EPAPER

Pollard Retire : ఆడను.. ఆటాడిస్తానంటున్న పొలార్డ్..

Pollard Retire : ఆడను.. ఆటాడిస్తానంటున్న పొలార్డ్..

Pollard Retire : ఇప్పటికే అంతర్జాతీయ క్రికెట్ కు గుడ్‌బై చెప్పిన వెస్టిండీస్ స్టార్ బ్యాటర్ కీరన్ పొలార్డ్… ఇప్పుడు ఐపీఎల్ నుంచి కూడా తప్పుకున్నాడు. భారత T20 లీగ్‌కు రిటైర్మెంట్‌ను ప్రకటించాడు. ఐపీఎల్‌-2023 మినీ వేలానికి ముందు ముంబయి ఫ్రాంఛైజీ తనను రిలీజ్‌ చేయడంతో, పొలార్డ్ ఈ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. అయితే… UAE T20 లీగ్‌లో మాత్రం ముంబయి ఎమిరేట్స్‌ జట్టు తరఫున ఆడతానని ప్రకటించాడు… పొలార్డ్.


ఏకంగా 13 సీజన్ల పాటు ముంబయి ఇండియన్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహించిన పొలార్డ్‌… ఐదుసార్లు టైటిల్‌ గెలిచిన జట్టులో సభ్యుడిగా రికార్డు సృష్టించాడు. ఇకపై ఐపీఎల్ లో మైదానంలో చెలరేగే అవకాశం లేకపోయినా… మైదానం బయట తన తాడాఖా చూపిస్తానంటున్నాడు. దాని కోసం కొత్త అవతారమెత్తబోతున్నాడు. అతడిని బ్యాటింగ్‌ కోచ్‌గా నియమించింది… ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీ. ఈ విషయాన్ని ఇన్‌స్టాగ్రామ్‌ పోస్ట్‌ ద్వారా అభిమానులతో పంచుకున్నాడు… పొలార్డ్.

ఇంకా కొన్నాళ్లు ఆడాలనుకున్నా… ఐపీఎల్ లో ఓ స్థాయి ఉన్న ముంబయి ఇండియన్స్ జట్టులో మార్పు అవసరమని భావించే రిటైర్మెంట్ ప్రకటించానన్నాడు.. పొలార్డ్. ముంబై ఇండియన్స్ జట్టు సభ్యుడిగా చెప్పుకోవడానికి తాను ఇష్టపడతానని… అన్ని సీజన్లలోనూ అద్భుత ఆటతీరును ప్రదర్శించిన ముంబయికి ప్రాతినిధ్యం వహించడం గర్వంగా ఉందని పొలార్డ్ చెప్పుకొచ్చాడు. మొదటిసారి ముకేశ్, నీతా దంపతులను కలిసిప్పుడు… ఇది మన కుటుంబం అని వాళ్లు తనను ఆహ్వానించారని, ఆ మాట ప్రకారం ఇన్నేళ్ల పాటు ఆదరించారని… తనకు మద్దతుగా నిలిచిన ఇద్దరికీ కృతజ్ఞతలు అని పొలార్డ్ పోస్ట్‌లో రాసుకొచ్చాడు.


మరోవైపు… పొలార్డ్ ఐపీఎల్ నుంచి తప్పుకోవడంతో, అతని మ్యాజిక్‌ను కోల్పోబోతున్నామని అన్నారు… నీతా అంబానీ. అయినా… ముంబై ఇండియన్స్ జట్టుతో అతని అనుబంధం కొనసాగుతుందని, బ్యాటింగ్‌ కోచ్‌గా, యూఏఈ ముంబయి ఎమిరేట్స్ ఆటగాడిగా పొలార్డ్ మరింత కీర్తి సంపాదించాలని కోరుకుంటున్నానన్నారు… నీతా అంబానీ. ఎంతో నిబద్ధతతో క్రికెట్ ఆడే పొలార్డ్ కు కొత్త బాధ్యతలతో తమ ఫ్రాంచైజీ స్వాగతం పలుకుతోందన్నారు… ఆకాశ్ అంబానీ.

Related News

Kalinga Movie: నన్ను పద్దు పద్దు అని పిలుస్తుంటే హ్యాపీగా ఉంది: ‘కళింగ’ మూవీ హీరోయిన్ ప్రగ్యా నయన్

Honeymoon Express: ఓటీటీలోనూ రికార్డులు బ్రేక్ చేస్తున్న ‘హనీమూన్ ఎక్స్‌ప్రెస్’

Best Electric Cars: తక్కువ ధర, అదిరిపోయే రేంజ్- భారత్ లో బెస్ట్ అండ్ చీప్ 7 ఎలక్ట్రిక్ కార్లు ఇవే!

Pod Taxi Service: భలే, ఇండియాలో పాడ్ ట్యాక్సీ పరుగులు.. ముందు ఆ నగరాల్లోనే, దీని ప్రత్యేకతలు ఇవే!

Sitaram Yechury: మరింత విషమంగా సీతారాం ఏచూరి ఆరోగ్యం

Vaginal Ring: మహిళల కోసం కొత్త గర్భనిరోధక పద్ధతి వెజైనల్ రింగ్, దీనిని వాడడం చాలా సులువు

Train Passenger Rules: రైల్లో ప్రయాణిస్తున్నారా? టీసీ ఇలా చేస్తే తప్పకుండా ప్రశ్నించవచ్చు, మీకు ఉన్న హక్కులివే!

Big Stories

×