EPAPER

Halo Smart Helmet : ఏముంది భయ్యా ఏథర్‌ Halo స్మార్ట్‌ హెల్మెట్‌.. పిచ్చెక్కిస్తోన్న ఫీచర్లు!

Halo Smart Helmet : ఏముంది భయ్యా ఏథర్‌ Halo స్మార్ట్‌ హెల్మెట్‌.. పిచ్చెక్కిస్తోన్న ఫీచర్లు!
Halo Smart Helmet
Halo Smart Helmet

Halo Smart Helmet : మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా.. ఆటోమొబైల్ కంపెనీలు కూడా ఎప్పటికప్పుడు అప్‌డేట్‌ అవుతూనే ఉన్నాయి. వాహనాల్లో అధునాతన ఫీచర్లను తీసుకువస్తున్నాయి. హెల్మెట్‌లో కూడా టెక్‌ ఫీచర్లను తీసుకొస్తున్నాయి. ఈ మేరకు పాపులర్ ఎలక్ట్రిక్ టూ వీలర్‌ తయారీ సంస్థ ఏథర్‌ ఎనర్జీ తన ఫ్యామిలీ స్కూటర్ ఏథర్‌ రిజ్టాతో పాటుగా Halo Smart Helmet ను లాంచ్‌ చేసింది. దీనిలో అధునాత ఫీచర్లు రైడర్లకు మంచి అనుభూతిని ఇస్తాయి. ఈ హెల్మెట్‌లోని ఫీచర్ల గురించి తెలుసుకోండి.


ఏథర్‌ ఎనర్జీ హాలో స్మార్ట్‌ హెల్మెట్‌లో మ్యూజిక్‌ వినొచ్చు. కాల్ రిసెప్షన్ కోసం ఇంటిగ్రేటెడ్ స్పీకర్లు కూడా ఉన్నాయి. ఇది నాయిస్ క్యాన్సిలేషన్, బ్లూటూత్‌కు సపోర్ట్‌తో వస్తుంది. ఇందులో బ్యాటరీ సింగిల్ ఛార్జ్‌తో ఒక వారం వరకు వస్తుంది. ఈ హలో స్మార్ట్ హెల్మెట్ ధర రూ. 14,999గా ఉంది. ప్రస్తుతం ఉన్న ఆఫర్ కింద రూ. 12,999కే దక్కించుకోవచ్చు.

Also Read : ఏథర్ రిజ్టా వచ్చేసింది.. ఇది పక్కా ఫ్యామిలీ స్కూటర్!


ఇక ఏథర్‌ రిజ్జా తన Ather Stack 6 సాఫ్ట్‌వేర్‌‌లో బెస్ట్ అప్‌గ్రేడ్‌లు తీసుకొచ్చింది. ఇది రైడింగ్‌‌ను మెరుగుపరుస్తుంది. కొత్త Ather‌లో మెరుగైన డ్యాష్‌బోర్డ్ , మెరుగైన GPS యాక్టివిటీస్‌, మంచి డిస్‌ప్లే ఉంటుంది.

ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్‌తో పాటు Ride Stories అనే ఫీచర్ తీసుకొచ్చింది. ఈ ఫీచర్ ద్వారా కస్టమర్‌లకు ఇంటరాక్టివ్ అనుభవాన్ని మెరుగుపరుస్తుంది. ఇది మీ రైడ్ హైలైట్‌లను కూడా చూపిస్తుంది. అంతేకాకుండా ఈ స్కూటర్‌ డ్యాష్‌బోర్డ్‌లో WhatsApp ఇంటిగ్రేషన్ ఫీచర్ కూడా ఇచ్చారు.

Also Read : చీపెస్ట్ స్మార్ట్‌ఫోన్లను లాంచ్ చేయనున్న వివో.. ప్రైజ్ ఎంతంటే?

అలానే రైడింగ్‌లో ఉన్నప్పుడు ఫోన్‌ చూసుకోవాల్సిన అవసరం లేదు. స్మార్ట్‌ ఫోన్‌ కనెక్టివిటీ ద్వారా.. Ather Stack ద్వారా వాట్సాప్‌ మెసేజ్‌లు, కాల్స్‌ను యాక్సెస్‌ చేయవచ్చు. అంతేకాకుండా లొకేషన్ షేరింగ్ ఆప్షన్ కూడా ఉంది. వీటితో పాటు Ping My Scooter ఫీచర్‌ ఉంది. దీని ద్వారా పార్కింగ్ సమయంలో సులభవంగా మీ స్కూటర్‌ను గుర్తించవచ్చు. ఇందుకోసం ఏథర్ 40 వాయిస్ ప్రాంప్ట్‌లను డెవలప్ చేసింది. వీటి ద్వారా మీ రైడ్ చాలా స్మార్ట్‌గా ఉంటుంది.

Tags

Related News

Airtel Cheap Recharge Plan: ఎయిర్‌టెల్ కస్టమర్లకు గుడ్‌న్యూస్.. వెరీ చీపెస్ట్ రీఛార్జ్ ప్లాన్, 1.5GB డేటా పొందొచ్చు!

Xiaomi 15 Series: షియోమి నుంచి కొత్త ఫోన్లు.. 90W ఫాస్ట్ ఛార్జింగ్‌ సపోర్ట్‌తో లాంచ్‌కు రెడీ, స్పెసిఫికేషన్లు అదిరిపోయాయ్!

Iphone 16 Series: ఐఫోన్ 16, ప్లస్, ప్రో, ప్రో మాక్స్ సేల్ షురూ.. ధరలు, ఆఫర్లు, ఫీచర్లు ఫుల్ డీటెయిల్స్!

Vivo T3 Ultra: అల్ట్రా ఫస్ట్ సేల్‌‌కి వచ్చేసింది.. భారీ డిస్కౌంట్ పొందొచ్చు, కెమెరాలో తోపు అంటే ఇదేనేమో!

iPhone16 series: ఐఫోన్ 16 సిరీస్.. ఫస్ట్ సేల్ ప్రారంభం, బారులు తీరిన జనం..

Moto G85 5G: మరో రెండు కొత్త కలర్‌ వేరియంట్‌లలో మోటో ఫోన్.. ఫీచర్లు అదుర్స్, ధర ఎంతంటే?

iQoo Z9 Turbo+: అ అ అదుర్స్.. 6400 mAh బ్యాటరీతో ఐక్యూ కొత్త ఫోన్, ఫీచర్లు పిచ్చెక్కించాయ్ బాబోయ్!

Big Stories

×