EPAPER

Health Tips In Summer: తాటి ముంజలతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు.. అందంగా కనిపించాలంటే ఇది బెస్ట్ ఛాయిస్

Health Tips In Summer: తాటి ముంజలతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు.. అందంగా కనిపించాలంటే ఇది బెస్ట్ ఛాయిస్


Health Tips In Summer: సీజనల్ ఫ్రూట్స్ కి ఉండే క్రేజ్ గురించి చెప్పనవసరం లేదు. అందులోను సమ్మర్ సీజన్ వచ్చిందంటే మామిడి కాయలు, తాటి ముంజలు పుష్కలంగా దొరుకుతాయి. ఇందులో ముఖ్యంగా గ్రామాల్లో ఉండేవారికే కాదు.. పట్టణాల్లో ఉండే వారికి కూడా తాటి ముంజలు అంటే చాలా ఇష్టపడతారు. చుడ్డానికి తాటికాయ బయటికి నల్లటి బంతి ఆకారంలో ఉన్నా కూడా లోపల మంచి తెల్లటి జెల్లీని కలిగి ఉంటుంది. దీనిని చిన్న పిల్లల నుంచి పెద్ద వారి వరకు అందరూ ఇష్టంగా తింటుంటారు. తాటి ముంజల్లో సంపూర్ణ పోషకాలు ఉంటాయట. దీని వల్ల శరీరానికి చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయట. మరి అవేంటో తెలుసుకుందాం.

తాటి ముంజలు కేవలం సీజన్ లో మాత్రమే లభిస్తుంది. సీజన్ లో లభించే ఈ పండులో చాలా పోషకాలు ఉంటాయని డాక్టర్లు చెబుతున్నారు. వేసవిలో లభించే ఈ పండులో నీరు ఎక్కువగా ఉంటుంది. అందువల్ల తాటి ముంజలను తింటే శరీరం డీ హైడ్రేట్ కాకుండా ఉండేందుకు తోడ్పడుతుంది. తాటి ముంజల నీటిలోను చాలా కేలరీలు ఉంటాయట. బరువు తగ్గాలని అనుకునే వారికి తాటి ముంజలు చాలా బాగా ఉపయోగపడతాయని చెబుతున్నారు. మరోవైపు ఆరోగ్య సమస్యలకు కూడా తాటికాయ పనిచేస్తుంది. లివర్ సంబంధింత సమస్యలను దూరం చేసేందుకు ఉపయోగపడుతుంది.


తాటికాయ గుజ్జుతో అందమైన చర్మాన్ని కూడా సొంతం చేసుకోవచ్చు. తాటి కాయ గుజ్జును ఫేస్ ప్యాక్ లా తయారుచేసుకుని.. ముఖానికి రాసుకోవాలి. దానిని ఒక పావు గంట పాటు ఆరనివ్వాలి. అనంతరం చల్లటి నీటితో కడిగేయాలి. ఇలా చేయడం వల్ల ముఖంపై మొటిమలు, ఎండకు కమిలి పోవడం, టాన్ వంటి సమస్యలన్నీ తొలగిపోతాయు. ముంజల్లో అనేక రకాల విటమిన్లు ఉంటాయి. విటమిన్ ఎ,బి,సి వంటి విటమిన్లు ఆరోగ్యానికి, చర్మానికి ఉపయోగపడతాయి. ఇక ఇందులో ఉండే ఐరన్, జింక్, ఫాస్పరస్, పొటాషియం వంటివి పుష్కలంగా ఉంటాయి. గర్బిణీ స్త్రీలు వీటిని తీసుకోవడం వల్ల కడుపులోని బిడ్డ ఎదుగుదలకు తోడ్పడుతుంది.

Related News

Multani Mitti Face Pack:ముల్తానీ మిట్టితో స్మూత్, గ్లోయింగ్ స్కిన్..

Rosy Cheeks: ఇలా చేస్తే మేకప్ వేసుకోకుండానే ముఖం లేత గులాభీ రంగులో మెరిసిపోతుంది

Ginger Juice Benefits : అల్లం రసం తీసుకుంటే శరీరంలో ఎన్ని మార్పులు జరుగుతాయో తెలుసా !

2050 నాటికి 4 కోట్లకు పైగా మరణాలు.. వాటివల్లే ఆ ముప్పు, తాజా స్టడీలో షాకింగ్ విషయాలు వెల్లడి

Burping: తేన్పులు అతిగా వస్తున్నాయా? మీరు డేంజర్‌లో ఉన్నట్టే!

Tomato Face Pack: పార్లర్‌కు వెళ్లకుండానే టమాటో ఫేస్ ప్యాక్‌తో రెట్టింపు అందం మీ సొంతం !

Prawns Masala: ఆంధ్ర స్టైల్‌లో రొయ్యల మసాలా కూర ఇలా వండరంటే నోరూరిపోతుంది, రెసిపీ ఇదిగోండి

Big Stories

×