EPAPER

Rahul comments on Phone tapping: వారిద్దరూ ఫోన్ ట్యాపింగ్ వీరులే.. ఎవరా వ్యక్తులు?

Rahul comments on Phone tapping: వారిద్దరూ ఫోన్ ట్యాపింగ్ వీరులే.. ఎవరా వ్యక్తులు?

Rahulgandhi comments on Modi and Kcr for Tapped Phones issues


Rahul comments Phone tapping: దేశవ్యాప్తంగా రెండు అంశాలపై ప్రధానంగా చర్చ జరుగుతోంది. ఒకటి ఫోన్ ట్యాపింగ్, మరొకటి ఎన్నికల బాండ్లు. ఈ రెండు అంశాలపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తెలంగాణలోని కేసీఆర్ ప్రభుత్వం హయాంలో వేల మంది ఫోన్లు ట్యాప్ చేశారని ఆరోపించారు. ముఖ్యంగా దర్యాప్తు సంస్థలను, పోలీసులను తప్పుదారిలో ఉపయోగించుకున్నారని ధ్వజమెత్తారు. ప్రభుత్వం మారిన వెంటనే ఆ డేటాను మూసీ నదిలో పడేశారని ఆరోపించారు. ప్రస్తుతం తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ పై విచారణ జరుగుతోందని, అసలు నిజాలు వెలుగులోకి వస్తాయన్నారు.

ఆదివారం తుక్కుగూడ జనజాతర సభకు హాజరైన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ ఫోన్ ట్యాపింగ్ అంశం పై నోరు విప్పారు. ఫోన్ల ట్యాపింగ్ అంశం తెలంగాణ రాజకీయాలను కుదిపేస్తోంది. దీనిపై రేవంత్‌రెడ్డి సర్కార్ దృష్టి సారించింది. ఈ కేసులో మాజీ డీసీపీతోపాటు పలువురు పోలీసు అధికారులు అరెస్టయ్యారు. వారిపై ప్రస్తుతం తెలంగాణ అధికారులు విచారణ చేస్తున్నారు. ఈ కేసులో తీగలాగే కొద్దీ డొంక కదులుతోంది.


గతంలో టాస్క్‌ఫోర్స్ అధికారులు అప్పటి అధికార పార్టీకి కొమ్ముకాయడం, గత అసెంబ్లీ ఎన్నికల్లో ప్రత్యర్థులను కట్టడి చేయడం, నగదు పోలీసు వాహనాల్లో తరలించినట్టు విచారణలో అరెస్టయిన అధికారులు అంగీకరించారు. ఈ కేసులో రేపో మాపే అప్పటి ప్రభుత్వం ముఖ్యనేతలకు నోటీసులు ఇచ్చేందుకు రంగం సిద్ధమైంది. ఈ క్రమంలో రాహుల్ ఫోన్ ట్యాపింగ్ అంశంపై నోరు విప్పడం తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. రానున్న రోజుల్లో ఈ కేసులో ఇంకెన్ని పెద్ద తలకాయలు పేర్లు వెలుగులోకి వస్తాయోనని చర్చించుకోవడం నేతల వంతైంది.

మోదీ సర్కార్ కూడా నేతల ఫోన్లు ట్యాపింగ్ చేస్తోందని తక్కుగూడ సభలో మండిపడ్డారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ. సరిగ్గా మూడేళ్ల కిందట అక్టోబరులో కూడా ఫోన్ ట్యాపింగ్ అంశం తీవ్ర దుమారం రేపింది. ఇజ్రాయెల్‌కి చెందిన పెగాసెస్ సాప్ట్‌వేర్ ద్వారా మానవ హక్కుల కార్యకర్తలు, జర్నలిస్టులు, రాజకీయ నేతలపై నిఘా పెట్టారని తీవ్ర ఆరోపణలు వచ్చాయి. ఈ విషయాన్ని వాట్సాప్ కూడా అంగీకరించింది. ఈ అంశంపై పార్లమెంటు ఉభయసభలు దద్దరిల్లాయి. చివరకు ఓ స్టేట్‌మెంట్‌తో సరిపెట్టుకుంది మోదీ సర్కార్. అయినా నేతలు మాత్రం ఇంకా అనుమానిస్తూనే ఉన్నారు. తమ ఫోన్లు ట్యాపింగ్ అవుతున్నాయని గొంతు ఎత్తుతున్నారు. ఈ విషయంలో మోదీ సర్కార్‌కు కేసీఆర్ బీ టీమ్‌గా వర్ణించారు.

ALSO READ:  బీఆర్ఎస్‌ను తుక్కుతుక్కు చేసినట్టే బీజేపీని చేయాలి..

ఇక రెండో అంశం ఎలక్టోరల్ బాండ్స్. ప్రపంచంలోనే ఇది అతిపెద్ద స్కామ్‌గా వర్ణించారు రాహుల్‌గాంధీ. దర్యాప్తు సంస్థలను ఉపయోగించుకుని కంపెనీల నుంచి బీజేపీ నగదు వసూలు చేసిందని అన్నారు. ఎలక్టోరల్ బాండ్స్‌పై ఇటీవల సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెల్లడించింది. దీని ప్రకారం ఏ పార్టీకి ఎంతెంత నిధులు వచ్చాయో న్యాయస్థానం ఆదేశాల మేరకు ఎన్నికల సంఘం పబ్లిక్ డెమైన్‌లో పెట్టింది. ఇందులో అత్యధిక భాగం బీజేపీకే వచ్చినట్టు తేలింది. దీంతో విపక్షాలు కేంద్రంలోని బీజేపీ సర్కార్‌పై విమర్శలు కంటిన్యూ చేస్తున్నాయి. ఇక కాంగ్రెస్ పార్టీ బ్యాంక్ అకౌంట్లను బ్లాక్ చేయడంపైనా మండిపడ్డారు రాహుల్‌గాంధీ. రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడానికే తాము పోరాటం చేస్తున్నామన్నారు. కేవలం మూడు శాతం ప్రజల కోసమే మోదీ పని చేస్తున్నారని విమర్శించారు. మరి రానున్న రోజుల్లో ఈ అంశాలు ఇంకెన్ని మలుపులు తిరుగుతాయో చూడాలి.

 

Tags

Related News

Hansika Motwani: అసభ్యకరంగా తాకాడు.. నొప్పి భరించలేకపోయా అంటూ హన్సిక ఎమోషనల్..!

Mokshagna: తొలి మూవీ బడ్జెట్ ఎంతో తెలుసా.. ఆల్ టైం రికార్డ్ సృష్టించబోతున్న బాలయ్య..!

Nagabubu: నాగబాబు సెటైరికల్ పోస్ట్.. జానీ మాస్టర్ కేనా..?

Jani Master : కేసులో మరో ట్విస్ట్.. కూపీ లాగనున్న మహిళా కొరియోగ్రాఫర్..!

Bigg Boss 8 Day 18 Promo: హౌస్ లో పెద్ద డ్రామా నడుస్తోందే.. సోనియా కి ఝలక్ ఇచ్చిన నబీల్..!

Heroine Poorna: తల్లిని నిందించారు.. హేళన మాటలపై పూర్ణ ఎమోషనల్..!

NaniOdela2: ఫ్యాన్స్ గెట్ రెడీ.. మాస్ జాతరకు సిద్ధం కండమ్మా..!

Big Stories

×