EPAPER

Ambati Rayudu Comments on RCB: ఇలాగైతే ఆర్సీబీ ఎప్పటికీ కప్ కొట్టలేదు.. అంబటి సీరియస్!

Ambati Rayudu Comments on RCB: ఇలాగైతే ఆర్సీబీ ఎప్పటికీ కప్ కొట్టలేదు.. అంబటి సీరియస్!
Ambati Rayudu On RCB Performance in IPL
Ambati Rayudu On RCB Performance in IPL

Ambati Rayudu Comments on RCB Performance in IPL 2024: అంబటి రాయుడు.. తెలుగు క్రికెటర్.. పరిచయం అక్కర్లేని పేరు. ఐపీఎల్ లో ఉత్తమ గణాంకాలున్న క్రికెటర్ గా పేరుంది. అంతేకాదు కీలకమైన సమయాల్లో జట్టుకి అండదండలు అందించి, ఎన్నో విజయాల్లో తన వంతు పాత్ర పోషించాడు. అయితే రాజకీయాల్లో చేరుదామనే అత్యుత్సాహంతో వైసీపీలో చేరి, అంతే స్పీడుగా మళ్లీ వెనక్కి వచ్చేశాడు. తర్వాత జనసేన అన్నారు. అదీ అలాగే ఆగిపోయింది.


మొత్తానికి మళ్లీ ఐపీఎల్ వెటరన్ క్రికెట్ సిరీస్ కి వెళ్లి, ముంబై ఛాంపియన్స్ కెప్టెన్ గా వ్యవహరించాడు. అయితే తను క్రికెట్ కి దూరమైనప్పుడల్లా, మళ్లీ క్రికెట్ తనని పిలుస్తూనే ఉంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో తను స్పీడుగానే ఉన్నాడు. విషయానికి వస్తే, అన్నిజట్ల గురించి మాట్లాడుతున్న అంబటి రాయుడు ఎందుకో ఆర్సీబీపై ఘాటు కామెంట్లు చేశాడు. ఈసారి కూడా ఆర్సీబీ కప్ కొట్టలేదని తేల్చి చెప్పేశాడు. అందుకు కారణాలు కూడా చెప్పాడు. జట్టు ఒత్తిడి ఎదుర్కొంటున్న సమయంలో క్రీజులోకి జూనియర్లు వెళుతున్నారని అన్నాడు.

టాపార్డర్ అంతా సీనియర్లే పంచేసుకుంటే, తర్వాత వెళ్లి ఆడేవాళ్లు ఎవరున్నారని అన్నాడు. వీళ్లు ముందెళ్లి అవుట్ అయిపోతే, తర్వాత భారమంతా యువ ఆటగాళ్లపై పడి వారు చేతులెత్తేస్తున్నారని అన్నాడు. బౌలింగ్ విషయానికి వస్తే, ఇంక వారు పరుగులు ఇవ్వకుండా ఆపలేరని నిర్ధారణైపోయిందని అన్నాడు.


Also Read: ఎట్టకేలకు ఫిట్.. అందుబాటులో సూర్యకుమార్, ఏ మ్యాచ్‌కి..!

అందుకని బ్యాటర్లే ఎక్కువ పరుగులు చేయాల్సి ఉంటుందని అన్నాడు. కానీ బ్యాటింగ్ ఆర్డర్ అస్తవ్యస్తంగా ఉండటంతో సీనియర్లంతా ముందెళ్లి ఆడి,అవుట్ అయిపోతున్నారని తెలిపాడు. ఈ పరిస్థితుల్లో మార్పు రానంతకాలం ఆర్సీబీ గెలవలేదని అన్నాడు.

వరల్డ్ క్లాస్ టాప్ ఆర్డర్ అంతా ఆర్సీబీలోనే ఉన్నారని, అయినా మ్యాచ్ లు గెలవలేకపోతున్నారని, ఇది దురదృష్టకరమని అన్నాడు. మరో ముఖ్యమైన విషయం ఈ సీనియర్లందరినీ కంట్రోల్ చేసే ధోనీ, గంగూలీ లాంటివాళ్లు మెంటర్ గా రావాలని అన్నాడు.

ఎందుకంటే వీరికి వీరే మోనార్కులుగా ఉండటంతో, వీరితో మాట్లాడలేక, సలహాలు చెప్పలేక కోచ్ లు, మెంటర్ కి తలబొప్పి కట్టేస్తుందని అన్నాడు. ఇన్ని వ్యవస్థీక్రతమైన లోపాలతో ఉన్న ఆర్సీబీ అంతర్గత వ్యవహారాలను చక్కబెట్టుకోలేక పోతే కప్ కొట్టడం ఇప్పడే కాదు, ఎప్పటికి సాధ్యం కాదని తేల్చి చెప్పేశాడు.

Related News

Duleep Trophy 2024: దులీప్ ట్రోఫీ.. ఇండియా ‘ఏ’ టీం తొలి విజయం

Neeraj Chopra Diamond League: బ్రసెల్స్ డైమండ్ లీగ్ లో నీరజ్ చోప్రాకు రెండో స్థానం.. 2024లో ఏకంగా నాలుగుసార్లు టైటిల్ మిస్!

Matthew Short: చరిత్ర సృష్టించిన ఆస్ట్రేలియా ఓపెనర్..13ఏళ్ల రికార్డు బ్రేక్

Virat Kohli: కోహ్లీ బ్యాటింగ్ ప్రాక్టీస్ షురూ..!

India vs Bangladesh 1st Test: ఒక్కటి గెలిస్తే చాలు.. 92 ఏళ్ల రికార్డు బ్రేక్

MS Dhoni: ధోనీ.. ఓసారి వాటర్ బాటిల్ తన్నేశాడు.. తెలుసా? : బద్రీనాథ్

Piyush Chawla: గంభీర్‌కి.. కొహ్లీ రికార్డులన్నీ తెలుసు: చావ్లా

Big Stories

×