EPAPER

Financial Changes from 1st April: అలర్ట్.. ఏప్రిల్ 1 నుంచి ఈ క్రెడిట్ కార్డులు, వాలెట్ల రూల్స్ మారుతున్నాయ్

Financial Changes from 1st April: అలర్ట్.. ఏప్రిల్ 1 నుంచి ఈ క్రెడిట్ కార్డులు, వాలెట్ల రూల్స్ మారుతున్నాయ్
Financial Aspects changes from April 1st 2024
Financial Aspects changes from April 1st 2024

Credit Cards and Wallet Changes in 2024-25 Financial Year: ఏప్రిల్ 1 నుంచి కొత్త ఆర్థిక సంవత్సరం (2024-25 New Financial Year) ప్రారంభమవుతోంది. ఈ కొత్త ఫైనాన్షియల్ ఇయర్ లో క్రెడిట్ కార్డుల రూల్స్ మారుతున్నాయి. ఎస్బీఐ, ఐసీఐసీఐ, యాక్సిస్, ఎస్ బ్యాంక్ లు క్రెడిట్ కార్డుల రివార్డ్ పాయింట్లలో మార్పులు చేస్తున్నాయి.


State Bank of India

ఏప్రిల్ 1 నుంచి SBI క్రెడిట్ కార్డ్ రివార్డు పాయింట్ల విధానాల్లో మార్పులు తీసుకొస్తుంది. అద్దె చెల్లింపులపై ఉన్న రివార్డు పాయింట్లను ఇకపై నిలిపివేయనుంది. ఏప్రిల్ 1వ తేదీ నుంచి SBI క్రెడిట్ కార్డు దారులకు ఈ నిబంధనలు వర్తిస్తాయి. AURUM, SBI card Elite, Simply Click SBI Cards వాడుతున్నవారికి రివార్డు పాయింట్లు ఆగిపోనున్నాయి.


ICICI Bank

క్రెడిట్ కార్డు నుంచి వినియోగదారులు పొందుతున్న ప్రయోజనాలను మారుస్తున్న బ్యాంకుల్లో ICICI ఒకటి. కాంప్లిమెంటర్ ఎయిర్ పోర్టు లాంజ్ యాక్సెస్ నిబంధనలను సవరించింది. ఈ త్రైమాసికంలో ఈ అవకాశాన్ని వాడుకోవాలంటే.. గత త్రైమాసికంలో కనీసం రూ.35000 ఖర్చు చేయాల్సి ఉంటుంది.

Also Read: కొత్త ఆర్థిక సంవత్సరం.. ఏప్రిల్ 1 నుంచి మారుతున్న ఇన్ కం ట్యాక్స్ రూల్స్ ఇవే..

YES Bank

ICICI మాదిరిగానే YES Bank కూడా ఎయిర్ పోర్ట్ లాంజ్ యాక్సెస్ నిబంధనలను సవరించింది. ఈ సదుపాయం పొందాలంటే.. కనీసం రూ.10,000 ఖర్చు చేసి ఉండాలి.

AXIS Bank

రివార్డు పాయింట్లు, లాంజ్ యాక్సెస్ తో పాటు.. వార్షిక ఫీజుల్లో కీలక మార్పులు తెచ్చింది. జీవిత బీమా, గోల్డ్, ఇతర ఖర్చులను మాగ్నస్ క్రెడిట్ కార్డు ద్వారా జరిపితే.. ఎలాంటి రివార్డు పాయింట్లు ఉండవని స్పష్టం చేసింది. ఇక ఎయిర్ పోర్ట్ లాంజ్ యాక్సెస్ పొందాలంటే.. గత త్రైమాసికంలో మూడు నెలల్లో కనీసం రూ.50,000 ఖర్చు చేయాల్సి ఉంటుంది. అలాగే.. లాంజ్ లలో కాంప్లిమెంటరీ గెస్ట్ విజిట్ సంఖ్యను 8 నుంచి 4 కు తగ్గిస్తోంది. ఏప్రిల్ 20వ తేదీ నుంచి ఈ మార్పులు అమల్లోకి వస్తాయని వెల్లడించింది.

OLA Money Wallet

కొత్త ఆర్థిక సంవత్సరంలో ఓలా మనీ కూడా కొత్త మార్పులు చేస్తున్నట్లు తెలిపింది. ఏప్రిల్ 1 నుంచి వాలెట్ లోడ్ పరిమితి కనీసం గరిష్టంగా రూ.10,000 ఉండాలని తెలిపింది.

Also Read: Investments : డబ్బులు సంపాదించుడు కాదు.. ఇన్వెస్ట్ చేయడం ముఖ్యం బిగులు!

New NPS Rule (National Pension System) 

నూతన ఆర్థిక సంవత్సరంలో నేషనల్ పెన్షన్ సిస్టమ్ కూడా మార్పులు చేస్తుంది. కొత్త రూల్ ప్రకారం.. వినియోగదారులంతా CRA లాగిన్ సమయంలో టూ ఫాక్టర్ ఆధార్ అథెంటికేషన్ చేయవలసి ఉంటుంది. సెక్యూరిటీ కోసమే ఈ మార్పు చేసినట్లు NPS వెల్లడించింది.

Tags

Related News

Petrol vs Electric Cars: బాబోయ్.. పెట్రోల్ కారుతో పోల్చితే ఎలక్ట్రిక్ కారు ఇంత బెస్టా? ఏడాదికి అంత డబ్బు ఆదా చేసుకోవచ్చా?

iPhone Craze: ఐఫోన్ పిచ్చెక్కిస్తోందా? భారతీయుల స్వేచ్ఛ హరీ.. ఎలాగో తెలుసా?

Onion Export Restrictions: ఉల్లి రైతులకు శుభవార్త.. ఎన్నికల దృష్ట్యా ఎగుమతులపై ఆంక్షలు తొలగించిన కేంద్రం..

Vande Bharat Metro Train: వందే భారత్ ‘మెట్రో రైల్’ వచ్చేస్తోంది.. టికెట్ రేట్ మరీ అంత తక్కువా?

Govt Schemes Interest rate up to 8.2%: అత్యధిక వడ్డీ చెల్లించే ప్రభుత్వ పథకాలివే.. పెట్టుబడి పూర్తిగా సురక్షితం..

Gold and Silver Price: బంగారంతో పోటీ పడుతున్న వెండి.. మళ్లీ లక్షకు చేరువలో.. ఇలాగైతే కొనేదెలా ?

Zomato Food Delivery on Train : ఇకపై రైలు ప్రయాణంలోనూ మీకిష్టమైన ఆహారం.. ట్రైన్ లో జొమాటో డెలివరీ!

Big Stories

×