EPAPER

RCB vs LSG Highlights: మయాంక్ మాయాజాలం.. చిన్నస్వామిలో చిన్నబోయిన బెంగళూరు..

RCB vs LSG Highlights: మయాంక్ మాయాజాలం.. చిన్నస్వామిలో చిన్నబోయిన బెంగళూరు..
Royal Challengers Bengaluru vs Lucknow Super Giants Live Updates
Royal Challengers Bengaluru vs Lucknow Super Giants Live Updates

Royal Challengers Bengaluru vs Lucknow Super Giants Highlights: బెంగళూరు చిన్నస్వామి వేదికగా ముగిసిన ఐపీఎల్ మ్యాచ్‌లో లక్నో బెంగళూరుపై ఘనవిజయం సాధించింది. 182 పరుగులు చేధించే క్రమంలో ఆర్సీబీ చతికిలపడింది. స్పీడ్ గన్ మయాంక్ యాదవ్ 4 ఓవర్లు వేసి 14 పరుగులు ఇచ్చి మూడు కీలక వికెట్లు తీసుకుని బెంగళూరు నడ్డి విడిచాడు. దీంతో 19.4 ఓవర్లలో బెంగళూరు 153 పరుగులకు ఆలౌట్ అయ్యింది. లక్నో 28 పరుగులతో ఈ సీజన్లో రెండో విజయాన్ని నమోదు చేసింది.


అంతకుముందు డి కాక్ (81, 56 బంతుల్లో), పూరన్(40*, 21 బంతుల్లో) చెలరేగడంతో 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 181 పరుగులు చేసింది.

చెలరేగిన మయాంక్

182 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన బెంగళూరుకు ఓపెనర్లు శుభారంభం అందించారు. కేవలం 4.2 ఓవర్లలో 40 పరుగులు జోడించారు. 16 బంతుల్లో 22 పరుగులు చేసిన విరాట్ కోహ్లీని సిద్దార్ధ్ అవుట్ చేశాడు. దీంతో బెంగళూరు పతనం ప్రారంభమయ్యింది. ఆ తరువాత ఓవర్లో కెప్టెన్ డూ ప్లెసిస్ రనౌట్ అయ్యాడు. అదే ఓవర్లో మ్యాక్స్‌వెల్ మయాంక్ బౌలింగ్‌లో డకౌట్ అయ్యాడు. ఇక ఎనిమిదో ఓవర్లో గ్రీన్ 9 పరుగులు చేసి మయాంక్ యాదవ్ బౌలింగ్‌లో పెవిలియన్ చేరాడు. ఈ దశలో రజత్ పటీదార్, అనూజ్ రావత్ ఇన్నింగ్స్ చక్కబెట్టే ప్రయత్నం చేశారు.


11 పరుగులు చేసిన అనూజ్ రావత్ స్టోయినిస్ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు. దీంతో 94 పరుగుల వద్ద బెంగళూరు 5వ వికెట్ కోల్పోయింది. 29 పరుగులు చేసిన రజత్ పటీదార్ మయాంక్ యాదవ్ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు. ఈ ఓవర్లో మయాంక్ యాదవ్ కేవలం ఒక్క పరుగు మాత్రమే ఇచ్చి కీలకమైన పటీదార్ వికెట్ తీసుకున్నాడు. 16వ ఓవర్లో మహిపాల్ లోమ్రోర్ 2 సిక్సర్లు, 1 ఫోర్ కొట్టి విజయ సమీకరణాన్ని 24 బంతుల్లో 59 పరుగులకు తీసుకొచ్చాడు. ఇక నవీన్ ఉల్ హక్ వేసిన 17వ ఓవర్లో లోమ్రోర్ సిక్స్, ఫోర్ కొట్టాడు. కానీ అదే ఓవర్లో కార్తీక్ అవుట్ అయ్యాడు. దీంతో 136 పరుగుల వద్ద బెంగళూరు 7వ వికెట్ కోల్పోయింది.

దీంతో చివరి 3 ఓవర్లలో బెంగళూరు విజయానికి 46 పరుగులు కావాలి. 18వ ఓవర్ మొదటి బంతికే మయాంక్ దగర్ రనౌట్ అయ్యాడు. అదే ఓవర్ 5వ బంతికి లోమ్రోర్ అవుట్ అయ్యాడు. దీంతో బెంగళూరు ఓటమి లాంఛనం అయ్యింది. సిరాజ్ 19వ ఓవర్లో రెండు సిక్సర్లు బాదాడు. దీంతో చివరి ఓవర్లో 30 పరుగులు కావాల్సి వచ్చింది. భారీ షాట్‌కు యత్నించి సిరాజ్ అవుట్ అవ్వడంతో 153 పరుగుల వద్ద బెంగళూరు ఇన్నింగ్స్‌కు తెరపడింది.

డికాక్, పూరన్ విధ్వంసం

ముందుగా టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన లక్నోకు ఓపెనర్లు శుభారంభం అందించారు. కేఎల్ రాహుల్, డి కాక్ హాఫ్ సెంచరీ భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. 2 సిక్సర్ల సాయంతో 20 పరుగులు చేసిన రాహుల్ మ్యాక్స్‌వెల్ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు. ఆ తరువాత పడిక్కల్(6) సిరాజ్ బౌలింగ్‌లో పెవిలియన్ చేరాడు.

ఈ దశలో డి కాక్‌తో జతకట్టిన స్టోయినిస్(24) ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించారు. 56 పరుగులు జోడించిన తర్వాత మ్యాక్స్‌వెల్ ఈ జంటను విడదీశాడు. ఆ వెంటనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న డికాక్.. రీస్ టాప్లీ బౌలింగ్‌లో పెవిలియన్ బాట పట్టాడు. స్టోయినిస్ అవుట్ అవ్వడంతో క్రీజులోకి అడుగు పెట్టిన నికోలస్ పూరన్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. పూరన్ కొట్టిన ఓ సిక్స్ 106 మీ వెళ్లడమే కాకుండా చిన్నస్వామి స్టేడియం బయట పడింది. పూరన్ విధ్వంసంతో లక్నో చివరి రెండు ఓవర్లలో 33 పరుగులు సాధించింది. మొత్తంగా 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 181 పరుగుల భారీ స్కోర్ చేసింది.

Tags

Related News

Paralympics 2024: భారత్ ఖాతాలో మరో స్వర్ణం.. 29కి చేరిన పతకాల సంఖ్య

Vinesh Phogat Bajrang Punia: ‘వినేశ్ ఫోగట్ చీటింగ్ చేసి ఒలింపిక్స్‌కు వెళ్లింది’.. బిజేపీ నాయకుడి వివాదాస్పద వ్యాఖ్యలు

Duleep Trophy 2024: మళ్లీ ముంబై బ్యాటర్ వచ్చాడు.. అదరగొట్టిన ముషీర్ ఖాన్..181

Paralympics Hokato Hotozhe: పారాలింపిక్స్ లో భారత్ పతకాల సంఖ్య 27!.. హై జంప్ లో గోల్డ్, షాట్ పుట్ లో కాంస్యం!

Wrestlers: బ్రేకింగ్ న్యూస్.. కాంగ్రెస్ పార్టీలో చేరిన రెజ్లర్లు వినేష్ ఫొగట్, బజరంగ్ పునియా

US Open 2024: యూఎస్ ఓపెన్..నెంబర్ వన్ ర్యాంకర్ ఓటమి

Duleep Trophy 2024: ముషీర్ ఖాన్ సెంచరీ.. అక్షర్ పటేల్ అదుర్స్

Big Stories

×