EPAPER

RR vs RCB Live Updates: బట్లర్ సెంచరీ.. కోహ్లీ శతకం వృథా..

RR vs RCB Live Updates: బట్లర్ సెంచరీ.. కోహ్లీ శతకం వృథా..
Rajasthan Royals vs Royal Challengers Bengaluru Live Updates
Rajasthan Royals vs Royal Challengers Bengaluru Live Updates

Rajasthan Royals vs Royal Challengers Bengaluru Live Updates: జైపూర్ వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరుగుతున్న మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ ఘనవిజయం సాధించింది. జాస్ బట్లర్(100*, 58 బంతుల్లో) సెంచరీతో చెలరేగడంతో రాయల్స్ 6 వికెట్ల తేడాతో గెలుపొందింది.


అంతకుముందు విరాట్ కోహ్లీ(113*, 72 బంతుల్లో 12X4, 4X6) సెంచరీతో కదం తొక్కాడు. విరాట్, డూ ప్లెసిస్(44) రాణించడంతో బెంగళూరు 3 వికెట్ల నష్టానికి 183 పరుగులు చేసింది.

బట్లర్ వీరవిహారం..

184 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్థాన్‌కు తొలి ఓవర్లోనే ఎదురుదెబ్బ తగిలింది. ఇన్నింగ్స్ రెండో బంతికి యశస్వి జైస్వాల్ డకౌట్ అయ్యాడు. ఆ తరువాత జాస్ బట్లర్, సంజూ శాంసన్ రెచ్చిపోయారు. పవర్ ప్లే ముగిసేసరికి 54 పరుగులు చేశారు. ఈ దశలో బట్లర్, శాంసన్ ఇద్దరూ హాఫ్ సెంచరీలు చేశారు.


బట్లర్ 30 బంతుల్లో చేయగా.. శాంసన్ 33 బంతుల్లో హాఫ్ సెంచరీ చేశారు. 148 పరుగులు జోడించిన తర్వాత సిరాజ్ ఈ జంటను విడదీశాడు. 69 పరుగులు చేసిన శాంసన్‌ను సిరాజ్ పెవిలియన్‌కు పంపాడు. ఈ తర్వాత రియాన్ పరాగ్ 4 పరుగులు మాత్రమే చేసి యశ్ దయాల్ చేతిలో అవుట్ అయ్యాడు. ఆ తరువాత ధ్రువ్ జురెల్ 2 పరుగులు మాత్రమే చేసి అవుట్ అయ్యాడు. 21 బంతుల్లో 20 పరుగులు చేయాల్సిన తరుణంలో బట్లర్, హెట్‌మెయిర్ లాంఛనాలు పూర్తి చేశారు.

రెచ్చిపోయిన కోహ్లీ

టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన బెంగళూరుకు ఓపెనర్లు కోహ్లీ, డూ ప్లెసిస్ రెచ్చిపోయారు. ఓపెనర్లు ఇద్దరూ చెలరేగడంతో పవర్ ప్లే ముగిసేసరికి వికెట్ నష్టపోకుండా 53 పరుగులు చేశారు. బౌల్ట్ వేసిన ఇన్నింగ్స్ 9వ ఓవర్లో డూ ప్లెసిస్ రెండు సిక్సర్లు కొట్టడంతో ఆ ఓవర్లో 16 పరుగుల వచ్చాయి. ఈ దశలో 39 బంతుల్లోనే కోహ్లీ హాఫ్ సెంచరీ చేశాడు.

ఈ దశలో 44 పరుగులు చేసిన డూ ప్లెసిస్ చాహల్ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు. దీంతో 125 పరుగుల వద్ద ఆర్సీబీ తొలి వికెట్ కోల్పోయింది. ఆ తరువాత మ్యాక్స్‌వెల్ ఒక్క పరుగు మాత్రమే చేసి బర్గర్ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు. 9 పరుగులు చేసిన సౌరవ్ చౌహాన్ చాహల్ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు. ఈ దశలో కోహ్లీ కేవలం 67 బంతుల్లోనే సెంచరీ చేశాడు. అవేశ్ ఖాన్ వేసిన చివరి ఓవర్లో కోహ్లీ 3 ఫోర్లు కొట్టడంతో బెంగళూరు 183 పరుగులు చేసింది.

Related News

IND vs BAN: అదరగొట్టిన ఆల్ రౌండర్లు : అశ్విన్ సెంచరీ, జడేజా 86 నాటౌట్

Pakistan: మీరింక మారరా…బ్యాట్‌తో బలంగా కొట్టుకున్న పాక్ ప్లేయర్..వీడియో వైరల్‌ !

IND vs BAN Test Match: టెస్టు మ్యాచ్ ఫ్రీ గా.. చూడాలని అనుకుంటున్నారా?

Nikhat Zareen: డీఎస్పీగా గ్రూప్ -1 ఉద్యోగంలో.. తెలంగాణ మహిళా బాక్సర్

SA vs AFG: వన్డే క్రికెట్‌లో పెను సంచలనం..మొదటిసారి దక్షిణాఫ్రికాపై విజయం..

India vs Bangladesh: ఇవాళ్టి నుంచే తొలి టెస్ట్..ఆ ఇద్దరు డేంజరస్ ప్లేయర్లు ఔట్ !

IND vs BAN: వాళ్లిద్దరినీ ఎందుకు తీసుకోవడం లేదంటే: గౌతం గంభీర్

Big Stories

×