EPAPER

Pakistan PM Shehbaz Sharif: పాక్ ప్రధాని కీలక నిర్ణయం.. రెడ్ కార్పెట్‌కు గుడ్ బై

Pakistan PM Shehbaz Sharif: పాక్ ప్రధాని కీలక నిర్ణయం.. రెడ్ కార్పెట్‌కు గుడ్ బై
Pakistan PM Shehbaz Sharif news
Pakistan PM Shehbaz Sharif

Pakistan PM Shehbaz Sharif news(International news in telugu): గత కొన్నాళ్లుగా పాకిస్థాన్ ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టూడుతోంది. ఎన్ని నిర్ణయాలు తీసుకున్నా సరే ఆర్థిక ఊభి నుంచి బయపడలేకపోంది. ఈ నేపథ్యంలో పాకిస్థాన్ ప్రధాని షెహబాద్ షరీఫ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. సీనియర్ అధికారుల పర్యటన నేపథ్యంలో ఏర్పాటు చేసే రెడ్ కార్పెట్ విధానానికి స్వస్తి పలికారు.


ఆర్థిక సంక్షోంభ నుంచి బయటపడేందుకు పాక్ ప్రభుత్వం శతవిధాలా ప్రయత్నాలు చేస్తోంది. దీనిలో భాగంగా మంత్రులు, సీనియర్ అధికారుల పర్యటనల్లో ఏర్పాటు చేసే ఎర్ర తివాచీల వాడకానికి స్వస్తి పలుకుతున్నట్లు తెలిపారు. వెంటనే దీనికి సంబంధించిన ఆదేశాలను కూడా అక్కడి ప్రభుత్వం జారీ చేసింది.

రెడ్ కార్పెట్ ఏర్పాట్లును రద్దు చేయడం ద్వారా కొంత మేర ఖర్చును ఆదా చేసే అవకాశం ఉన్నందున పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం ఆర్థిక సంక్షోభంలో ఉన్న పాక్ తమకు సాయం చేయాలంటూ అంతర్జాతీయ సంస్థలపై ఆధారపడుతోంది. తమ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు అంతర్జాతీయ ఆర్థిక సంస్థలు చెప్పిన విధంగా పలు మార్గదర్శకాలను పాటిస్తోంది.


Also Read: US Visa Fees Hike: అమెరికా వెళ్లేవారికి షాక్.. వీసా ఫీజులు పెంపు.. ఏప్రిల్ 1 నుంచి అమలు..

క్యాబినెట్ డివిజన్ జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం, భవిష్యత్తులో అధికారిక కార్యక్రమాలలో ఫెడరల్ మంత్రులు, ప్రభుత్వ ప్రముఖులకు రెడ్ కార్పెట్ ఉపయోగించరాదని ప్రధాని ఆదేశించారు. అయితే, ఇది విదేశీ దౌత్యవేత్తలకు మాత్రమే ప్రోటోకాల్‌గా ఉపయోగించబడుతుందని తెలిపారు. గత వారం, ప్రధాన మంత్రి షరీఫ్, క్యాబినెట్ సభ్యులు తమ జీతాలు, ప్రోత్సాహకాలను స్వచ్ఛందంగా వదులుకోవాలని నిర్ణయించుకున్నారు.

Tags

Related News

Crime: స్కూల్ బాత్రూంలో కాల్పులు.. బాలుడు మృతి

Russia president Putin: కమలా హ్యారిస్ కు జై కొట్టిన రష్యా అధ్యక్షుడు పుతిన్

USA Gun Fire: తండ్రి గిఫ్ట్‌గా ఇచ్చిన గన్‌తోనే స్కూల్‌లో అరాచకం.. ఐదుగురిని కాల్చి చంపిన ఆ నిందితుడి వయస్సు 14 ఏళ్లే!

PM Modi: భారత్‌లోనూ సింగపూర్‌లను సృష్టిస్తున్నాం: మోదీ

Muhammad Yunus: షేక్ హసీనాకు యూనస్ స్ట్రాంగ్ వార్నింగ్.. ఎందుకంటే ?

Japan Resignation Companies: ఉద్యోగుల చేత రాజీనామా చేయించడం కూడా ఒక బిజినెస్.. జపాన్ లో కొత్త వ్యాపారం

US’s Georgia school shooting: అమెరికాలో మళ్లీ కాల్పులు.. ఈసారి స్కూల్ లో.. నలుగురు మృతి

Big Stories

×