EPAPER

Uttarpradesh Crime : అనుమాన భూతం.. భార్య, పిల్లల్ని చంపి.. మూడురోజులుగా..?

Uttarpradesh Crime : అనుమాన భూతం.. భార్య, పిల్లల్ని చంపి.. మూడురోజులుగా..?

Uttarpradesh Crime News


Uttarpradesh Crime News(News update today in telugu): అనుమానం.. అనే పెను భూతం ఎన్నో కుటుంబాలను చిదిమేసింది. భార్య, భర్తల మధ్య ఘర్షణలో పిల్లలు అనాధలుగా మిగిలిపోయిన ఘటనలెన్నో ఉన్నాయి. సమస్యేదైనా ఉంటే.. కూర్చుని మాట్లాడి పరిష్కరించుకోవాల్సింది పోయి.. క్షణికావేశంలో ప్రాణాలు తీసేస్తున్నారు. ఆ తర్వాత జైలు పాలయ్యి.. జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు. తాజాగా ఉత్తరప్రదేశ్ లో ఓ దారుణ ఘటన వెలుగుచూసింది. అనుమానంతో భార్య ఇద్దరు పిల్లల్ని హతమార్చాడు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గౌతమ్ అనే వ్యక్తి లఖ్ నవూలోని బిజ్నోర్ ప్రాంతంలో తన భార్య జ్యోతి (36), కుమార్తె (6), కుమారుడు (9)తో కలిసి ఒక ఇంట్లో అద్దెకు ఉంటున్నాడు. అయితే ఇటీవల గౌతమ్ – జ్యోతిలకు తరచూ గొడవలు అవుతుండేవి. జ్యోతికి మరో వ్యక్తితో అక్రమ సంబంధం ఉందన్న గౌతమ్ అనుమానం రోజురోజుకూ బలపడుతూ వచ్చింది. మూడ్రోజుల క్రితం కూడా వీరి మధ్య ఇదే విషయమై తీవ్ర వాగ్వాదం జరిగింది. మాట మాట పెరగడంతో జ్యోతి మెడకు చున్నీ బిగించి హత్య చేశాడు గౌతమ్.


Also Read : కడుపులో కొకైన్ క్యాప్సూల్స్.. వాటి విలువ రూ.11 కోట్లు..

ఆపై పిల్లల్ని కూడా గొంతునులిమి హతమార్చాడు. మూడురోజులుగా మృతదేహాలను ఇంట్లోనే ఉంచుకున్నాడు. షరా మామూలుగా వాళ్ల పక్కనే పడుకొని.. మర్నాడు ఉదయం పనికి వెళ్లేవాడు. అయితే ఆ ఇంటి నుంచి దుర్వాసన వస్తుండటాన్ని గమనించిన స్థానికులు.. గౌతమ్ లేని సమయంలో తలుపును పగలగొట్టి చూశారు. ముగ్గురూ శవాలుగా పడి ఉండటాన్ని చూసి నిర్ఘాంతపోయారు. పోలీసులకు సమాచారమివ్వగా.. వారు ఘటనా ప్రాంతానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం కు తరలించారు. నిందితుడైన గౌతమ్ ను అదుపులోకి తీసుకున్నారు.

Related News

Nipah virus: కేరళలో నిఫా వైరస్ విజృంభణ.. స్టూడెంట్ మృతి.. రాష్ట్రంలో ఆంక్షలు!

PM Modi: ఇది ట్రైలర్ మాత్రమే.. ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు నాయుడు భేటీ

yashwant Sinha: వాజ్ పేయి సిద్ధాంతాలతో.. పార్టీ పేరు ప్రకటించిన యశ్వంత్ సిన్హా

Delhi: ఢిల్లీకి తదుపరి సీఎం ఎవరు? రేసులో ఆరుగురు పేర్లు.. వీళ్లేనా?

Rajasthan Road Accident: రాజస్థాన్‌లో ట్రక్కును ఢీకొట్టిన తుఫాను.. ఎనిమిది మంది దుర్మరణం

Jammu Kashmir: గాంధీ, నెల్సన్ మండేలాతో బీజేపీ పోల్చుతున్న ఈ బుఖారీ ఎవరు?

PM Narendra Modi: మరో 6 వందే భారత్ రైళ్లు.. వర్చువల్‌గా ప్రారంభించిన ప్రధాని మోదీ

Big Stories

×