EPAPER

Bjp Dilip Ghosh Comments on CM Mamata: మమతా బెనర్జీపై వివాదాస్పద వ్యాఖ్యలు.. ఆమె తండ్రి ఎవరు..?

Bjp Dilip Ghosh Comments on CM Mamata: మమతా బెనర్జీపై వివాదాస్పద వ్యాఖ్యలు.. ఆమె తండ్రి ఎవరు..?
Bjp Dilip Ghosh controvorsial comments on CM Mamata
Bjp Dilip Ghosh controvorsial comments on CM Mamata

Bjp Dilip Ghosh Comments on CM Mamata: నాయకులు స్వతహాగా అప్పుడప్పుడు నోరు జారుతారు. ఎన్నికల సమయంలో మరింత శృతి మించుకుంది. అంతేకాదు వ్యక్తిగత విషయాలను టచ్ చేస్తూ ఎటాక్ చేస్తారు. అదేకోవలోకి వస్తారు పశ్చిమబెంగాల్ బీజేపీ నేత దిలీప్ ఘోష్. తాజాగా సీఎం మమతాబెనర్జీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారాయన. బెంగాల్ కూతురునని చెప్పుకుంటున్న మమత, అసలు ఆమె తండ్రి ఎవరో ముందు నిర్ణయించుకోవాలన్నారు.


బీజేపీ నేత దిలీప్‌ఘోష్ చేసిన కామెంట్స్ సోషల్‌మీడియాలో వైరల్ అయ్యాయి. ఆమె ఒకసారి గోవా వెళ్లి బిడ్డను కంటానంటోందని, మరోసారి త్రిపుర వెళ్లి బిడ్డను కంటానంటోందని దుయ్యబట్టారు. అయితే ఘోష్ వ్యాఖ్యలపై తృణమూల్ కాంగ్రెస్ నేతలు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గతంలో దుర్గామాత, ఇప్పుడు మమతాపై ఘోష్ దిగజారుడు వ్యాఖ్యలు చేశారని దుమ్మెత్తిపోస్తున్నారు. ఈ తరహా వ్యాఖ్యలు ఆయన దివాళా కోరుతనానికి నిదర్శనమన్నారు.

Also read : Varun Gandhi: వరుణ్‌ గాంధీకి కాంగ్రెస్ ఆఫర్.. పార్టీలోకి ఆహ్వానం..!


ఇదిలావుండగా మొన్నటి బెంగాల్ అసెంబ్లీ తృణమూల్ ఉపయోగించిన బెంగాల్ వాంట్స్ టు గో విత్ డాటర్ అనే నినాదం బాగా పాపులర్ అయ్యింది. ఆ ఎన్నికల్లో టీఎంసీ విజయం సాధించడానికి ఇదే కారణమైంది. ఈ క్రమంలో ఘోష్ వ్యాఖ్యలు చేసి ఉండవచ్చని అంటున్నారు. అందరి నేతల మాదిరిగానే తన వ్యాఖ్యలను మీడియా వక్రీకరించిందని అంటారా? తాను అన్నమాటకే కట్టుబడి ఉంటారో చూడాలి. అన్నట్లు ఘోష్ వ్యాఖ్యలపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసే ఆలోచనలో తృణమూల్ కాంగ్రెస్ ఉంది.

 

Related News

Minister Comments: బ్రేకింగ్ న్యూస్.. వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన మంత్రి.. తన కూతురు – అల్లుడిని నదిలో తోసేయండంటూ..

Amit Shah: ఆ విషయంలో.. పాక్‌తో చర్చలు జరిపే ఆలోచనే లేదు: అమిత్ షా

No Doctors For Jails: 5600 మంది ఖైదీలకు ఒక డాక్టర్.. జైళ్లలో నేరస్తుల ఆరోగ్యంపై నిర్లక్ష్యమా?..

Uttar Pradesh Wolf Attacks: యూపీలో తోడేళ్ల విధ్వంసం.. 8 మంది మృతి.. మంత్రి వింత వాదన!

Kolkata Rape Case CBI: కోల్‌కతా రేప్ నిందితుడికి బెయిల్?.. సిబిఐ నిర్లక్ష్యం.. మండిపడిన మమతా పార్టీ!

Jammu and Kashmir Assembly Polls: జమ్మూకాశ్మీర్ బీజేపీ ఎన్నికల మేనిఫెస్టో విడుదల

Mumbai times tower: ముంబై.. మంటల్లో టైమ్స్ టవర్, భారీగా నష్టం

Big Stories

×