EPAPER

DC vs CSK IPL 2024 Preview: సీఎస్కే హ్యాట్రిక్ కొడుతుందా? నేడు విశాఖలో ఢిల్లీ క్యాపిటల్స్ తో మ్యాచ్

DC vs CSK IPL 2024 Preview: సీఎస్కే హ్యాట్రిక్ కొడుతుందా? నేడు విశాఖలో ఢిల్లీ క్యాపిటల్స్ తో మ్యాచ్

DC vs CSK Dream11 Prediction


DC vs CSK Dream11 Prediction-IPL 2024: మహేంద్ర సింగ్ ధోనీ క్రికెట్ కెరీర్ ప్రారంభించినప్పుడు తన పేరు ప్రపంచానికి తెలిసింది విశాఖపట్నం నుంచే.. అందుకే తనకి ఇది హోంగ్రౌండ్ గా చెబుతుంటాడు. ఇప్పటికే రెండు మ్యాచ్ లు నెగ్గి మంచి ఊపు మీదున్న చెన్నయ్ సూపర్ కింగ్స్ నేడు ఢిల్లీ క్యాపిటల్స్ తో తలపడనుంది.

మ్యాచ్ రాత్రి 7.30కి ప్రారంభం కానుంది. ఈ రెండు జట్ల మధ్య ఇప్పటి వరకు 29 మ్యాచ్ లు జరిగాయి. అందులో సీఎస్కే 19 గెలిస్తే, ఢిల్లీ 10 గెలిచింది.


సీఎస్కేలో కెప్టెన్ గా బాధ్యతలు చేపట్టిన రుతురాజ్ గైక్వాడ్ సీనియర్ ధోనీ సారథ్యంలో జట్టుని విజయ పథంలో నడిపిస్తున్నాడు. ఓపెనర్లుగా రహానె, రుతురాజ్ చక్కటి ఆరంభాన్ని ఇస్తున్నారు. తర్వాత రచిన్ రవీంద్ర, శివమ్ దుబె, రవీంద్ర జడేజా,  డారిల్ మిచెల్ వీరందరూ మంచి స్ట్రోక్ ప్లేయర్లు కావడంతో ఒకడు పోతే ఒకడన్నట్టు చితక్కొట్టేస్తున్నారు.

Also Read: నెట్టింట పృథ్వీ షా చర్చ.. రచ్చరచ్చ.

ఇప్పుడు ఢిల్లీ బౌలింగ్ లో వీరిని నిలువరించే మొనగాళ్లు ఎవరంటే ముఖేష్ కుమార్, ఖలీల్ అహ్మద్, అక్షర్ పటేల్, కులదీప్ యాదవ్ ఉన్నారు.

ఢిల్లీ విషయానికి వస్తే బ్యాటింగ్ లో డేవిడ్ వార్నర్, మిచెల్ మార్ష్, రికీ భుల్, కెప్టెన్ రిషబ్ పంత్ వీరిపై ఆధారపడింది. ప్రథ్వీషాని ఆడించకపోవడంతో నెట్టింట రచ్చగా మారింది. ఇంతవరకు ఎవరూ కూడా తమ స్థాయికి తగిన ప్రదర్శన చేయకపోవడంతో రెండు మ్యాచ్ ల్లో ఢిల్లీ ఓటమి పాలైంది.

సీఎస్కే బౌలింగ్ విషయానికి వస్తే దీపక్ చాహర్, మహీష్ తీక్షణ, రవీంద్ర జడేజా తదితరులున్నారు.

మరి రేపటి మ్యాచ్ లో రిషబ్ పంత్, డేవిడ్ వార్నర్ విజృంభిస్తే సీఎస్కేకి కష్టాలు తప్పవని అంటున్నారు.

Related News

Duleep Trophy 2024: దులీప్ ట్రోఫీ.. ఇండియా ‘ఏ’ టీం తొలి విజయం

Neeraj Chopra Diamond League: బ్రసెల్స్ డైమండ్ లీగ్ లో నీరజ్ చోప్రాకు రెండో స్థానం.. 2024లో ఏకంగా నాలుగుసార్లు టైటిల్ మిస్!

Matthew Short: చరిత్ర సృష్టించిన ఆస్ట్రేలియా ఓపెనర్..13ఏళ్ల రికార్డు బ్రేక్

Virat Kohli: కోహ్లీ బ్యాటింగ్ ప్రాక్టీస్ షురూ..!

India vs Bangladesh 1st Test: ఒక్కటి గెలిస్తే చాలు.. 92 ఏళ్ల రికార్డు బ్రేక్

MS Dhoni: ధోనీ.. ఓసారి వాటర్ బాటిల్ తన్నేశాడు.. తెలుసా? : బద్రీనాథ్

Piyush Chawla: గంభీర్‌కి.. కొహ్లీ రికార్డులన్నీ తెలుసు: చావ్లా

Big Stories

×