EPAPER

Ice Bath: సెలబ్రిటీలు ఐస్ బాత్ ఎందుకు చేస్తారో మీకు తెలుసా..?

Ice Bath: సెలబ్రిటీలు ఐస్ బాత్ ఎందుకు చేస్తారో మీకు తెలుసా..?


Ice Bath: చాలా మంది సెలబ్రిటీ సిక్రెట్స్ తెలుసుకోవాలని ఆసక్తి చూపిస్తుంటారు. సెలబ్రిటీలు వాడే వస్తువులు వాడి, అందంగా కనిపించాలని కళలు కంటుంటారు. అయితే ఇలా సెలబ్రిటీ విషయానికి సంబంధించి సోషల్ మీడియాలో ఏదో ఒక కొత్త ట్రెండ్ అనేది పుట్టుకొస్తూనే ఉంటుంది. ఒక్కసారి ఒక హీరోయిన్ మంచి చీర కడితే దానిని చూసి రిక్రియేట్ అంటూ వేల వీడియోలు పెట్టుకొస్తూనే ఉంటాయి. ధరించే దుస్తులపైనే ఇలా ఉంటే.. ఇక అందం గురించి మాటల్లో చెప్పాల్సిన అవసరం లేదు. ఇటీవల ఐస్ బాత్ చేస్తూ సోషల్ మీడియాలో ఫోటోలు ట్రెండ్ అవుతూనే ఉన్నాయి. ఐస్ నీళ్లతో చేసే ఈ బాత్ ను క్రయోథెరపీ అంటారు. ఇలా చేయడం వల్ల అనేక ప్రయోజనాలు ఉంటాయి.

చర్మానికి, మానసిక ఆరోగ్యానికి ఐస్ బాత్ అనేది చాలా మేలు చేస్తుంది. అయితే దీని వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో తెలుసుకుందాం. ఐస్ బాత్ అంటే ఏంటని చాలా మందికి తెలియదు. ఐస్ బాత్ అంటే చాలా చల్లటి నీటితో స్నానం చేయడం అని అర్థం. 11 నిమిషాల నుంచి 15 నిమిషాల పాటు చల్లటి నీటిలో ఉండాలి. దాదాపు 50 నుంచి 59 డిగ్రీల ఫారెన్ హీట్ మధ్య ఈ నీటిని చల్లబరుస్తారు. అయితే దీనిని అథ్లెట్లు వ్యాయామం తర్వాత ఉపయోగిస్తుంటారు. దీనిని చాలా మంది సెలబ్రిటీలు కూడా చేస్తుంటారు. ఈ ఐస్ బాత్ కారణంగా కండరాలు రికవరినీ వేగవంతం చేస్తుంది. ఏదైనా ప్రమాదంలో జరిగే గాయాలను కూడా తగ్గిస్తుంది. వ్యాయామం తర్వాత ఈ ఐస్ బాత్ చేయడం వల్ల కండరాల నొప్పి నుంచి ఉపశమనం పొందవచ్చు.


ఐస్‌ బాత్‌ చేయడం వల్ల శరీరంలోని రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. శరీరంలోని కండరాలకు రక్త ప్రవాహాన్ని, ఆక్సిజన్ పంపిణీని పెంచేందుకు తోడ్పడుతుంది. అంతేకాదు ఐస్ బాత్ తో మరిన్ని ప్రయోజనాలు కూడా ఉన్నాయి. ఐస్ బాత్ చేయడం వల్ల మానసిక ఆరోగ్యానికి మేలు చేస్తుంది. మంచి మానసిక ప్రశాంతతను కూడా అందజేస్తుంది. నిరాశ, ఆందోళన వంటి లక్షణాలను తగ్గించడంలోను చాలా బాగా పనిచేస్తుంది. అందువల్ల బాగా అలసటతో ఉన్న సమయంలో ఐస్ బాత్ చేయడం వల్ల మానసిక విశ్రాంతి పొందే అవకాశం ఉంటుందట. రోగనిరోధక వ్యవస్థను కూడా మెరుగుపరుస్తుంది. వ్యాధులు, ఇన్ఫెక్షన్లతో పోరాడటానికి ఇది సహాయపడుతుంది. ఐస్ బాత్ తో ఆరోగ్యంతో పాటు అందాన్ని కూడా పెంచుకోవచ్చు.

Related News

Rosy Cheeks: ఇలా చేస్తే మేకప్ వేసుకోకుండానే ముఖం లేత గులాభీ రంగులో మెరిసిపోతుంది

Ginger Juice Benefits : అల్లం రసం తీసుకుంటే శరీరంలో ఎన్ని మార్పులు జరుగుతాయో తెలుసా !

2050 నాటికి 4 కోట్లకు పైగా మరణాలు.. వాటివల్లే ఆ ముప్పు, తాజా స్టడీలో షాకింగ్ విషయాలు వెల్లడి

Burping: తేన్పులు అతిగా వస్తున్నాయా? మీరు డేంజర్‌లో ఉన్నట్టే!

Tomato Face Pack: పార్లర్‌కు వెళ్లకుండానే టమాటో ఫేస్ ప్యాక్‌తో రెట్టింపు అందం మీ సొంతం !

Prawns Masala: ఆంధ్ర స్టైల్‌లో రొయ్యల మసాలా కూర ఇలా వండరంటే నోరూరిపోతుంది, రెసిపీ ఇదిగోండి

Beauty Tips: ముఖంపై మచ్చలు, ముడతలు పోవాలంటే ప్రతిరోజూ కలబందతో ఇలా చేయండి

Big Stories

×