EPAPER

KCR : ముందస్తు ముచ్చటలేదు..షెడ్యూల్‌ ప్రకారమే అసెంబ్లీ ఎన్నికలు: సీఎం కేసీఆర్‌

KCR : ముందస్తు ముచ్చటలేదు..షెడ్యూల్‌ ప్రకారమే అసెంబ్లీ ఎన్నికలు: సీఎం కేసీఆర్‌


KCR : తెలంగాణలో ముందస్తు ఎన్నికల ముచ్చట లేనట్టే. ముందస్తు ఎన్నికలకు వెళ్లే ఆలోచన లేదని టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్‌ క్లారిటీ ఇచ్చారు. తెలంగాణ భవన్‌లో జరిగిన టీఆర్ఎస్ విస్తృతస్థాయి సమావేశంలో వచ్చే ఎన్నికలకు సన్నద్ధతపై నేతలతో చర్చించారు. రాష్ట్రంలో షెడ్యూల్‌ ప్రకారమే శాసనసభ ఎన్నికలు జరుగుతాయని తెలిపారు. పార్టీ శ్రేణులు ఎన్నికలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. టీఆర్ఎస్ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

ప్రజల్లోకి వెళ్లండి..


ఎమ్మెల్యేలు బాగా పనిచేయాలని కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. ఎమ్మెల్యేలను మార్చాలన్న ఉద్దేశం లేదని స్పష్టం చేశారు. సర్వేలన్నీ టీఆర్ఎస్ కే అనుకూలంగా ఉన్నాయని తెలిపారు. అధికారం మళ్లీ దక్కుతుందనే విశ్వాసాన్ని కేసీఆర్ ప్రకటించారు. అభివృద్ధి, సంక్షేమ పథకాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని నేతలకు దిశానిర్దేశం చేశారు. లబ్ధిదారుల పూర్తి సమాచారం ఎమ్మెల్యేల వద్ద ఉండాలని స్పష్టం చేశారు. ఏవైనా సమస్యలుంటే ప్రభుత్వం దృష్టికి తేవాలని సూచించారు.

బీజేపీపై ఎదురుదాడి

బీజేపీ నుంచి ఎదురయ్యే దాడిని సమర్థంగా తిప్పికొట్టాలని నేతలకు కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. మునుగోడు తరహాలో పటిష్ఠ ఎన్నికల వ్యూహం తయారు చేయాలని సూచించారు. ఎమ్మెల్యేలు, కార్యకర్తలు నిత్యం ప్రజలతో మమేకం కావాలన్నారు. ప్రజలతో ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహించాలని నిర్దేశించారు. ప్రభుత్వాన్ని కూలగొట్టేందుకు బీజేపీ నేతలు ప్రయత్నిస్తున్నారని కేసీఆర్ మండిపడ్డారు. ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం కేసులో చట్టం తన పని తాను చేస్తోందన్నారు. సీబీఐ, ఈడీ దాడులకు భయపడాల్సిన అవసరం లేదన్నారు. ఎమ్మెల్సీ కవితను కూడా పార్టీలో చేరాలని బీజేపీ ఒత్తిడి చేసిందని పార్టీ నేతలకు కేసీఆర్‌ వివరించారు.

Related News

Johnny Master : జానీ మాస్టర్ పై వేటు.. కేసు పెట్టడం పై ఆ హీరో హస్తం ఉందా?

Kalinga Movie: నన్ను పద్దు పద్దు అని పిలుస్తుంటే హ్యాపీగా ఉంది: ‘కళింగ’ మూవీ హీరోయిన్ ప్రగ్యా నయన్

Honeymoon Express: ఓటీటీలోనూ రికార్డులు బ్రేక్ చేస్తున్న ‘హనీమూన్ ఎక్స్‌ప్రెస్’

Best Electric Cars: తక్కువ ధర, అదిరిపోయే రేంజ్- భారత్ లో బెస్ట్ అండ్ చీప్ 7 ఎలక్ట్రిక్ కార్లు ఇవే!

Pod Taxi Service: భలే, ఇండియాలో పాడ్ ట్యాక్సీ పరుగులు.. ముందు ఆ నగరాల్లోనే, దీని ప్రత్యేకతలు ఇవే!

Sitaram Yechury: మరింత విషమంగా సీతారాం ఏచూరి ఆరోగ్యం

Vaginal Ring: మహిళల కోసం కొత్త గర్భనిరోధక పద్ధతి వెజైనల్ రింగ్, దీనిని వాడడం చాలా సులువు

Big Stories

×