EPAPER

RCB vs LSG- IPL 2024 Preview: విరాట్ ఒక్కడేనా?.. నేడు ఆర్సీబీ వర్సెస్ లక్నో

RCB vs LSG- IPL 2024 Preview:  విరాట్ ఒక్కడేనా?.. నేడు ఆర్సీబీ వర్సెస్ లక్నో


RCB vs LSG IPL 2024 Match Prediction: ఐపీఎల్ మ్యాచ్ లు జోరుగా సాగుతున్నాయి. ఈరోజున రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ లక్నో సూపర్ జెయింట్స్ మధ్య బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో రాత్రి 7.30 గంటలకు జరగనుంది. టేబుల్ టాప్ లో చూస్తే లక్నో రెండు మ్యాచ్ లు ఆడి ఒక దాంట్లో గెలిచి 6వ స్థానంలో ఉంది. ఆర్బీసీకి వచ్చేసరికి మూడు మ్యాచ్ లు ఆడి ఒక దాంట్లో గెలిచి, రెండింట ఓడి 9వ స్థానంలో ఉంది. దీని వెనుకే ముంబై ఇండియన్స్ ఆఖరి ప్లేస్ లో ఉండటం విశేషం.

విధివైచిత్రి అంటే ఇదే అనుకుంటాను. టీమ్ ఇండియాలో సూపర్ ప్లేయర్లుగా ఉన్న రోహిత్ శర్మ, విరాట్ కొహ్లీలు  ఆడుతున్న జట్లు ఇలా 9, 10 స్థానాల్లో ఉండటంపై అభిమానులు తలలు పట్టుకుంటున్నారు.


ఇక మ్యాచ్ విషయానికి వస్తే ఈ రెండు జట్ల మధ్య రెండు మ్యాచ్ లు జరిగాయి. ఆ రెండింటిలో ఆర్సీబీ విజయం సాధించింది.  నేటి మ్యాచ్‌లో చూస్తే ఆర్సీబీ వర్సెస్ లక్నో ఇరు జట్లూ సమానంగా కనిపిస్తున్నాయి. అటు బ్యాటింగ్, ఫాస్ట్, స్పిన్ బౌలింగ్‌లో సమతూకంగా ఉన్నాయి. కానీ ఆర్సీబీలో విరాట్ ఒక్కడే బ్యాటింగ్ లో ఆడి, ఒంటరిపోరాటం చేస్తున్నాడు. తనకి మిగిలినవాళ్లు సహకరిస్తే, ఈరోజు మ్యాచ్ లో ఆర్సీబీ విజయం సాధిస్తుందని అందరూ అంచనాలు వేస్తున్నారు.

Also Read: ముంబైకి.. మూడిందా?

టీమ్‌లో ఆల్‌రౌండర్ల పరంగా చూస్తే ఆర్‌సీబీ దగ్గర షాబాజ్ అహ్మద్, గ్లెన్ మాక్స్‌వెల్, మైఖేల్ బ్రేస్‌వెల్ వంటి, మేటి ఆల్ రౌండర్లు ఉన్నారు. అలాగే వనిందు హసరంగా, హర్షల్ పటేల్, కర్ణ్ శర్మ వంటి బౌలర్లు మంచి స్వింగ్ లో ఉన్నారు. మరోవైపు, లక్నోలో చూస్తే కృనాల్ పాండ్యా, దీపక్ హుడా, కైల్ మేయర్స్ ఆల్ రౌండర్ల పాత్రలో ఉన్నారు. సిద్ధార్థ్, నవీన్ ఉల్ హక్, మోషిన్ ఖాన్, రవిబిష్ణోయ్ వీరు మంచి బౌలింగ్ తోనే ఉన్నారు.

రెండు జట్లలో వీరు ఆడవచ్చు:
లక్నో సూపర్‌జెయింట్స్: కేఎల్ రాహుల్ (కెప్టెన్), కైల్ మైయర్స్, దీపక్ హుడా, మార్కస్ స్టోయినిస్/క్వింటన్ డికాక్, నికోలస్ పూరన్, కృనాల్ పాండ్యా, కృష్ణప్ప గౌతమ్/అమిత్ మిశ్రా, యశ్ ఠాకూర్, అవేశ్ ఖాన్/జయ్‌దేవ్ ఉనద్కత్, మార్క్ వుడ్, రవి బిష్ణోయ్.

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు: ఫాఫ్ డుప్లెసిస్ (కెప్టెన్), విరాట్ కోహ్లీ, అనుజ్ రావత్, గ్లెన్ మాక్స్‌వెల్, షాబాజ్ అహ్మద్, దినేష్ కార్తీక్, మైకేల్ బ్రేస్‌వెల్, డేవిడ్ విల్లీ, హర్షల్ పటేల్, కర్ణ్ శర్మ, మహ్మద్ సిరాజ్.

Related News

Duleep Trophy 2024: దులీప్ ట్రోఫీ.. ఇండియా ‘ఏ’ టీం తొలి విజయం

Neeraj Chopra Diamond League: బ్రసెల్స్ డైమండ్ లీగ్ లో నీరజ్ చోప్రాకు రెండో స్థానం.. 2024లో ఏకంగా నాలుగుసార్లు టైటిల్ మిస్!

Matthew Short: చరిత్ర సృష్టించిన ఆస్ట్రేలియా ఓపెనర్..13ఏళ్ల రికార్డు బ్రేక్

Virat Kohli: కోహ్లీ బ్యాటింగ్ ప్రాక్టీస్ షురూ..!

India vs Bangladesh 1st Test: ఒక్కటి గెలిస్తే చాలు.. 92 ఏళ్ల రికార్డు బ్రేక్

MS Dhoni: ధోనీ.. ఓసారి వాటర్ బాటిల్ తన్నేశాడు.. తెలుసా? : బద్రీనాథ్

Piyush Chawla: గంభీర్‌కి.. కొహ్లీ రికార్డులన్నీ తెలుసు: చావ్లా

Big Stories

×