EPAPER

IPL 2024 – SRH Vs CSK Preview: హైదరా‘బాదుడు’మళ్లీ ఉంటుందా..? నేడు సన్ రైజర్స్ వర్సెస్ చెన్నయ్ సూపర్ కింగ్స్!

IPL 2024 – SRH Vs CSK Preview: హైదరా‘బాదుడు’మళ్లీ ఉంటుందా..? నేడు సన్ రైజర్స్ వర్సెస్ చెన్నయ్ సూపర్ కింగ్స్!
SRH vs CSK
SRH vs CSK

SRH Vs CSK IPL 2024 Match Preview: క్రికెట్ అభిమానులు అందరిమదిలో ఇదే ఆలోచన.. ఉరకలు వేస్తోంది. ఎందుకంటే ఉప్పల్  స్టేడియంలో హైదరబాద్ సన్ రైజర్స్ ఆడనుంది. ఇక మహేంద్ర సింగ్ ధోనీ ఆధ్వర్యంలో నడిచే చెన్నయ్ సూపర్ కింగ్స్ వీరితో పోటీ పడనుంది. ఇంతకీ అభిమానులకి ఎందుకంత ఉత్సాహం అంటే, ముంబై ఇండియన్స్ ని చాకిరేవు పెట్టిన గ్రౌండ్ ఇదే కావడంతో అందరి అంచనాలు మించిపోయాయాయి.


ఇంతవరకు ఈ రెండు జట్ల మధ్య 19 మ్యాచ్ లు జరిగాయి. వీటిలో సీఎస్కే 14 గెలిచింది. 5 సార్లు మాత్రమే సన్ రైజర్స్ విజయం సాధించింది. ఈ లెక్కన చూస్తే సీఎస్కే టాప్ లో ఉన్నా, ప్రస్తుతం సన్ రైజర్స్ ఫామ్ చూస్తే ధోనీ కొంచెం జాగ్రత్త పడక తప్పదనే అంటున్నారు. ఇప్పటివరకు 3 మ్యాచ్ లు ఆడి రెండు గెలిచి, ఒకదాంట్లో ఓడింది. ఇక హైదరాబాద్ చూస్తే ఆడిన మూడు మ్యాచ్ ల్లో రెండింట ఓడి, ఒక దాంట్లో విజయం సాధించింది.

ప్యాట్ కమిన్స్ వచ్చిన తర్వాత సన్ రైజర్స్ కి కెప్టెన్ సమస్య తగ్గింది. అంతేకాదు బౌలింగ్లో కూడా రాణిస్తున్నాడు. ఇక అభిషేక్ శర్మ, హెన్రిచ్ క్లాసెన్ అద్భుత ఫామ్‌లో ఉన్నారు. ఇంకా వీరికితోడు ట్రావిస్ హెడ్, అబ్దుల్ సమద్ ఉన్నారు. బౌలింగ్ చాలా వీక్ గా ఉంది. ఒకప్పుడు టీమ్ ఇండియా ప్రధాన పేసర్ గా ఉన్న భువనేశ్వర్ ఇక్కడ తేలిపోతున్నాడు. ఇది జట్టుని కలవరపరుస్తోంది. ఈ సమస్య నుంచి బయటపడితే సన్ రైజర్స్ ని ఆపేవారు ఉండకపోవచ్చునని అంటున్నారు.


Also Read: శశాంక్ సింగ్, అశుతోశ్ శర్మ మెరుపులు.. ఉత్కంఠ పోరులో పంజాబ్ విజయం..

మొదటి మ్యాచ్ లో ఆర్సీబీ, గుజరాత్ లను ఓడించిన చెన్నై మూడో మ్యాచ్ లో ఢిల్లీ చేతిలో ఓటమి పాలైంది. రుతురాజ్, శివమ్ దుబె స్లోగా ఆడటం సీఎస్కేను ఇబ్బంది పెడుతోంది. అయితే రెండు మ్యాచ్ లు గెలిచింది కాబట్టి,  జట్టుని తక్కువగా అంచనా వేయడానికి లేదు. మొత్తానికి రెండు జట్ల మధ్య టఫ్ ఫైట్ తప్పేలా లేదు.

Related News

India vs Bangladesh 1st Test: భారత్ 376 ఆలౌట్: బంగ్లాదేశ్ 26/3

Shikhar Dhawan: ఆ హాట్‌ బ్యూటీతో గబ్బర్‌ ఎఫైర్‌..సీక్రెట్‌ ఫోటోలు లీక్‌ !

Ravichandran Ashwin: తనే నన్ను ఆడించాడు: సెంచరీ హీరో అశ్విన్

IPL 2025: కోహ్లీ భారీ ప్లాన్‌..RCBలోకి అర్జున్‌ టెండూల్కర్‌ ?

Ravichandran Ashwin: టీమిండియాలో గొడవలు…అశ్విన్‌ ను అవమానించిన గంభీర్‌..?

Mahmud Hasan: మనోళ్లకే చుక్కలు చూపించిన.. హసన్ ఎవరు?

IND vs BAN: అదరగొట్టిన ఆల్ రౌండర్లు : అశ్విన్ సెంచరీ, జడేజా 86 నాటౌట్

Big Stories

×