EPAPER

Tesla in India: భారత్‌లోని ఆ రాష్ట్రాల్లో టెస్లా తయారీ ప్లాంట్‌లు!

Tesla in India: భారత్‌లోని ఆ రాష్ట్రాల్లో టెస్లా తయారీ ప్లాంట్‌లు!
Tesla in India
Tesla in India

Tesla in India: ప్రస్తుతం అంతా ఎలక్ట్రిక్ వాహనాలదే హవా నడుస్తోంది. వాహన ప్రియులను దృష్టిలో ఉంచుకుని ప్రముఖ కంపెనీలు కూడా కొత్త కొత్త మోడళ్లను మార్కెట్‌లోకి తీసుకువస్తున్నాయి. ఈ క్రమంలో ఓ బడా ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ ఇండియాలో తన కార్లను విక్రయించేందుకు కీలక నిర్ణయం తీసుకుంది. అమెరికాకు చెందిన ప్రముఖ ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ టెస్లా భారతదేశంలో తన ప్లాంట్‌కు అనువైన స్థలాన్ని ఎంచుకోవడానికి ఈ నెలాఖరులో ఒక బృందాన్ని భారత్‌కు పంపనున్నట్లు తెలుస్తోంది.


ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ తగ్గి.. అమెరికా, చైనా వంటి పెద్ద మార్కెట్లలో కంపెనీ తీవ్ర పోటీని ఎదుర్కొంటుంది. ఈ తరుణంలో కంపెనీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. డిమాండ్ లేకపోవడంతో కంపెనీ మొదటి త్రైమాసికంలో అమ్మకాల్లో భారీ క్షీణతను నమోదు చేసింది. తాజాగా ఒక నివేదిక ప్రకారం.. కంపెనీ పంపిన బృందం ఇప్పటికే ఆటోమోటివ్ హబ్‌లు ఉన్న రాష్ట్రాలకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు సమాచారం. అందులో కొన్ని రాష్ట్రాలను సెలెక్ట్ చేసినట్లు తెలుస్తోంది. మహారాష్ట్ర, గుజరాత్, తమిళనాడు వంటి రాష్ట్రాల ప్రముఖమైనవని గుర్తించినట్లు తెలస్తోంది.

ఈ ప్లాంట్‌పై రెండు నుంచి మూడు బిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టే అవకాశం ఉన్నట్లు కొన్ని నివేదికలు చెబుతున్నాయి. దేశంలో కనీసం 500 మిలియన్ డాలర్లు పెట్టుబడి పెట్టి.. మూడేళ్లలో దేశీయ తయారీకి కట్టుబడి ఉండే ఎలక్ట్రిక్ కార్లపై భారత్ గత నెలలో దిగుమతి సుంకాన్ని తగ్గించిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా టెస్లా వ్యవస్థాపకుడు ఎలన్ మస్క్ భారత మార్కెట్లోకి ప్రవేశించడానికి ఎన్నో ఏళ్లుగా ప్రయత్నిస్తున్నారు.


Also Read: అద్భుతమైన డిజైన్, అదరగొట్టే ఫీచర్లతో టయోటా బడ్జెట్ కార్

అయితే ప్రభుత్వం స్థానిక తయారీకి అతని నుండి నిబద్ధతను కోరుకుంటుంది. ఇందులో భాగంగానే గతేడాది జూన్‌లో ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా పర్యటనకు వచ్చినప్పుడు కూడా మస్క్ ఆయనను కలిశారు. ఈ మేరకు 24వేల డాలర్ల ధర కలిగిన EVలను ఉత్పత్తి చేయడానికి.. ఇండియాలో ఫ్యాక్టరీని నిర్మించడానికి ఆసక్తి చూపుతున్నట్లు కంపెనీ గత ఏడాది జూలైలో తెలిపిన విషయం తెలిసిందే.

Tags

Related News

Train Missing: రైలు మిస్సైతే టికెట్ వేస్ట్ అయినట్లేనా? అదే టికెట్‌తో మరో రైలులో ప్రయాణించవచ్చా? రూల్స్ ఏం చెబుతున్నాయ్?

GST: ఎల్ఐసీ ప్రపంచంలోనే 10వ అతిపెద్ద సంస్థ… కానీ,…

సికింద్రాబాద్ నుంచి గోవాకు రైలు.. ఎంజాయ్ పండుగో, ఎప్పటి నుంచంటే..

Indian Railways: సినిమా టికెట్ల తరహాలోనే రైలులో మీకు నచ్చిన సీట్‌ను బుక్ చేసుకోవచ్చు.. ఎలాగో తెలుసా?

Washing meshine Usage : ఆఫర్లో వాషింగ్ మెషీన్‌ కొంటున్నారా.. దుస్తులే కాదు ఇవి కూడా ఎంచక్కా ఉతికేయొచ్చు!

Railway Employees Diwali Bonus| రైల్వే ఉద్యోగులకు శుభవార్త.. రూ.2029 కోట్ల దీపావళి బోనస్!

VIKALP Yojana: పండుగల వేళ ఈజీగా రైలు టికెట్ పొందే VIKALP స్కీమ్ గురించి మీకు తెలుసా? ఇంతకీ ఈ పథకం ప్రత్యేకత ఏంటంటే?

×