EPAPER

Sunil Gavaskar: విరాట్ ఒక్కడు ఎంతకాలం లాగుతాడు: గవాస్కర్ ఆవేదన

Sunil Gavaskar: విరాట్ ఒక్కడు ఎంతకాలం లాగుతాడు: గవాస్కర్ ఆవేదన
Sunil Gavaskar
 

Sunil Gavaskar About Virat kohli RCB vs KKR, IPL 2024: ఐపీఎల్ మ్యాచ్ ల సందర్భంగా రకరకాల సంఘటనలు జరుగుతున్నాయి. ఒకొక్క మ్యాచ్ లో ఒకొక్క సందర్భం , ఒకొక్క చర్చకు దారితీస్తోంది. ముఖ్యంగా ఆర్సీబీ వర్సెస్ కోల్ కతా మధ్య జరిగిన మ్యాచ్ పై సీనియర్ ప్లేయర్ గవాస్కర్ స్పందించాడు. అసలు ఆర్బీసీలో ఏం జరుగుతోందని ప్రశ్నించాడు. ప్రతీ సిరీస్ లో ఒక్క విరాట్ మాత్రమే ఆడుతున్నాడని అన్నాడు. మిగిలిన టాప్ ఆర్డర్ అంతా షో చేస్తోందని ఆవేదన వ్యక్తం చేశాడు.


ఒక్కడిమీద ఇలా భారం పెట్టడం సమంజసమేనా? అని ప్రశ్నించాడు. కెప్టెన్ డుప్లెసిస్, ఒంటిచేత్తో మ్యాచ్ లు గెలిపించే గ్లెన్ మ్యాక్స్ వెల్ , కొత్త ఆటగాడు రజత్ పటీదార్ వీరందరూ ఏం చేస్తున్నట్టని అడిగాడు. కొత్తగా వచ్చిన కామెరూన్ గ్రీన్ ప్రదర్శన కూడా పరమ చెత్తగా ఉందని అన్నాడు. అంతేకాదు బెంగళూరు టీమ్ మేనేజ్మెంట్ అంతటిపై తన అసహనం వ్యక్తం చేశాడు.

ఇంకెన్నాళ్లు విరాట్ ఒక్కడూ జట్టుని మోయాలని తెలిపాడు. ఇది భావ్యమేనా? జట్టుకి సిగ్గుగా లేదా? అని ఘాటుగానే విమర్శించాడు. కప్ సాధించాలంటే ఒక్కరిపై ఆధారపడితే రాదని, జట్టు సమష్టిగా ఆడి గెలవాలని అన్నాడు, క్రికెట్ అంటే ఒక్కడు ఆడే ఆట కాదని, 11 మంది ఆడాలని అన్నాడు. కోల్ కతా అలా ఆడిందని తెలిపాడు.


Also Read: వారెవ్వా.. ఏమి సిక్సర్ భయ్..

ఆర్సీబీలో కొహ్లీకి సరైన మద్దతు దొరకడం లేదని అన్నాడు. సహచరులందరూ ఒకొక్కరుగా వెనుతిరుగుతుంటే ఒత్తిడితో కూడాని మ్యాచ్ ని విరాట్ ఆడుతున్నాడని, తనకి మిగిలిన వాళ్లు సహకరించి ఉంటే ఫ్రీగా ఆడేవాడని తెలిపాడు. తను వికెట్ కాపాడుకుంటూ ఆడాలనే భావన లేకపోతే ఇంకా బ్రహ్మండంగా ఆడతాడు, తన సహజసిద్ధమైన ఆటతో చెలరేగుతాడని ఆడుతాడని అన్నాడు. ఈసారి నుంచైనా కొంచెం మారండి అని హితబోధ చేశాడు.

గవాస్కర్ మాటలపై మరికొందరు సీనియర్లు గళం కలిపారు. ఇంత జరుగుతుంటే నెటిజన్లు ఊరుకుంటాారా? వారు వీరికన్నా విశ్లేషకులు కదా…వీరు ఆడి చెబుతారు. వారు ఆడకుండా టీవీల ముందు కూర్చుని చెబుతారు. ఆ బ్యాచ్ అప్పుడే స్టార్ట్ చేసింది. గవాస్కర్ ఫైర్ ఎంతవరకు తీసుకువెళుతుందో చూడాలని మరికొందరు వ్యాక్యానిస్తున్నారు.

Related News

Duleep Trophy 2024: దులీప్ ట్రోఫీ.. ఇండియా ‘ఏ’ టీం తొలి విజయం

Neeraj Chopra Diamond League: బ్రసెల్స్ డైమండ్ లీగ్ లో నీరజ్ చోప్రాకు రెండో స్థానం.. 2024లో ఏకంగా నాలుగుసార్లు టైటిల్ మిస్!

Matthew Short: చరిత్ర సృష్టించిన ఆస్ట్రేలియా ఓపెనర్..13ఏళ్ల రికార్డు బ్రేక్

Virat Kohli: కోహ్లీ బ్యాటింగ్ ప్రాక్టీస్ షురూ..!

India vs Bangladesh 1st Test: ఒక్కటి గెలిస్తే చాలు.. 92 ఏళ్ల రికార్డు బ్రేక్

MS Dhoni: ధోనీ.. ఓసారి వాటర్ బాటిల్ తన్నేశాడు.. తెలుసా? : బద్రీనాథ్

Piyush Chawla: గంభీర్‌కి.. కొహ్లీ రికార్డులన్నీ తెలుసు: చావ్లా

Big Stories

×