EPAPER

An offering to God: ఏ దేవుడికి ఏ నైవేద్యం సమర్పిస్తే ఫలితం ఉంటుందో తెలుసా?

An offering to God: ఏ దేవుడికి ఏ నైవేద్యం సమర్పిస్తే ఫలితం ఉంటుందో తెలుసా?
Offer to God
Offer to God

An offering to God: దేవుడి పూజలో నైవేద్యం ముఖ్యమైనదని అందరికీ తెలిసిందే. దేవుడిని ఆరాధించే సమయంలో చాలా మంది తప్పకుండా నైవేద్యం పెట్టి దేవుడిని కోరికలు కోరుతుంటారు. తమ కోరికలను తీర్చి అనుగ్రహించాలని ప్రార్థిస్తుంటారు. ఈ తరుణంలో దేవుడికి పండ్లను సమర్పిస్తారు. ఇలా పండ్లను సమర్పించడంతో దేవుడి తమ కోరికలు తప్పక నెరవేరుస్తాడని భావిస్తుంటారు. అయితే దేవుళ్లకు కూడా ఇష్టమైన పండ్లు ఉంటాయి. పండ్లలో ఏ దేవుడికి ఏ పండును నైవేద్యంగా సమర్పిస్తే ఫలితం దక్కుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.


దేవుడికి పూజలను ఒక్కొక్కరు ఒక్కో విధంగా చేస్తుంటారు. కొంతమంది దేవుడికి నైవేద్యం( తయారు చేసినవి) సమర్పిస్తే.. మరి కొంత మంది పండ్లు సమర్పించి మొక్కులు పెడుతుంటారు. ఇందులో మరీ ముఖ్యంగా అరటి, జామ, నారింజ పండ్లను సమర్పిస్తుంటారు. అయితే ఇలా హిందువులు ఆరాధించే దేవుళ్లు చాలానే ఉంటాయి మరి. ఒక్కొక్కరు ఒక్కో దేవుడిపై విశ్వాసం చూపుతుంటారు. అయితే ఇలా దేవుడి ఫలితాలు దక్కించుకునేందుకు చేయాల్సిన నైవేద్యాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.

గణపతి:


అన్ని గణాలకు అధిపతి వినాయకుడు అంటారు. వినాయకుడికి ఎంతో ప్రీతిపాత్రమైన లడ్డూలు, కుడుములను తయారు చేసి నైవేద్యంగా సమర్పించడం వల్ల అనుకున్న కోరికలు తీరుతాయట. బొజ్జ గణపయ్యకు జామకాయను నైవేద్యంగా పెడితే గ్యాస్ట్రిక్ సమస్యలు దూరమవుతాయట. గణేషుడికి ఇష్టమైన మోదకాలను తిన్న వారికి కళలు, రచనలపై మంచి అవగాహన ఉంటుందట. ఇక మామిడి పండుతో బకాయిలు, గృహ నిర్మాణ సమస్యలు తీరుతాయని పండితులు చెబుతున్నారు.

Also Read: శనిదేవుడి పూజా విధానం.. శనివారం ఇలా పూజిస్తే ఐశ్వర్యం పొందుతారు!

పరమేశ్వరుడు:

మూడు కన్నుల వాడు అభిషేక ప్రియుడు శివయ్య అని అంటుంటారు. శివ్యయను భక్తి శ్రద్ధలతో పూజిస్తే చాలు కోరుకున్న కోర్కెలన్నీ తీరుస్తాడు. శివుడికి నైవేద్యాల కంటే అభిషేకాలు చేస్తేనే గొప్ప ఫలితాలు ఉంటాయి. పరమేశ్వరుడికి పాలు, నెయ్యి, తేనె, పెరుగు, పంచదార వంటి పంచామృతాలతో అభిషేకం చేస్తే అనుకున్న పనులు సక్రమంగా జరుగుతాయి. కుంకుమ పువ్వును కలిపి తయారుచేసిన పదార్థాలు, తీపి వంటకాలు అంటే నీలకంఠుడికి మహా ఇష్టం.

లక్ష్మీదేవి:

సకల సంపదలు ఇచ్చి, చల్లంగా చూసే తల్లి లక్ష్మీదేవి. ప్రతీ ఒక్కరికి కోరికలను తీర్చుతూ సంపదనిస్తుంది. ఈ అమ్మవారికి బియ్యంతో తయారుచేసిన ఏ ప్రసాదం అయినా నైవేద్యంగా సమర్పిస్తే అన్ని కోర్కెలు తీర్చుతుంది. బియ్యంతో చేసిన ఖీర్ అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం.

ఆంజనేయ స్వామి:

ఆంజనేయ స్వామికి పండ్లను సమర్పిస్తే ఇష్టంగా స్వీకరిస్తాడు. అందులోను ఎర్రటి ధాన్యాలు, ఎర్రటి కందిబెడలను నీటిలో తడిపి వాటిని బెల్లంతో కలిపి నైవేద్యంగా పెడితే కోరికలను తీర్చుతాడు.

శ్రీకృష్ణుడు:

కృష్ణయ్యను వెన్నదొంగ అంటారు. వెన్న అంటే శ్రీ కృష్ణుడికి మహా ప్రీతి. కొబ్బరితో చేసిన లడ్డూలు అంటే కూడా శ్రీ కృష్ణుడికి ఇష్టమే.

Related News

Horoscope 19 September 2024: నేటి రాశి ఫలాలు.. ఈ రాశి వారికి ఊహించని ధనలాభం!

Budh Gochar 2024: కన్య రాశిలో బుధుడి సంచారం.. వీరికి అన్నీ శుభవార్తలే

19 September 2024 Rashifal: రేపు ధనుస్సుతో సహా 5 రాశుల వారికి సంపద పెరగబోతుంది

Vastu Tips: చనిపోయిన వారి ఫొటోను ఇంట్లో ఏ దిక్కున పెట్టాలి ?

Shukra Gochar 2024: శుక్రుడి రాశిలో మార్పు.. మొత్తం 12 రాశులపై ప్రభావం

Shani Kendra Trikon Rajyog: ఈ 3 రాశుల వారిపై శని అనుగ్రహం వల్ల ధనవంతులు కాబోతున్నారు

Ashwin Month 2024 : అశ్వినీ మాసం ఎంత కాలం ఉంటుంది ? ఉపవాసాలు, పండుగలు జాబితా ఇదే..

Big Stories

×