత్నదీప్ సెలెక్ట్ సూపర్ మార్కెట్ లో మంటలు చెలరేగాయి. సిబ్బంది సూపర్ మార్కెట్ లో మరమ్మతులు చేస్తుండగా ఒక్కసారిగా మంటలొచ్చాయి. దీంతో సిబ్బంది ఆ మంటలను చూసి పరుగు తీశారు.
సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా ప్రాంతానికి చేరుకున్నారు. రెండు ఫైరింజన్లతో మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు. మంటలు భారీగా ఎగసి పడుతుండటంతో ఆ ప్రాంతమంతా నల్లటి పొగ అలుముకుంది. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
రాజేంద్రనగర్ లో భారీ అగ్ని ప్రమాదం
బండ్లగూడ రత్నదీప్ సెలెక్ట్ సూపర్ మార్కెట్లో చెలరేగిన మంటలు.
మరమ్మత్తులు చేస్తుండగా ప్రమాదం.. పరుగులు తీసిన సిబ్బంది.
దట్టంగా వ్యాపించిన పొగ.. మంటలు అదుపు చేస్తున్న అగ్నిమాపక సిబ్బంది.#Telangana #rajendranagar #fireaccident #newsupdate… pic.twitter.com/tbTZsncmlp— BIG TV Breaking News (@bigtvtelugu) April 7, 2024