EPAPER

High Temperatures in Telugu States: హెచ్చరిక.. ఈ సమయంలో బయటకు రాకండి.. తెలుగు రాష్ట్ర ప్రజలకు IMD వార్నింగ్!

High Temperatures in Telugu States: హెచ్చరిక.. ఈ సమయంలో బయటకు రాకండి.. తెలుగు రాష్ట్ర ప్రజలకు IMD వార్నింగ్!


Heavy Temperatures Alert : తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. ఉదయం 9 గంటలు దాటితే.. రోడ్లు నిప్పుల కొలిమిని తలపిస్తున్నాయి. విపరీతమైన ఉక్కపోతతో ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు. వడదెబ్బతాకి ఇప్పటికే కొన్నిప్రాంతాల్లో వృద్ధులు మృతి చెందారు. ఇక నేడు, రేపు ఇరు రాష్ట్రాల్లో పగటి ఉష్ణోగ్రతలు మరింత పెరగడంతో పాటు.. వడగాలులు కూడా వీస్తాయని ఐఎండీ హెచ్చరించింది.

గురువారం తెలంగాణలోని నల్గొండ జిల్లా నిడమనూరులో అత్యధికంగా 43.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఇటు ఏపీలోనూ 44 డిగ్రీల వరకూ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఏపీలో నంద్యాలజిల్లా యాగలబకంకిలో 44.1 డిగ్రీలు, కడప జిల్లా చిన్న చెప్పల్లిలో 43.9 డిగ్రీల అధిక ఉష్ణోగ్రత నమోదైంది. ముఖ్యంగా రాయలసీమలో ఉష్ణోగ్రతలు అంతకంతకూ పెరుగుతున్నాయి. శుక్ర, శనివారాల్లో రాయలసీమతో పాటు కోస్తాంధ్రలోనూ అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వాతావరణ శాఖ అంచనా వేసింది.


Also Read: వైసీపీ డీఎన్ఏలోనే శవరాజకీయం.. కొవ్వూరు ప్రజాగళంలో చంద్రబాబు..

వైఎస్సార్ కడప, కర్నూల్, నంద్యాల, అనంతపురం జిల్లాల్లో 41 నుంచి 43 డిగ్రీల వరకూ, పల్నాడు, ఎన్టీఆర్ జిల్లాల్లో 44 డిగ్రీల వరకూ.. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లా, తూర్పు గోదావరి జిల్లాలో 45 డిగ్రీల వరకూ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని తెలిపింది. అధిక ఉష్ణోగ్రతలు నమోదు కానున్న నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది. ముఖ్యంగా ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ఎండ తీవ్రత అధికంగా ఉంటుందని, అత్యవసరమైతే తప్ప ఈ సమయంలో బయటకు రావొద్దని తెలిపింది.

Tags

Related News

Tirumala Laddu: ఛీ, ఇంత నీచమా? ఏపీ ప్రజల సెంటిమెంట్‌పై గట్టి దెబ్బ.. వైసీపీని ఈ పాపం వెంటాడుతుందా?

Adani Foundation: ఏపీ వరద బాధితులకు అదానీ ఫౌండేషన్ భారీ విరాళం.. ఎంతనో తెలిస్తే ఆశ్చర్యపోతారు!

Tirupati Laddu: తిరుమల లడ్డూ ప్రసాదంలో గొడ్డు మాంసం? ఇదిగో ప్రూఫ్.. ల్యాబ్ టెస్ట్‌లో బయటపడింది ఇదే

Balineni Comments: జగన్ ఏరోజూ సభల్లో నా గురించి మాట్లాడలేదు.. అందుకే పార్టీని వీడా: బాలినేని

Ambati Rambabu: నాణ్యమైన మద్యం అంటే ఏంటి..? ఎంత తాగినా ఆరోగ్యం దెబ్బతినదా..? : అంబటి ఎద్దేవా

YS Jagan: జగన్‌కు మరో భారీ షాక్… తగలనుందా..?

YV Subba Reddy: పెద్ద పాపమే చేశాడు.. చంద్రబాబుకు సుబ్బారెడ్డి కౌంటర్

Big Stories

×