EPAPER

AAI Recruitment 2024: 490 జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం.. చివరి తేదీ ఇదే..!

AAI Recruitment 2024: 490 జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం.. చివరి తేదీ ఇదే..!
AAI Recruitment 2024
AAI Recruitment 2024

Airports Authority of India Released 490 Junior Executive Posts: నిరుద్యోగులకు న్యూఢిల్లీలోని ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా గుడ్ న్యూస్ చెప్పింది. దేశ వ్యాప్తంగా ఉన్న ఏఏఐ కార్యాలయాల్లో 490 జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. అభ్యర్థులు సంబంధిత విభాగంలో బీఈ, బీటెక్‌/ ఎంసీఏ ఉత్తీర్ణత కలిగి ఉండాలి. దాంతోపాటు వ్యాలిడ్‌ గేట్‌-2024 స్కోరు కూడా కలిగి ఉండాలి. అలాంటి వారే దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఇప్పుడు ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం..


మొత్తం ఖాళీలు: 490

జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు (విభాగాల వారీగా):


జూనియర్ ఎగ్జిక్యూటివ్ – ఆర్కిటెక్చర్‌:

ఇందులో 3 ఖాళీలున్నాయి. దీనికి ఆర్కిటెక్చర్‌లో బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణతో పాటు వ్యాలిడ్‌ గేట్‌ 2024 స్కోరు కలిగి ఉండాలి. అంతేకాకుండా కౌన్సిల్ ఆఫ్ ఆర్కిటెక్చర్‌లో రిజిస్టర్ అయి ఉండాలి. అలాగే 01.05.2024 నాటికి 27 సంవత్సరాలు పైబడి ఉండకూడదు. ఓబీసీ అభ్యర్థులకు 3 ఏళ్లు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 ఏళ్లు, దివ్యాంగ అభ్యర్థులకు 10ఏళ్ల వయో సడలింపు ఉంటుంది.

జూనియర్ ఎగ్జిక్యూటివ్ –ఇంజినీరింగ్-సివిల్:

ఈ విభాగంలో 90 ఖాళీలున్నాయి. సివిల్ ఇంజినీరింగ్/టెక్నాలజీలో బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణత కలిగి ఉండాలి. దీంతో పాటు వ్యాలిడ్‌ గేట్‌ 2024 స్కోరు కలిగి ఉండాలి. దీనికి కూడా 27 సంవత్సరాలు మించకూడదు. వయో సడలింపు కూడా పైన పేర్కొన్న విధంగానే ఉంటుంది.

Also Read: 10 పాసైతే చాలు.. డిఫెన్స్ మినిస్ట్రీలో ఎగ్జామ్ లేకుండా జాబ్స్!

జూనియర్ ఎగ్జిక్యూటివ్ – ఇంజినీరింగ్ ఎలక్ట్రికల్:

ఈ విభాగంలో మొత్తం 106 ఖాళీలు ఉన్నాయి. ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్/టెక్నాలజీలో బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణతతో సహా వ్యాలిడ్‌ గేట్‌ 2024 స్కోరు కలిగి ఉండాలి. ఈ పోస్టులకు కూడా పైన పేర్కొన్న విధంగానే వయోపరిమితి, వయో సడలింపు ఉంటుంది.

జూనియర్ ఎగ్జిక్యూటివ్ – ఎలక్ట్రానిక్స్:

జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఎలక్ట్రానిక్స్ విభాగంలో మొత్తం 278 ఖాళీలు ఉన్నాయి. ఈ పోస్టులకు ఎలక్ట్రానిక్స్/టెలీకమ్యూనికేషన్స్/ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్/టెక్నాలజీలో బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణత కలిగి ఉన్నవారు అప్లై చేసుకోవచ్చు. దీంతోపాటు వ్యాలిడ్‌ గేట్‌ 2024 స్కోరు కలిగి ఉండాలి. ఈ పోస్టులకు కూడా పైన పేర్కొన్న విధంగానే వయోపరిమితి, వయో సడలింపు ఉంటుంది.

జూనియర్ ఎగ్జిక్యూటివ్ – ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ:

Also Read: పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకులో స్పెషలిస్ట్‌ ఆఫీసర్ పోస్టులు.. మొత్తం ఖాళీలు ఎన్నంటే..?

ఇందులో 13 ఖాళీలు ఉన్నాయి. కంప్యూటర్ సైన్స్/కంప్యూటర్ ఇంజినీరింగ్/ఐటీ/ఎలక్ట్రానిక్స్‌లో బ్యాచిలర్ డిగ్రీ, ఎంసీఏ ఉత్తీర్ణత సహా వ్యాలిడ్‌ గేట్‌ 2024 స్కోరు కలిగి ఉండాలి. పైన పేర్కొన్న విధంగానే వయోపరిమితి, వయో సడలింపు ఉంటుంది.

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యుర్థులు రూ.300 ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులకు మినహాయింపు ఉంది. అలాగే గేట్‌-2024 స్కోరు, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఈ ఇంటర్వ్యూ ద్వారా జాబ్ పొందిన వారికి నెలకు రూ.40,000 నుంచి 1,40,000 వరకు జీత భత్యాలు చెల్లించనున్నారు. ఈ పోస్టులకు సంబంధించి ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభం అయింది. ఆసక్తిగల అభ్యర్థులు మే 1వ తేదీ వరకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.

ఆసక్తిగల అభ్యర్థులు NOTIFICATION కోసం ఇక్కడ క్లిక్ చేయండి. అలాగే WEBSITE కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Tags

Related News

Karnataka MUDA ED Raids: కర్ణాటక సిఎంపై ఈడీ గురి.. మైసూరు ముడా ఆఫీసులో తనిఖీలు

Land Scam Case: ముడా ఆఫీసులో ఈడీ సోదాలు.. సీఎం సిద్దరామయ్యకు చిక్కులు తప్పవా?

Bihar Hooch : కల్తీ మద్యం తాగి 43 మంది మృతి.. విచారణకు ముఖ్యమంత్రి ఆదేశాలు

CJI Chandrachud Ayurveda: కరోనా సోకినప్పుడు అల్లోపతి చికిత్స అసలు తీసుకోలేదు.. సిజెఐ చంద్రచూడ్

Salman Khan Death Threat: ‘5 కోట్లు ఇవ్వకపోతే సల్మాన్ ఖాన్‌ను చంపేస్తాం’.. ముంబై పోలీసులకు వాట్సాప్ మెసేజ్

Ragging : బట్టలు విప్పనందుకు చితకబాదిన సీనియర్లు.. కాలేజీలో ర్యాగింగ్.. హత్యాయత్నం కేసు నమోదు

NDA Convener: చండీగఢ్‌ సమావేశంలో ఏం జరిగింది? ఎన్డీయే కన్వీనర్‌ మళ్లీ చంద్రబాబేనా?

Big Stories

×