EPAPER

Congress: కాంగ్రెస్‌కు భారీ ఊరట.. ఎన్నికల ముందు చర్యలు తీసుకోబోమన్న ఐటీ శాఖ

Congress: కాంగ్రెస్‌కు భారీ ఊరట.. ఎన్నికల ముందు చర్యలు తీసుకోబోమన్న ఐటీ శాఖ

CongressCongress: కాంగ్రెస్ పార్టీకి ఆదాయ పన్ను శాఖ గుడ్ న్యూస్ చెప్పింది. సార్వత్రిక ఎన్నికల ముందు పన్ను నోటీసులపై కాంగ్రెస్ పై ఎటువంటి చర్యలకు పాల్పడమని ఐటీ శాఖ స్పష్టం చేసింది. ప్రస్తుతం ఈ కేసు విచారణను కూడా జులై కు వాయిదా వేయమని ఐటీ శాఖ కోర్టును కోరింది.


ఐటీ శాఖ తీసుకున్న ఈ నిర్ణయంతో సార్వత్రిక ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీకి భారీ ఊరట లభించింది. దాదాపు రూ.3,500 కోట్లకు పన్ను డిమాండ్ నోటిసులకు సంబంధించి ప్రస్తుతానికి కాంగ్రెస్ పార్టీపై ఎటువంటి బలవంతపు చర్యలకు పాల్పడమని సుప్రీంకోర్టుకు ఐటీ శాఖ తెలిపింది. ప్రస్తుతం ఈ నోటిసులపై కాంగ్రెస్ పార్టీ కోర్టులో పిటిషన్ దాఖలు చేయగా.. దాన్ని జులై 24వ తేదీకి వాయిదా వేసింది.

పన్ను డిమాండ్ల నోటీసులకు గాను కాంగ్రెస్ పార్టీ పిటిషన్ దాఖలు చేయగా.. సుప్రీంకోర్టు సోమవారం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా ఐటీ విభాగం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కోర్టులో తన వాదనలు వినిపించారు. ఎన్నికలు ముగిసే వరకు కాంగ్రెస్ పార్టీపై బలవంతపు చర్యలకు దిగబోం అని కోర్టులో తుషార్ మెహతా తెలిపారు. అయితే ఈ కేసులో తమకు ఎటువంటి ముందస్తు ఉత్తర్వులు జారీ చేయకుండానే నోటీసులు ఇచ్చారని కాంగ్రెస్ తరఫు నేత వివేక్ తంఖా ఆరోపించారు.


Also Read: Gyanvapi Mosque: జ్ఞానవాపీ ప్రాంగణంలో హిందూ పూజలు.. కొనసాగింపునకు సుప్రీం అనుమతి..

2017-2018 నుంచి 2020-2021 అసెస్ మెంట్ సంవత్సరాలకు పెనాల్టీ, వడ్డీతో కలిపి మొత్తం రూ.1,823 కోట్లు చెల్లించాలని ఐటీ శాఖ కాంగ్రెస్ పార్టీకి నోటీసులు పంపింది. దీంతో పాటుగా ఆదివారం రూ.1,744 కోట్లు కట్టాలని కాంగ్రెస్ పార్టీకి ఐటీ శాఖ మరో నోటీసును పంపింది.

Related News

Nipah virus: కేరళలో నిఫా వైరస్ విజృంభణ.. స్టూడెంట్ మృతి.. రాష్ట్రంలో ఆంక్షలు!

PM Modi: ఇది ట్రైలర్ మాత్రమే.. ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు నాయుడు భేటీ

yashwant Sinha: వాజ్ పేయి సిద్ధాంతాలతో.. పార్టీ పేరు ప్రకటించిన యశ్వంత్ సిన్హా

Delhi: ఢిల్లీకి తదుపరి సీఎం ఎవరు? రేసులో ఆరుగురు పేర్లు.. వీళ్లేనా?

Rajasthan Road Accident: రాజస్థాన్‌లో ట్రక్కును ఢీకొట్టిన తుఫాను.. ఎనిమిది మంది దుర్మరణం

Jammu Kashmir: గాంధీ, నెల్సన్ మండేలాతో బీజేపీ పోల్చుతున్న ఈ బుఖారీ ఎవరు?

PM Narendra Modi: మరో 6 వందే భారత్ రైళ్లు.. వర్చువల్‌గా ప్రారంభించిన ప్రధాని మోదీ

Big Stories

×