EPAPER

WhatsApp : వాట్సాప్ నుంచి మరో కొత్త ఫీచర్.. వీడియోలు కూడా చూడొచ్చు!

WhatsApp : వాట్సాప్ నుంచి మరో కొత్త ఫీచర్.. వీడియోలు కూడా చూడొచ్చు!
WhatsApp
WhatsApp

WhatsApp : వాట్సాప్ ప్రముఖ చాటింగ్ యాప్.  ఉదయం నిద్రలేవగానే వాట్సాప్ వాడకుండా రోజు మొదలు కాదు. వాట్సాప్‌లో స్టేటస్ పెట్టకుంటే మనసు మనసులా ఉండదు. దీనిని ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల మంది వినియోగిస్తున్నారు. వాట్సాప్ యాజర్స్ భదత్రకు అధిక ప్రాధాన్యత ఇస్తుంది. యూజర్ ఫ్రెండ్లీ ఫీచర్లను తీసుకొస్తుంటుంది. ఈ నేపథ్యంలో ఇటీవలే అనేక ఫీచర్లను పరిచయం చేసింది. అయితే వాట్సాప్ ఇప్పటికే వీడియో కాల్‌ కోసం పిక్చర్-ఇన్-పిక్చర్ మోడ్‌ను డెవలప్ చేసింది.


ఈ ఫీచర్ ద్వారా వీడియో కాల్‌కు అంతరాయం కలిగించకుండా స్మార్ట్‌ఫోన్‌లో ఇతర యాప్‌లను ఉపయోగించవచ్చు. ఇది చాలా మంచి ఫీచర్. ఇది వీడియో కాల్ సమయంలో వినియోగదారులు ఏదైనా ఇతర ముఖ్యమైన పనిని సులభతరం చేస్తుంది. కానీ ఇప్పుడు వీడియోలు చూసేందుకు కూడా కొత్త ఫీచర్‌ను తీసుకురాబోతుంది. ఒక నివేదిక ప్రకారం.. వినియోగదారులు వీడియోలను చూడటానికి పిక్చర్-ఇన్-పిక్చర్ మోడ్‌ను కూడా వినియోగించవచ్చు.

Also Read : ఏముంది భయ్యా ఏథర్‌ Halo స్మార్ట్‌ హెల్మెట్‌.. పిచ్చెక్కిస్తోన్న ఫీచర్లు!


WABetaInfo నివేదిక ప్రకారం.. వినియోగదారులకు వీడియో వీక్షణ అనుభవాన్ని మెరుగుపరచడానికి WhatsApp కొత్త ఫీచర్లను తీసుకురావడానికి కృషి చేస్తోంది. ఈ ప్రత్యేక లక్షణాలలో ఒకటి పిక్చర్-ఇన్-పిక్చర్ మోడ్. ఈ మోడ్ సహాయంతో వినియోగదారులు వీడియోలను చూస్తున్నప్పుడు ఇతర చాట్‌లు లేదా వాట్సాప్‌లోని ఇతర ఫీచర్లను ఉపయోగించగలరు.

అయితే ఇప్పటి వరకు మీరు వాట్సాప్‌లో పిక్చర్-ఇన్-పిక్చర్ మోడ్‌లో యూట్యూబ్‌తో పాటు ఇన్‌స్టాగ్రామ్ వీడియోలను చూడవచ్చు. అయితే ఈ ఫీచర్ నేరుగా వాట్సాప్‌లో షేర్ చేయబడిన వీడియోలకు అందుబాటులో లేదు. కానీ ఈ కొత్త ఫీచర్ వచ్చిన తర్వాత మీరు WhatsAppలో షేర్ చేసిన వీడియోను చూస్తున్నప్పుడు కూడా మీరు చాట్ చేయగలుగుతారు.

Also Read : ఈ-సిమ్ అంటే ఏమిటి..? దాన్ని ఎలా యాక్టివ్ చేయాలి..?

మరో విషయం ఏమిటంటే.. ఈ పిక్చర్-ఇన్-పిక్చర్ మోడ్ WhatsApp లోపల మాత్రమే పని చేస్తుంది. అంటే మీరు వీడియో చూస్తున్నప్పుడు మరే ఇతర యాప్‌కి మారలేరు. వాట్సాప్ పిక్చర్-ఇన్-పిక్చర్ ఫీచర్‌ను తీసుకురావడం ద్వారా వినియోగదారుల మరింత బెటర్ యూజర్ ఫీల్‌ను వాట్సాప్ ఇవ్వాలని భావిస్తోంది. దీంతో యూజర్లు ఏ పని చేసినా అంతరాయం లేకుండా వీడియో ప్లే అవుతూనే ఉంటుంది. అలానే ఇది యాప్‌లో మల్టీ టాస్కింగ్ చేయడాన్ని సులభతరం చేస్తుంది.

Tags

Related News

Iphone 16 Series: ఐఫోన్ 16, ప్లస్, ప్రో, ప్రో మాక్స్ సేల్ షురూ.. ధరలు, ఆఫర్లు, ఫీచర్లు ఫుల్ డీటెయిల్స్!

Vivo T3 Ultra: అల్ట్రా ఫస్ట్ సేల్‌‌కి వచ్చేసింది.. భారీ డిస్కౌంట్ పొందొచ్చు, కెమెరాలో తోపు అంటే ఇదేనేమో!

iPhone16 series: ఐఫోన్ 16 సిరీస్.. ఫస్ట్ సేల్ ప్రారంభం, బారులు తీరిన జనం..

Moto G85 5G: మరో రెండు కొత్త కలర్‌ వేరియంట్‌లలో మోటో ఫోన్.. ఫీచర్లు అదుర్స్, ధర ఎంతంటే?

iQoo Z9 Turbo+: అ అ అదుర్స్.. 6400 mAh బ్యాటరీతో ఐక్యూ కొత్త ఫోన్, ఫీచర్లు పిచ్చెక్కించాయ్ బాబోయ్!

Honor 200 Lite 5G: హమ్మయ్య వచ్చేసింది.. AI ఫీచర్లు, 108MP కెమెరాతో కొత్త ఫోన్ లాంచ్, ధర చాలా తక్కువ!

Vivo V40e: ఊహించలేదు భయ్యా.. వివో నుంచి కొత్త ఫోన్, కీలక ఫీచర్లు వెల్లడి!

Big Stories

×