EPAPER

Best Attacking Team in IPL 2024: బెస్ట్ ఎటాకింగ్ జట్టుగా పంజాబ్ రికార్డ్..!

Best Attacking Team in IPL 2024: బెస్ట్ ఎటాకింగ్ జట్టుగా పంజాబ్ రికార్డ్..!
Punjab Kings
Punjab Kings

Best Attacking Team in IPL 2024 Is Punjab Kings 11: పంజాబ్ పేరులోనే ఒక పవర్ ఉంది. వాళ్లెప్పుడూ ఓటమిని అంత తేలిగ్గా  ఒప్పుకోరు. చివరి వరకు పోరాడుతూనే ఉంటారు. అది వాళ్ల బ్లడ్ లోనే ఉంది. వారు పెరిగిన వాతావరణంలోనే ఉంది. కష్టం అంతే పడతారు. ఇష్టపడినా అలాగే ఉంటుంది. పోరాడినా అలాగే ఉంటుంది. ఇప్పుడు క్రికెట్ లో కూడా ఓడిపోతారని అంతా ఫిక్స్ అయిన తర్వాత పంజాబ్ కింగ్స్ గెలిచిన తీరు.. నభూతో నభవిష్యత్ అనాలి.


కెప్టెన్ శుభ్ మన్ గిల్ (89 నాటౌట్) చెలరేగడంతో గుజరాత్ టైటాన్స్ 199 పరుగులు చేసింది. 200 పరుగుల లక్ష్యంతో పంజాబ్ బ్యాటింగ్ కి దిగింది. అయితే టాపార్డర్ లో ధావన్ (1), బెయిర్ స్టో( 22), శామ్ కరాన్ (5), సికందర్ రాజా (15) ఇలా చేసి అవుట్ అయ్యారు.

ఈ సమయంలో అన్ క్యాప్ డ్ ప్లేయర్లు అదరగొట్టారు. ముఖ్యంగా శశాంక్ సింగ్ 29 బంతుల్లో 61 చేసి మ్యాచ్ ని నిలబెట్టాడు. తర్వాత ప్రభ్‌సిమ్రాన్ సింగ్ 24 బంతుల్లో 35 పరుగులు చేశాడు. తర్వాత అశుతోష్ రాణా 17 బంతుల్లో 31 పరుగులు చేసి విజయాన్ని అందించాడు.


ఎటాకింగ్ లో ఇలా పంజాబ్ కింగ్స్ ఓ సరికొత్త రికార్డును సొంతం చేసుకుంది. ప్రత్యర్థి నిర్దేశించిన 200 పరుగులు, అంతకంటే ఎక్కువ టార్గెట్‌ను అత్యధికసార్లు ఛేదించిన తొలి జట్టుగా రికార్డులకెక్కింది. ఇలా మొత్తంగా ఆరు సార్లు 200 ప్లస్ టార్గెట్‌ను అందుకున్న తొలి జట్టుగా పంజాబ్ కింగ్స్ నిలిచింది. 17 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలో పంజాబ్ కింగ్స్ ఎటాకింగ్ రికార్డ్ సొంతం చేసుకుంది.

Also Read: హైదరా‘బాదుడు’మళ్లీ ఉంటుందా? నేడు సన్ రైజర్స్ వర్సెస్ చెన్నయ్ సూపర్ కింగ్స్

ఇప్పటివరకు మోస్ట్ సక్సెస్‌ఫుల్ టీమ్స్‌గా నిలిచిన చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ లాంటి జట్లకు సాధ్యం కాని రికార్డును పంజాబ్ కింగ్స్ సొంతం చేసుకోవడం విశేషం. ఒక్కసారి కూడా ఐపీఎల్ ఛాంపియన్స్ ట్రోఫీ గెలవనప్పటికి ఆటలో తన మార్కు చూపిస్తూనే ఉంది. ఈసారి నుంచి ప్రత్యర్థులు పంజాబ్ ను ఎదుర్కునే ముందు, ఈ అంశాన్ని కూడా పరిగణలోకి తీసుకుంటారని సీనియర్లు వ్యాక్యానిస్తున్నారు.

Related News

India vs Bangladesh 1st Test: భారత్ 376 ఆలౌట్: బంగ్లాదేశ్ 26/3

Shikhar Dhawan: ఆ హాట్‌ బ్యూటీతో గబ్బర్‌ ఎఫైర్‌..సీక్రెట్‌ ఫోటోలు లీక్‌ !

Ravichandran Ashwin: తనే నన్ను ఆడించాడు: సెంచరీ హీరో అశ్విన్

IPL 2025: కోహ్లీ భారీ ప్లాన్‌..RCBలోకి అర్జున్‌ టెండూల్కర్‌ ?

Ravichandran Ashwin: టీమిండియాలో గొడవలు…అశ్విన్‌ ను అవమానించిన గంభీర్‌..?

Mahmud Hasan: మనోళ్లకే చుక్కలు చూపించిన.. హసన్ ఎవరు?

IND vs BAN: అదరగొట్టిన ఆల్ రౌండర్లు : అశ్విన్ సెంచరీ, జడేజా 86 నాటౌట్

Big Stories

×