EPAPER

Kejriwal to Remove as Delhi CM: కేజ్రీవాల్‌కు ఢిల్లీ హైకోర్టులో ఊరట.. సీఎం పదవి నుంచి తప్పించాలన్న పిటిషన్ కొట్టివేత..

Kejriwal to Remove as Delhi CM: కేజ్రీవాల్‌కు ఢిల్లీ హైకోర్టులో ఊరట.. సీఎం పదవి నుంచి తప్పించాలన్న పిటిషన్ కొట్టివేత..
Arvind Kejriwal Delhi Liquor Scam Arrest Update
Arvind Kejriwal Delhi Liquor Scam Arrest Update

Delhi High Court Refused Pil to Remove Kejriwal as CM:
Arvind Kejriwal Arrest Updates: ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు ఊరట లభించింది. ఆయనను ముఖ్యమంత్రి పదవి నుంచి తొలగించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను ఢిల్లీ హైకోర్టు విచారణకు స్వీకరించలేదు. పదవిలో కొనసాగాలా వద్దా అనేది అరవింద్ కేజ్రీవాల్ వ్యక్తిగతమని స్పష్టం చేసింది.


ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ను పదవి నుంచి తప్పించాలని కోరుతూ హిందూసేన అధ్యక్షుడు విష్ణు గుప్తా  హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ జస్టిస్ మన్మీత్ ప్రీతమ్ సింగ్ అరోడా, మన్మోహన్ తో ‌కూడిన ఈ పిటిషన్ ధర్మాసనం కొట్టేసింది.

అరవింద్ కేజ్రీవాల్ సీఎం పదవిలో కొనసాగాలా వద్దా అనే విషయంలో ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ గానీ రాష్ట్రపతి గానీ నిర్ణయం తీసుకోవాలని హైకోర్టు అభిప్రాయపడింది. పాలన కొనసాగడం లేదని తాము ఎలా నిర్ణయిస్తామని పేర్కొంది. లైఫ్టి నెంట్ గవర్నర్ ఈ విషయంలో నిర్ణయం తీసుకోవాలన్నారు. ఆ విషయంలో సలహా ఇచ్చే అవకాశం న్యాయస్థానానికి లేదని స్పష్టత నిచ్చింది.


Also Read: నేడు కవిత బెయిల్ పిటిషన్ పై విచారణ

ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ను పదవి నుంచి తప్పించాలని కోరుతూ ఇంతకుముందు సూరజ్ సింగ్ యాదవ్ అనే వ్యక్తి మార్చి 28న పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్ కూడా ఢిల్లీ హైకోర్టు కొట్టివేసింది.

మరో వైపు ఈడీ అరెస్ట్ ను సవాల్ చేస్తూ ఢిల్లీ హైకోర్టులో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ ను ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ స్వర్ణకాంత శర్మ నేతృత్వంలోని ధర్మాసనం బుధవారం విచారణ చేపట్టింది. అరవింద్ కేజ్రీవాల్ తరఫున సీనియర్‌ న్యాయవాది అభిషేక్‌ మను సింఘ్వీ, విక్రమ్ చౌధరీలు వాదనలు వినిపించారు. ఈ పిటిషన్ తీర్పు గురువారానికి వాయిదా పడింది.

Related News

Nipah virus: కేరళలో నిఫా వైరస్ విజృంభణ.. స్టూడెంట్ మృతి.. రాష్ట్రంలో ఆంక్షలు!

PM Modi: ఇది ట్రైలర్ మాత్రమే.. ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు నాయుడు భేటీ

yashwant Sinha: వాజ్ పేయి సిద్ధాంతాలతో.. పార్టీ పేరు ప్రకటించిన యశ్వంత్ సిన్హా

Delhi: ఢిల్లీకి తదుపరి సీఎం ఎవరు? రేసులో ఆరుగురు పేర్లు.. వీళ్లేనా?

Rajasthan Road Accident: రాజస్థాన్‌లో ట్రక్కును ఢీకొట్టిన తుఫాను.. ఎనిమిది మంది దుర్మరణం

Jammu Kashmir: గాంధీ, నెల్సన్ మండేలాతో బీజేపీ పోల్చుతున్న ఈ బుఖారీ ఎవరు?

PM Narendra Modi: మరో 6 వందే భారత్ రైళ్లు.. వర్చువల్‌గా ప్రారంభించిన ప్రధాని మోదీ

Big Stories

×