EPAPER

WhatsApp : వాట్సాప్ లో మరో రెండు కొత్త ఫీచర్లు. నోటిఫికేషన్ల ఆటో మ్యూట్, రెండు ఫోన్లలో సేమ్ నెంబర్ తో వాట్సాప్

WhatsApp : వాట్సాప్ లో మరో రెండు కొత్త ఫీచర్లు. నోటిఫికేషన్ల ఆటో మ్యూట్, రెండు ఫోన్లలో సేమ్ నెంబర్ తో వాట్సాప్

WhatsApp : వాట్సాప్ ఇటీవల కొత్త కొత్త ఫీచర్లతో దూకుడు పెంచింది. ఇప్పటికే గ్రూప్ వీడియో కాల్ సభ్యుల సంఖ్య 32కు పెంచింది. గ్రూప్ సభ్యుల సంఖ్య రెట్టింపు చేసి 1024కు చేర్చింది. కమ్యూనిటీ అనే కొత్త ఫీచర్ ని తెచ్చింది. ఇక ఇప్పుడు ఒకే మొబైల్ నెంబర్ తో రెండు ఫోన్లలోనూ వాట్సాప్ వాడుకునే ఫీచర్ ని తెస్తోంది. యూజర్లకు మరో రిలీఫ్ కలిగించే ఫీచర్ ని ఇంట్రడ్యూస్ చేసింది. నెట్ ఆన్ చేయగానే నోటిఫికేషన్లు కుప్పలు తెప్పలుగా వచ్చి పడుతుంటాయి. వీటిని కంట్రోల్ చేసేలా వాట్సాప్ కొత్త ఫీచర్ ని తీసుకొచ్చింది. 256 మంది కంటే ఎక్కువ మంది సభ్యులుగా ఉన్న గ్రూపు నోటిఫికేషన్లు ఆటోమేటిగ్గా మ్యూట్ అవుతాయి. అంటే 256 మంది షేర్ చేసే మెసేజ్ ల నోటిఫికేషన్లు మనకు కనిపిస్తాయి. కొత్తగా చేరే వ్యక్తులు షేర్ చేసే నోటిఫికేషన్లు మాత్రం అగుపించవు. మిగతా మెసేజ్ లు చూడాలంటే యూజర్ తప్పనిసరిగా అన్ మ్యూట్ చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఈ ఫీచర్ వాట్సాప్ బీటా వర్షన్ ఆండ్రాయిడ్ యూజర్లకు మాత్రమే అందుబాటులో ఉంది. త్వరలోనే అందరికీ అందుబాటులోకి తీసుకురానున్నారు.
ఇక వాట్సాప్ కంపానియన్ మోడ్ పేరుతో మరో కొత్త ఫీచర్ ని కూడా తీసుకొస్తోంది. దీని ప్రకారం యూజర్లు తమ వాట్సాప్ అకౌంట్ తో నాలుగు డివైజ్ లలో లాగిన్ కావచ్చు. వీటిలో రెండు మొబైల్ ఫోన్లలో లాగిన్ అయ్యేందుకు వీలుకలుగుతుంది. దీంతో ఒకేసారి వేర్వేరు ఫోన్లలో ఒకే నెంబర్ తో వాట్సాప్ సేవలు పొందే అవకాశం కలుగుతుంది. ప్రస్తుతం ఈ ఫీచర్ టెస్టింగ్ స్టేజ్ లో ఉంది. ఇది సక్సెస్ అయితే త్వరలోనే యూజర్లకు అందుబాటులోకి రానుంది.
వాట్సాప్ ద్వారా ఎన్నో సేవలను పొందొచ్చు. టెక్ట్స్ మెసేజ్ లు, ఫొటోలు, డాక్యుమెంట్లు, వీడియోలు పంపించొచ్చు. వీటిని 2 జీబీ మీడియా ఫైల్స్ వరకు షేర్ చేయొచ్చు. అంతేకాదు నగదు చెల్లింపులు, వీడియా, ఆడియో కాల్స్ చేసుకోవచ్చు. ఇక గ్రూపులలో సభ్యుల సంఖ్య ఎప్పటికప్పుడు రెట్టింపు చేస్తూ వెళ్తోంది. ఈ గ్రూపులను అన్నింటినీ ఒకే వేదికపైకి తెచ్చేలా ఇటీవల కమ్యూనిటీని తీసుకొచ్చింది వాట్సాప్. ఒక్కో కమ్యూనిటీలో 50 గ్రూపుల వరకు యాడ్ చేయొచ్చు. వీటిలో 5 వేల మంది వరకు సభ్యులుగా చేరే వీలుంది.


Tags

Related News

Johnny Master : జానీ మాస్టర్ పై వేటు.. కేసు పెట్టడం పై ఆ హీరో హస్తం ఉందా?

Kalinga Movie: నన్ను పద్దు పద్దు అని పిలుస్తుంటే హ్యాపీగా ఉంది: ‘కళింగ’ మూవీ హీరోయిన్ ప్రగ్యా నయన్

Honeymoon Express: ఓటీటీలోనూ రికార్డులు బ్రేక్ చేస్తున్న ‘హనీమూన్ ఎక్స్‌ప్రెస్’

Best Electric Cars: తక్కువ ధర, అదిరిపోయే రేంజ్- భారత్ లో బెస్ట్ అండ్ చీప్ 7 ఎలక్ట్రిక్ కార్లు ఇవే!

Pod Taxi Service: భలే, ఇండియాలో పాడ్ ట్యాక్సీ పరుగులు.. ముందు ఆ నగరాల్లోనే, దీని ప్రత్యేకతలు ఇవే!

Sitaram Yechury: మరింత విషమంగా సీతారాం ఏచూరి ఆరోగ్యం

Vaginal Ring: మహిళల కోసం కొత్త గర్భనిరోధక పద్ధతి వెజైనల్ రింగ్, దీనిని వాడడం చాలా సులువు

Big Stories

×