EPAPER

Fiber Rich Foods: జీర్ణ సమస్యలతో ఇబ్బంది పడుతున్నారా.. ఈ ఫైబర్ ఫుడ్‌తో చెక్ పెట్టండి

Fiber Rich Foods: జీర్ణ సమస్యలతో ఇబ్బంది పడుతున్నారా.. ఈ ఫైబర్ ఫుడ్‌తో చెక్ పెట్టండి
Foods to Reduce Digestive Problems
Foods to Reduce Digestive Problems

Fiber Foods to Reduce Digestion Problems: తరచూ తీసుకునే ఆహారంతో కొన్ని సార్లు జీర్ణ సమస్యలు ఎదురవుతాయి. ముఖ్యంగా ఆహారంలో శరీరానికి అందాల్సిన పోషకాలు అందకపోతే కొలస్ట్రాల్, డయాబెటీస్ వంటి దీర్ఘకాలిక సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ తరుణంలో ఫైబర్ ఫుడ్ అనేది శరీర ఆరోగ్యానికి చాలా అవసరం. ఇది జీర్ణక్రియను మెరుగుపరిచి శరీరానికి కావాల్సిన పోషకాలను అందిస్తుంది. ఇక విటమిన్లు, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లు వంటి తదితర పోషకాలను శరీరానికి అందించడంలో ముఖ్యపాత్ర పోషిస్తుంది.


శరీరానికి ఫైబర్ ఫుడ్ అందించడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. దీర్ఘకాలిక వ్యాధులకు చెక్ పెట్టడానికి ఫైబర్ బాగా పనిచేస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అందువల్ల ఫైబర్ అధికంగా ఉండే కూరగాయలు, పండ్లు ఆహారంగా తీసుకోవడం వల్ల అనేక ప్రయోజనాలు ఉంటాయి. అయితే కొన్ని ఆహారపదార్థాలను తీసుకోవడం వల్ల శరీరానికి ఫైబర్ ను అందించవచ్చు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

పప్పులు, ఓట్స్..


పప్పు దినుసులలో ఫైబర్ అధికంగా ఉంటుంది. ముఖ్యంగా ముంజలు, కాబూలీ చనా, పప్పులు, రాజ్మా వంటి పప్పుదినుసుల్లో ఫైబర్ అధికంగా ఉంటుంది. పప్పులు తీసుకోవడం వల్ల రక్తంలోని చక్కెర స్థాయిలను తగ్గిస్థాయి. రాజ్మాలో 133 గ్రాముల ఫైబర్ ఉంటుందని.. వీటిని తీసుకోవడం వల్ల అనేక సమస్యలను దూరం పెట్టవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఇక ఓట్స్ లోను ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఒక కప్పు ఓట్స్ లో 1.9 గ్రాముల ఫైబర్ ఉంటుందట. బీటా గ్లూటెన్ లకు ఇది గొప్ప మూలం అని చెప్పవచ్చు. ఒక రకమైన ఫైబర్ ఉంటుంది. ఓట్స్ తీసుకోవడం వల్ల గుండెను ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు.

Also Read: ఆహారాన్ని ఫ్రిజ్‌లో పెట్టి తింటున్నారా.. ఇలా ఎన్ని గంటల తర్వాత తినకూడదో తెలుసా?

మలబద్ధకం..

ప్రతి రోజు తీసుకునే ఆహారంలో ఫైబర్ లోపం ఉంటే మలబద్ధకం సమస్య బారినపడాల్సి వస్తుంది. అందువల్ల దీనిని నివారించడానికి అవిసె గింజలు తీసుకోవచ్చు. క్యారెట్, బ్రోకలీ, కాలే, బచ్చలికూర, వంటి కూరగాయలను కూడా తీసుకోవడం వల్ల వాటిలో ఉంటే ఫైబర్ జీర్ణ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి తోడ్పడుతుంది. కొలస్ట్రాల్, డయాబెటిస్ ప్రమాదం నుండి రక్షిస్తుంది. ఇక యాపిల్ ను ప్రతి రోజు ఒకటి పరిగడుపున తీసుకోవడం మంచిది. యాపిల్ ను ఫైబర్ పెక్టిన్ అని కూడా అంటారు. యాపిల్ లో ఉండే గ్రాము ఫైబర్ ఆరోగ్యానికి మేలు చేస్తుంది.

Related News

Hair Care Tips: జుట్టు సమస్యలన్నింటికీ చెక్ పెట్టండిలా !

Tips For Skin Glow: క్షణాల్లోనే మీ ముఖాన్ని అందంగా మార్చే టిప్స్ !

Yoga For Stress Release: ఒత్తిడి తగ్గేందుకు ఈ యోగాసనాలు చేయండి

Throat Infection: గొంతు నొప్పిని ఈజీగా తగ్గించే డ్రింక్స్ ఇవే..

Skin Care Tips: గ్లోయింగ్ స్కిన్ కోసం.. ఇంట్లోనే ఈ ఫేస్ ప్యాక్స్ ట్రై చేయండి

Sweets: స్వీట్లు ఇష్టపడేవారు ఈ సమయంలో తింటే అన్నీ సమస్యలే..!

Coffee For Glowing Skin: కాఫీ పౌడర్‌లో ఇవి కలిపి ఫేస్‌ప్యాక్ వేస్తే.. మీ ముఖం మెరిసిపోవడం ఖాయం

Big Stories

×