EPAPER

CJI DY Chandrachud: అనవసర విషయాలపై దృష్టి పెడుతోన్న దర్యాప్తు సంస్థలు.. సీజేఐ చంద్రచూడ్

CJI DY Chandrachud: అనవసర విషయాలపై దృష్టి పెడుతోన్న దర్యాప్తు సంస్థలు.. సీజేఐ చంద్రచూడ్
CJI DY Chandrachud
CJI DY Chandrachud

CJI DY Chandrachud: ప్రస్తుతం దేశంలో కేంద్ర దర్యాప్తు సంస్థల తీరుపై భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కేంద్ర దర్యాప్తు సంస్థలు ఇటీవల కాలంలో అసలు విషయాలు వదిలి కొసరు విషయాలపై దృష్టి పెడుతున్నాయని మండిపడ్డారు.


ప్రస్తుతం దేశంలో కేంద్ర దర్యాప్తు సంస్థల విస్తరణ దేశంలో జరగాల్సినంతగా జరగలేదని అన్నారు. దాని ఫలితంగా అవి జాతీయ భద్రత, దేశ వ్యతిరేక నేరాలతో ముడిపడిన కేసులకే మొదటి ప్రాధాన్యత ఇవ్వాల్సి వస్తోందని వెల్లడించారు. దేశ రక్షణ, ఆర్థిక స్కామ్ లపై కాకుండా వేరే వాటిపై కేంద్ర దర్యాప్తు దృష్టి సారిస్తోందని విమర్శించారు. దీంతో దేశానికి సంబంధించి కొన్ని ముఖ్యమైన కేసులను పక్కన పెట్టాల్సిన పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో పాటుగా సీబీఐ వంటి సంస్థలపై అధనపు కేసుల భార పెరుగుతోందని అన్నారు.

సీబీఐ రైజింగ్ డే సందర్భంగా సోమవారం ఢిల్లీలో భారత్ మండపంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్న సీజేఐ డీవై చంద్రచూడ్ ఈ వ్యాఖ్యలు చేశారు. కేంద్ర దర్యాప్తు సంస్థలు కొన్ని క్లిష్టమైన కేసుల ఛేదన క్రమంలో అధునాతన సాంకేతికతను వినియోగించాల్సిన అవసరం ఉందన్నారు. పోలీసులు, న్యాయవ్యవస్థలు, జైళ్ల వ్యవస్థ, ఫోరెన్సిక్ ల్యాబ్స్ కలిసికట్టుగా పనిచేయాలని పిలుపునిచ్చారు.


Also Read: Rahul Gandhi : రాహుల్ గాంధీ మ్యాచ్ ఫిక్సింగ్ కామెంట్స్.. ఈసీకి బీజేపీ ఫిర్యాదు..

నేర దర్యాప్తు కేసుల్లో ఏఐ టెక్నాలజీని వినియోగిస్తే చాలా వేగంగా కేసులను పరిష్కరించేందుకు వీలవుతుందని అన్నారు. ఎఫ్‌ఐఆర్ నుంచి మొదలుకొని కేసు తుది దశకు చేరే వరకు ప్రతీ విషయాన్ని డిజిటలైజ్ చేయడం మంచిదన్నారు. ఈ దిశగా అన్ని కేంద్ర సంస్థలు అడుగులు వేయాలని కోరారు.

Tags

Related News

Nipah virus: కేరళలో నిఫా వైరస్ విజృంభణ.. స్టూడెంట్ మృతి.. రాష్ట్రంలో ఆంక్షలు!

PM Modi: ఇది ట్రైలర్ మాత్రమే.. ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు నాయుడు భేటీ

yashwant Sinha: వాజ్ పేయి సిద్ధాంతాలతో.. పార్టీ పేరు ప్రకటించిన యశ్వంత్ సిన్హా

Delhi: ఢిల్లీకి తదుపరి సీఎం ఎవరు? రేసులో ఆరుగురు పేర్లు.. వీళ్లేనా?

Rajasthan Road Accident: రాజస్థాన్‌లో ట్రక్కును ఢీకొట్టిన తుఫాను.. ఎనిమిది మంది దుర్మరణం

Jammu Kashmir: గాంధీ, నెల్సన్ మండేలాతో బీజేపీ పోల్చుతున్న ఈ బుఖారీ ఎవరు?

PM Narendra Modi: మరో 6 వందే భారత్ రైళ్లు.. వర్చువల్‌గా ప్రారంభించిన ప్రధాని మోదీ

Big Stories

×