EPAPER

Mirabai Chanu in Paris: ఆరు నెలల తర్వాత.. ‘బంగారు’ కొండ ఎత్తేసింది..!

Mirabai Chanu in Paris: ఆరు నెలల తర్వాత.. ‘బంగారు’ కొండ ఎత్తేసింది..!

Weight lifter Mirabai Chanu qualified for Paris Olympics


Mirabai Chanu in Paris(Sports news headlines): పారిస్ ఒలింపిక్స్ అంతా రెడీ అవుతోంది. అక్కడ పనులు శరవేగంగా జరుగు తున్నాయి. మరోవైపు ఆటగాళ్ల ఎంపిక కూడా స్పీడందుకుంది. జులై చివరి వారం నుంచి ఒలింపిక్స్ మొదలుకానున్నాయి. తాజాగా భారత స్టార్ వెయిట్ లిఫ్టర్ మీరాబాయిచాను పారిస్ ఒలింపిక్స్‌కు దాదాపు అర్హత సాధించింది. గాయం కారణంగా ఆరునెలలపాటు ఆటకు దూరమైంది ఆమె.

ఒలింపిక్స్‌కు అర్హత సాధించాలంటే కచ్చితంగా రెండు టోర్నీలో మూడు క్వాలిఫ్లయిర్స్‌తో పోటీ పడాల్సి ఉంటుంది. ఒలింపిక్స్‌కు సాధించడానికి అవసరమైన ప్రక్రియను పూర్తి చేసింది మీరాబాయి చాను. ఐడబ్ల్యూఎప్ ప్రపంచకప్ గ్రూప్ బీలో పోటీపడిన ఆమె, 49 కేజీల విభాగంలో థర్డ్ ప్లేస్‌లో నిలిచింది. మొత్తం 184 కేజీల బరువు ఎత్తేసింది. స్నాచ్‌లో 81 కేజీలు, క్లీన్ అండ్ జర్క్‌లో 103 కేజీల బరువు ఎత్తి పారిస్ ఒలింపిక్స్‌కు క్వాలిఫై అయ్యింది.


క్వాలిఫికేషన్ ర్యాంకులో మీరాబాయి చాను ప్రస్తుతం సెకండ్ ప్లేస్‌లో ఉంది. టాప్ 10లో ఉన్న వెయిలిఫ్టర్లు మాత్రమే ఒలింపిక్స్‌కు అర్హత సాధిస్తారు. ఈ క్రమంలో చానుకు దాదాపు బెర్త్ ఓకే అయినట్టే ! అధికారికంగా ప్రకటన మాత్రమే రావాల్సి ఉంది.

ఆరునెలల తర్వాత మళ్లీ కోలుకోవడం చాలా హ్యాపీగా ఉందని చెప్పుకొచ్చింది వెయిట్ లిఫ్టర్ మీరాబాయి చాను. చాలా హార్డ్‌గా వర్క్ చేశానని, అందుకు తగిన ప్రతిఫలం దక్కిందని మనసులోని మాట బయటపెట్టింది. పారిస్ ఒలింపిక్స్‌కు బెర్త్ దక్కించుకోవడమే లక్ష్యమన్న ఆమె, అందుకు దగ్గరైనట్లు తెలిపింది. గోల్డ్ మెడల్ సాధించడమే తన తదుపరి లక్ష్యమని వెల్లడించింది.

ALSO READ : రాజస్థాన్ రాజసం.. ముంబై హ్యాట్రిక్..

నాలుగేళ్ల కిందట జరిగిన టోక్యో ఒలింపిక్స్‌లో సిల్వర్ మెడల్‌తో సరిపెట్టుకుంది మీరాబాయి చాను. ఇప్పుడు గోల్డ్‌ అందుకోవాలని తహతహలాడుతోంది ఈ వెయిట్ లిఫ్టర్.

Tags

Related News

Paralympics 2024: భారత్ ఖాతాలో మరో స్వర్ణం.. 29కి చేరిన పతకాల సంఖ్య

Vinesh Phogat Bajrang Punia: ‘వినేశ్ ఫోగట్ చీటింగ్ చేసి ఒలింపిక్స్‌కు వెళ్లింది’.. బిజేపీ నాయకుడి వివాదాస్పద వ్యాఖ్యలు

Duleep Trophy 2024: మళ్లీ ముంబై బ్యాటర్ వచ్చాడు.. అదరగొట్టిన ముషీర్ ఖాన్..181

Paralympics Hokato Hotozhe: పారాలింపిక్స్ లో భారత్ పతకాల సంఖ్య 27!.. హై జంప్ లో గోల్డ్, షాట్ పుట్ లో కాంస్యం!

Wrestlers: బ్రేకింగ్ న్యూస్.. కాంగ్రెస్ పార్టీలో చేరిన రెజ్లర్లు వినేష్ ఫొగట్, బజరంగ్ పునియా

US Open 2024: యూఎస్ ఓపెన్..నెంబర్ వన్ ర్యాంకర్ ఓటమి

Duleep Trophy 2024: ముషీర్ ఖాన్ సెంచరీ.. అక్షర్ పటేల్ అదుర్స్

Big Stories

×