EPAPER

Errabelli Dayakar Rao Atrocities: బయటపడ్డ మాజీ మంత్రి ఎర్రబెల్లి దౌర్జన్యాలు, అరాచకాలు..!

Errabelli Dayakar Rao Atrocities: బయటపడ్డ మాజీ మంత్రి ఎర్రబెల్లి దౌర్జన్యాలు, అరాచకాలు..!
Errabelli Dayakar Rao Atrocities
Errabelli Dayakar Rao Atrocities

Errabelli Dayakar Rao Atrocities: కేసీఆర్‌ పాలనలో జరిగిన అరాచకాలు ఒక్కొక్కటిగా బయపడుతున్నాయి. ఇప్పటికే అడ్డగోలుగా వ్యవహరించిన పోలీసుల బండారం బయటపడగా.. ఇప్పుడు మాజీ మంత్రి ఎర్రబెల్లి చేసిన దౌర్జన్యాలు, అరాచకాలు ఇప్పుడు వెలుగులోకి వచ్చాయి.


ఎర్రబెల్లి దయాకర్ రావు ఆదేశాలతో అప్పటి డీసీపీ రాధాకిషన్‌రావు తన ఫ్లాట్‌ను లాక్కోవడమే కాక, తన కుటుంబం నుంచి 50 లక్షలు వసూలు చేశాడంటూ బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు శరణ్ చౌదరి సీఎంం రేవంత్‌రెడ్డికి, డీజీపీకి మెయిల్ చేయడం కలకలం రేపుతోంది.

శరణ్ చౌదరి హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తున్నాడు. గతేడాది ఆగస్టు 21న ఆఫీస్‌ కు వెళ్తుండగా సివిల్ డ్రస్‌లో ఉన్న పోలీసులు వచ్చి బలవంతంగా సీసీఎస్ ఆఫీస్‌కు తీసుకెళ్లారంటూ ఆ మెయిల్‌లో ఆరోపించాడు శరణ్‌. రెండు రోజుల పాటు ఏసీపీ ఉమామహేశ్వరరావు తనను హింసించాడని, తన పేరిట ఉన్న ఫ్లాట్‌ను ఎర్రబెల్లి బంధువు విజయ్ పేరిట రిజిస్ట్రేషన్ చేయాలని ఒత్తిడి చేశారన్నాడు. తాను అంగీకరించనందుకు బూటు కాళ్లతో ఉమామహేశ్వరరావు తన్నాడని, విపరీతంగా కొట్టాడని కంప్లైట్ చేశాడు.


Also Read: KTR Goa Politics: మహబూబ్‌నగర్ బైపోల్.. కేటీఆర్ గోవా పాలిటిక్స్..

చివరకు రిజిస్ట్రేషన్ చేస్తానని ఒప్పుకున్నాకే వదిలి పెట్టారన్నాడు. తనును బంధించిన సమయంలో తన కుటుంబాన్ని బెదిరించి 50 లక్షలు కూడా వసూలు చేశారని ఆరోపించాడు. ఈ మొత్తం వ్యవహారంపై హైకోర్టులో రిట్ పిటిషన్‌ కూడా వేశానని, కానీ తనను బెదిరించి దాన్ని వెనక్కి తీసుకునేలా చేశారన్నాడు. ఇదంతా అప్పటి మంత్రి ఎర్రబెల్లి, డీసీపీ రాధాకిషన్‌రావు ఆదేశాలతోనే జరిగిందని, వారిపై చర్యలు తీసుకోవాలంటూ శరణ్‌ ఫిర్యాదు చేసాడు.

Tags

Related News

Balapur Laddu: 1994లో రూ. 450.. బాలాపూర్ లడ్డు చరిత్ర ఇదే!

New Ration Cards: కొత్త రేషన్ కార్డులకు డేట్ ఫిక్స్.. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలక ప్రకటన

Rajiv Gandhi: ఆ పార్టీ పెద్ద సొంత విగ్రహం పెట్టుకోడానికే ఆ ఖాళీ ప్లేస్.. బీఆర్ఎస్‌పై సీఎం రేవంత్ రెడ్డి ఫైర్

Telangana Liberation Day: విమోచన దినోత్సవంగా నిర్వహిస్తేనే హాజరవుతా: కేంద్రమంత్రి బండి

Rajiv Gandhi Statue: సచివాలయంలోని రాజీవ్ గాంధీ విగ్రహ ప్రత్యేకత ఏమిటీ?

Nursing student death: గచ్చిబౌలి హోటల్‌లో యువతి అనుమానాస్పద మృతి.. రూమంతా రక్తం, హత్యా.. ఆత్మహత్యా?

Harish Rao: హరీశ్ రావు యాక్ష‌న్ షురూ.. కేసీఆర్ శకం క్లోజ్ అయినట్లేనా?

Big Stories

×