EPAPER

Viral Video: ఉబర్‌లో ఆటో బుక్‌ చేస్తే ఇంత బిల్‌నా.. ఏకంగా చంద్రుడిపైకే వెళ్లొచ్చుగా..?

Viral Video: ఉబర్‌లో ఆటో బుక్‌ చేస్తే ఇంత బిల్‌నా.. ఏకంగా చంద్రుడిపైకే వెళ్లొచ్చుగా..?

Fare Bill In Noida
Fare Bill In Noida: మనం కొన్ని సార్లు వేరే ప్రాంతాలకు వెళ్లాల్సి వచ్చినప్పుడు ఆన్ లైన్ యాప్ ద్వారా ఆటో లేదా బైక్ బుక్ చేసుకుంటాం. అయితే అలానే ఓ వ్యక్తి ఉబర్ యాప్ ద్వారా ఆటో చేసిన తర్వాత షాక్ తిన్నాడు. తన రైడ్ పూర్తి అయ్యాకముందే కోట్లలో బిల్ రావడంతో ఒక్కసారిగా షాక్ అయ్యాడు. ఈ వింత ఘటన ఇటీవలే యూపీలో వెలుగు చూసింది.


ఉత్తర్ ప్రదేశ్ లోని నొయిడాకు చెందిన దీపక్ టెంగూరియా అనే యువకుడు శుక్రవారం ఉబర్ ద్వారా ఆటో బుక్ చేశాడు. అయితే తాను క్యాబ్ బుక్ చేసుకునే ముందు బిల్ రూ.62 చెల్లించాలని చూపించింది. దీంతో అతను రైడ్ బుక్ చేసుకున్నాడు. అయితే రైడ్ ప్రారంభమైన కొద్ది సేపటికి ఆటోలో కూర్చున్న దీపక్ మధ్యలో బిల్ ఒక్కసారిగా చూసుకున్నాడు.

అయితే అందులో కనిపిస్తున్న బిల్ చూసి కంగుతిన్నాడు. ఆ బిల్ రూ.7.66 కోట్లు చూపించింది. దీంతో కంగుతిన్న దీపక్ దిక్కుతోచని స్థితిలో రైడ్ మధ్యలోనే దిగిపోయాడు. అయితే ఆ బిల్ లో ట్రిప్ ఫేర్ గా రూ.1,67,74,647 చేస్తున్నట్లు కనిపించింది. ఆ తర్వాత వెయిటింగ్ కోసం అని రూ.5,99,09,189, ప్రొమోషన్‌ కాస్ట్‌ రూ.75తో కలిసి మొత్తం రూ.7,66 ,83,762 చెల్లించాలని చూపించింది.


ఈ బిల్లు చూసిన దీపక్ విషయాన్ని తన మిత్రుడు ఆశిష్ కు చెప్పాడు. దీంతో అతను ఈ విషయాన్ని ట్వీట్టర్ లో పోస్ట్ చేశాడు. వీరిద్దరూ మాట్లాడుతూ ఉబర్ యాప్ లో చూపించిన బిల్ మొత్తాన్ని స్కీన్ షాట్ తీసి వీడియోలో పోస్ట్ చేశాడు. అయితే చంద్రుడు మీదకి టూర్ బుక్ చేసినా కూడా ఇంత మొత్తంలో ఖర్చు కాదేమోనని వారు సంభాషించారు. కోటిశ్వరూ కావాలంటే ఉబల్ ఫ్రాంచైజీ తీసుకోవడం ఉత్తమం అని వారు వ్యాగ్యాస్త్రాలు సంధించారు.

Also Read: Flipkart Fake Delivery: ఇదేందయ్యా.. సెల్ ఫోన్ ఆర్డర్ చేస్తే రాళ్లు పంపావు.. పైగా సారి ఒకటి

ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. దీంతో దీన్ని చూసిన నెటిజన్లు ఉబర్ సంస్థపై రకరకాలు కామెంట్స్ చేస్తూ మండిపడుతున్నారు. మరి కొందరు ఈ విషయాన్ని ఉబర్ సంస్థకు షేర్ చేశారు. దీంతో ఈ విషయంపై ఉబర్ సంస్థ స్పందించింది. అతనికి కలిగిన ఇబ్బందికి గాను ఉబర్ సంస్థ క్షమాపణలు చెప్పింది. ఈ సమస్యను త్వరగా పరిశీలించి పరిష్కరిస్తామని వెల్లడించింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.

Tags

Related News

Chinese Aquarium Whale Shark: నకిలీ వేల్ షార్క్ చూపించి కోట్లు సంపాదించిన చైనా కంపెనీ.. ఎలా గుర్తుపట్టారంటే

UP Train Incident: రైలు కిటికీ నుంచి జారిపడ్డ‌ చిన్నారి.. చిమ్మ చీకట్లో 16 కి. మీ.. సీన్ కట్ చేస్తే..

Funny Resignation Letter: ‘మంచి భవిష్యత్తు కోసం మరో ఉద్యోగంలో చేరుతున్నా.. నచ్చకపోతే తిరిగి వస్తా’.. వింత రాజీనామా వైరల్

Viral Video: ఇది జర్నీయా? లేక సైన్స్ ఫిక్షన్ మూవీనా? నెట్టింట వైరల్ అవుతున్న చైనీస్ యువకుడి వీడియో!

Viral News: ఔనా, నిజమా.. ఇద్దరు వ్యక్తులు కలలో కమ్యునికేట్ చేసుకోవచ్చా? ఇవిగో ఆధారాలు

Ratan Tata’s Pet Dog: అయ్యో పాపం.. రతన్ టాటా పెంపుడు కుక్క చనిపోయిందా?

మొబైల్ నెట్‌వర్క్‌ లేని భూలోక స్వర్గం.. ప్రశాంతంగా ఉండాలనుకుంటే అక్కడికి వెళ్లాల్సిందే!

Big Stories

×