EPAPER

Doctor vs Doctor: దర్శిలో డాక్టర్స్ వార్.. ఓటర్ పల్స్ చిక్కేనా ?

Doctor vs Doctor: దర్శిలో డాక్టర్స్ వార్.. ఓటర్ పల్స్ చిక్కేనా ?


Gottipati Lakshmi vs Buchepalli Sivaprasad : ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గంలో డాక్టర్, డాక్టరమ్మల మధ్య పొలిటికల్ వార్ ఆసక్తికరంగా మారింది. దర్శి నియోజకవర్గం ఏర్పడిన తర్వాత మొట్టమొదటిసారి ఒక ప్రధాన పార్టీ నుంచి మహిళా అభ్యర్థి ఎన్నికల బరిలోకి దిగారు. టీడీపి, జనసేన, బీజేపి ఉమ్మడి అభ్యర్ధిగా టీడీపీ నుంచి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మికి టికెట్ కేటాయించారు. ఇప్పటికే వైసీపీ అభ్యర్ధిగా మాజీ ఎమ్మెల్యే డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి ప్రచారం చేసుకుంటున్నారు. ఆ ఇద్దరు డాక్టర్లు మంచి పొలిటికల్ బ్యాక్‌గ్రౌండ్ ఉన్న కుటుంబాల నుంచి వచ్చిన వారే అవ్వడం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.

ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గంలో మిత్రపక్షాల నుంచి ఎవరు పోటీ చేస్తారు? ఏ పార్టీకి ఆ సీటు దక్కుతుంది? అన్నదానిపై పెద్ద చర్చే నడిచింది. దర్శి టీడీపీకి ఇన్చార్జ్‌ని కూడా నియమించకపోవడంతో.. పొత్తుల్లో భాగంగా అది జనసేనకు కేటాయిస్తారన్న వాదన వినిపించింది. అయితే చివరికి అక్కడ అభ్యర్ధిని ప్రకటించారు టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు. దర్శి టీడీపీ ఫైనల్ లిస్ట్‌లో మిత్రపక్షాల అభ్యర్ధినిగా డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ పేరు ఖరారు చేశారు. దాంతో నిన్నమొన్నటి వరకు స్థబ్దతగా ఉన్న దర్శి రాజకీయం ఒక్కాసారిగా మారిపోయింది.


దర్శి సిట్టింగ్ ఎమ్మెల్యే మద్దిశెట్లి వేణుగోపాల్‌‌ను పక్కనపెట్టిన వైసీపీ ఈసారి అభ్యర్ధిగా మాజీ ఎమ్మెల్యే, డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డిని ప్రకటించింది. అలు కూటమిలోనూ అభ్యర్ధిపై గందరగోళం తొలగిపోవడంతో.. టీడీపీ కేడర్లో కొత్త ఉత్సాహం కనిపిస్తుంది. నిన్నటి వరకు ప్రజల నాడి పట్టిన డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి ఇప్పుడు పొలిటికల్ పల్స్ పట్టడానికి రెడి అయ్యారు. పల్నాడు జిల్లా నరసరావుపేటలో డాక్టర్ ప్రాక్టీస్ చేస్తున్న లక్ష్మి దివంగత మాజీ మంత్రి గొట్టిపాటి హనుమంతరావు మనవరాలు.

Also Read : విడదల ఎఫెక్ట్.. మాధవి డిఫెక్ట్.. గెలుపు స్వరం ఎటువైపు ?

జిల్లా టీడీపీ రాజకీయాలను ప్రభావితం చేసిన సీనియర్ నేత గొట్టిపాటి హనుమంతరావు. ఆయన మరణాంతరం కుమారుడు గొట్టిపాటి నరసయ్య మార్టూరు ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఇప్పుడు నరసయ్య కుమార్తె గొట్టిపాటి లక్ష్మి దర్శి టీడీపీ అభ్యర్ధినిగా పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు. అద్దంకి రాజకీయాలను శాసిస్తున్న ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ లక్ష్మికి బాబాయ్ అవుతారు. అద్దంకిలో హ్యాట్రిక్ విజయాలు నమోదు చేసి.. బాచిన చెంచుగరటయ్య, కరణం బలరామకృష్ణమూర్తి లాంటి దిగ్గజాలకు అద్దంకిలో స్థానం లేకుండా చేశారు గొట్టిపాటి రావి.. 2004లో మార్టురు ఎమ్మెల్యేగా మొదటి సారి గెలిచిన రవి.. తర్వాత 2009 నాటికి డీలిమిటేషన్లో మార్టురు సెగ్మెంట్ రద్దవ్వడంతో అద్దంకికి షిఫ్ట్ అయ్యారు.

అద్దంకిలో 2009 నుంచి వరుసగా విజయాలు సొంత చేసుకుంటున్న గొట్టిపాటి రవి.. మొదటి సారి కాంగ్రెస్ అభ్యర్ధిగా, రెండో సారి వైసీపీ నుంచి, ప్రస్తుతం టీడీపీ తరపున గెలిచి.. ఆ సెగ్మెంట్లో తన పర్సనల్ ఇమేజ్ ఏ రేంజ్ లో ఉందో చాటుకున్నారు. ఇప్పుడు గొట్టిపాటి లక్ష్మికి దర్శి టికెట్ దక్కడానికి గొట్టిపాటి రవే చక్రం తిప్పారంట. వాస్తవానికి గత ఏడెనిమిది నెలలుగా నరసరావు పేట అసెంబ్లీ టిక్కెట్ కడియాల ఫ్యామిలీకి ఇస్తారన్న ప్రచారం జరిగింది. అందులో భాగంగా లక్ష్మీ మామ కడియాల వెంకటేశ్వరరావు పేరు ఫోకస్ అయింది. అయితే.. చివరి జాబితాలో అనూహ్యంగా కడియాల ఇంటి కోడలు లక్ష్మికి దర్శి టిక్కెట్ దక్కింది.

దర్శి సీటు జనసేనకు వెళ్తుందని తొలుత వార్తలు వచ్చినా.. తర్వాత టీడీపీ నుంచి పలువురు పోటీ పడినా.. ఆమె బాబయ్ గొట్టిపాటి రవి వ్యూహాత్మకంగా పావులు కదపడపడతో టిక్కెట్ లక్ష్మికి దక్కిందని చెబుతున్నారు. ఇదే సమయంలో ఆమెను గెలిపించే బాధ్యత కూడా గొట్టిపాటి రవి తీసుకున్నారంట. అటు బాబాయ్ గొట్టిపాటి రవి అండ. ఇటు తండ్రి, మాజీ ఎమ్మెల్యే గొట్టిపాటి నర్సయ్యకు ఉన్నక్లీన్ ఇమేజ్ గొట్టిపాటి లక్ష్మికి ప్లస్ అవుతాయన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

Also Read : బనగానపల్లిలో కాస్ట్లీ హామీలు.. ఆస్తులు రాసిస్తామంటున్న అభ్యర్థులు

తనను వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలే తనను గెలిపిస్తాయని గొట్టిపాటి లక్ష్మీ ధీమా వ్యక్తం చేస్తున్నారు. దర్శి నియోజకవర్గం లో టీడీపీకి ఇప్పటి వరకు ఇన్చార్జి లేక కార్యకర్తలు దిక్కులు చూడాల్సిన పరిస్థితి ఉండేది. పార్టీకి బలైన కేడర్ ఉన్నా.. ముందుండి నడిపించే నేత లేకపోవడం లోటుగా కనిపించేది. అయినా అక్కడ తెలుగుతమ్ముళ్లు దర్శిలో మున్సిపాలిటిపై టీడీపి జెండా ఎగరేసి సత్తా చాటుకోవడం విశేషం.

దర్శిలో నియోజకవర్గంలో కమ్మ , కాపు ఓట్లు కీలకంగా ఉన్నాయి. ముండ్లమూరు, దొనకొండ మండలాల్లో కమ్మ సామాజిక వర్గంనికి చెందిన ఓట్లు ఎక్కువ. అక్కడ ప్రతిసారి టీడీపీ ప్రాబల్యం కనిపిస్తుంటుంది. కురిచేడు, దర్శి మండాలలో కాపు ఓట్లు ఎక్కువగా ఉన్నాయి. ఆ మండాలాల్లో కూడా టీడీపీకి మంచి పట్టు ఉందంటారు. అదికాక ఈ సారి జనసేన తోడవ్వడంతో ఆ వర్గం ఓటర్లు కూటమి అభ్యర్ధికి మద్దతిస్తారన్న అభిప్రాయం వ్యక్తం అవుతుంది.

టీడీపీ ఎంపీ అభ్యర్ధిగా అందరికీ సుపరిచులైన మాగుంట శ్రీనివాసుల రెడ్డి బరిలో ఉండటంతో దర్శిలో గణనీయంగా ఉన్న రెడ్డి ఓటర్లలలో కూడా ఒకింత సానుకూలత కనిపిస్తోందంటున్నారు. గొట్టిపాటి లక్ష్మి భర్త కడియాల లలితసాగార్ నియోజకవర్గంలో అన్ని వర్గాల వారితో మీటింగులు పెడుతూ.. గ్రామ నాయకులతో ములఖత్ అవుతున్నారు.. కార్యకర్తలతో అండగా ఉంటానని భరోసా ఇస్తున్నారు. దర్శి నియోజకవర్గంలో ఇప్పటి నుంచి ఒక లెక్క ఇక నుంచి ఒక లెక్క అంటూ ముందుకు వెళ్తున్నారు. ఆయన దూకుడుతో.. దర్శి టీడీపీకి సరైన అభ్యర్ధి దొరికారని దర్శి తెలుగు తమ్మళ్ళు ఉత్సంహంగా కనపడుతున్నారు.

Also Read : పవన్ టూర్ రద్దు.. అందుకోసమేనట.. బాధ్యత అంతా బాబుపైనే!

దర్శి నియోజకవర్గ చరిత్రలో తొలిసారి పోటీ చేస్తున్న మహిళా అభ్యర్ధి గొట్టిపాటి లక్ష్మీనే కావటం దర్శి ప్రజలలో ఆసక్తిగా మారింది. 1952లో దర్శి నియోజకవర్గం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు పదిహేను ఎన్నికలు సాగాయి. ప్రధాన పార్టీల తరఫున ఇప్పటి వరకు ఒక్క మహిళ కూడా పోటీ చేయలేదు. ప్రస్తుత ఎన్నికల్లో టీడీపీ-జనసేన- బీజేపీ ఉమ్మడి అభ్యర్ధిగా కూటమి తరఫున డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి పోటీకి దిగారు. దర్శిలో పోటీ చేస్తున్న తొలి మహిళా అభ్యర్ధిగానే కాకుండా.. ప్రధాన పక్షాల నుంచి జిల్లా వ్యాప్తంగా ఎన్నికల బరిలో ఉన్న ఏకైక మహిళ లక్ష్మీనే కావడం స్పెషల్ అట్రాక్షన్‌గా మారింది.

మొత్తమ్మీద వైసీపీ నుంచి డాక్టర్ బూచేపల్లి శివప్రాసాద్ రెడ్డి, ఇటు కూటమి అభ్యర్ధిగా గొట్టి లక్ష్మి బరిలో ఉండటంతో ఈ సారి దర్శి ప్రజలు ఎవరికి పట్టం కడతారో అనేది ఆసక్తిగా మారింది. ఇద్దరు బలమైన నేతాలు, ఇద్దరికి పొలిటికల్ ఫ్యామిలి బ్యాక్ గ్రౌండ్ ఉంది. బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి తండ్రి బూచేపల్లి సుబ్బారెడ్డి 2004 సంవత్సరంలో ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు. అనంతరం ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరారు.

2009లో మొదటి సారిగా శివప్రసాద్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ తరపునపోటీ చేసి గెలుపొందారు. జగన్ కోసం రాజీనామ చేసి బై ఎలక్షన్ మళ్ళి గెలిచారు. అయితే 2019 ఎన్నికల్లో వ్యక్తగత కారణాలతో పోటీకి దూరమయ్యారు. ఈ సారి అక్కడ ఎమ్మెల్యే మద్దిశెట్టిని కాదని టకెట్ దక్కించుకున్నారు. అయితే మద్దశెట్టి వర్గం ఆయనకు ఎంత వరకు సహకరిస్తుందనేది ప్రశ్నార్థకంగా మారింది. పార్టీ ఏదైనా తనదైన మార్క్ చూపించే అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవి.. తన బిడ్డ కోసం దర్శిలో ఎలా చక్రం తిప్పుతారో చూడాలి మరి.

Related News

History of Naxalism: మావోయిస్టుల అంతం.. ఎందుకీ పరిస్థితి వచ్చింది?

Narsingi: నార్సింగిలో బంగారు గని..?

Sabarmati and Thames River: సబర్మతి, థేమ్స్ నదులు ఎలా బాగుపడ్డాయి?

Israel-Iran War: ఇరాన్‌పై దాడికి ఇజ్రాయెల్ వ్యూహం ఇదే!

Osho Rajneesh: కళ్ళకు కట్టినట్టుగా ఓషో రజనీష్ నిజస్వరూపం

YS Jagan: కడపలో జగన్ ప్లాన్ సక్సెస్.. ఎలాగంటే..

YS Jagan in Confusion: అంబటి, రజిని దెబ్బకి.. అయోమయంలో జగన్

×