EPAPER

Benefits of Lemon Water: బాప్రే.. ఖాళీ కడుపుతో నిమ్మరసం తాగితే ఎన్ని లాభాలో తెలుసా..?

Benefits of Lemon Water: బాప్రే.. ఖాళీ కడుపుతో నిమ్మరసం తాగితే ఎన్ని లాభాలో తెలుసా..?
Benefits Of Lemon Water
Benefits Of Lemon Water

Benefits of Lemon Water on Empty Stomach in the Morning: ఎండాకాలం, వర్షాకాలం, చలికాలం.. ఏ కాలం అనే తేడా లేకుండా దొరికేది నిమ్మకాయ. చాలా మంది బరువు తగ్గాలని అనుకునే వారు వారి నిత్య జీవితంలో తరచూ నిమ్మకాయలను వాడుతుంటారు. నిమ్మకాయల్లో ఉండే విటమిన్ సీ కారణంగా బాడీకి అనేక ఉపయోగాలు ఉంటాయని, చర్మానికి కూడా మేలు కలుగుతుందని ఎక్కువగా నిమ్మకాయలను ఆహారంలో గానీ లేదా ఏదో విధంగా ఉపయోగిస్తుంటారు. ముఖ్యంగా ఎండాకాలం అయితే రోజు నిమ్మరసం తాగడానికి ఇష్టపడుతుంటారు.


నిమ్మరసాన్ని ఎండాకాలం మాత్రమే కాకుండా చాలా మంది ఉదయం పూట తేనే, నిమ్మరసం నీటిని తాగుతుంటారు. ఖాళీ కడుపుతో తరచూ నిమ్మరసంను తీసుకోవడం వల్ల చాలా లాభాలు ఉంటుందట. శరీరాన్ని ఉత్తేజపరిచేందుకు ఉదయం లేవగానే బ్రష్ చేసుకుని నిమ్మరసం తాగడం మంచిదని నిపుణులు చెబుతున్నారు. అంతేకాదు దీని వల్ల చాలా రకాల ప్రయోజనాలు కూడా ఉన్నాయని అంటున్నారు. మరి అవేంటో తెలుసుకుందాం.

1. కాంతివంతమైన చర్మం..


నిమ్మకాయలో విటమిన్ సీ పుష్కలంగా ఉంటుందని అందరికీ తెలుసు. నిమ్మకాయలో ఉండే విటమిన్ సీ చర్మ సౌందర్యాన్ని పెంచడంతో చాలా బాగా ఉపయోగపడుతుంది. నిమ్మకాయలో ఉండే విటమిన్ సీ చర్మ ఆరోగ్యాన్ని పెంచే కొల్లాజెన్ ఉత్పత్తిని మెరుగుపరుస్తుంది. దీంతో చర్మం కాంతివంతంగా, మృదువుగా మారుతుంది.

Also Read: Summer Food to Improves Health and Beauty: వేసవిలో ఇవి తినండి.. అందంతో పాటు ఆరోగ్యం మీ సొంతం!

2. జీర్ణక్రయ మెరుగ్గా..

నిమ్మకాయ నీటిని తీసుకోవడం వల్ల జీర్ణక్రయ ప్రక్రియ అనేది మెరుగుపడుతుంది. నిమ్మకాయలో ఉండే నీరు కడుపులోని యాసిడ్ ఉత్పత్తిని ప్రేరేపించి.. మనం తీసుకునే ఆహారాన్ని పూర్తిగా అరిగేలా చేస్తుంది. నిమ్మకాయలో ఉండే సిట్రిక్ యాసిడ్ మూత్రవిసర్జన కూడా సక్రమంగా జరిగేలా చేస్తుంది.

3.వెయిట్ లాస్..

నిమ్మకాయలో ఉండే సిట్రిక్ యాసిడ్ జీర్ణక్రయను మెరుగుపరిచి బరువు తగ్గేందుకు తోడ్పడేలా చేస్తుంది. అంతేకాకుండా శరీరానికి హానీ చేసే టాక్సికన్లను మరియు శరీర అవసరాని కంటే ఎక్కువగా ఉన్న నీరును చెమట, మూత్రం రూపంలో బయటకు పంపేందుకు తోడ్పడుతుంది. మరోవైపు నిమ్మరసం తాగడం వల్ల చాలా వరకు ఆకలిని తగ్గించుకోవచ్చు. బరువు తగ్గాలనుకునే వారికి నిమ్మరసం ఓ బెస్ట్ ఆప్షన్ అని చెప్పాలి.

4. రోగనిరోధక శక్తి పెంపు..

సాధారణంగా నిమ్మకాయ రోగనిరోధక శక్తిని పెంచే పోషకాలతో నిండి ఉంటుంది. దీని ద్వారా రీరంలోని రోగనిరోధక శక్తిని పెంపొందించేందుకు తోడ్పడుతుంది. తరచూ నిమ్మరసం తాగడం వల్ల అనారోగ్య సమస్యలు, ఇన్‌ఫెక్షన్లు వంటి వాటికి దూరంగా ఉండొచ్చు.

Also Read: Effects of Eating Eggs: కొలస్ట్రాల్ ఉన్నా కోడిగుడ్డు తింటున్నారా..? ఈ సమస్యలు తప్పవు!

చాలా మంది ఆర్థసైటిస్ లాంటి వాటితో బాధపడుతుంటారు. అలాంటి వారికి నిమ్మరసం చాలా అద్భుతంగా పనిచేస్తుంది. నిమ్మకాయలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు ఆక్సీకరణ ఒత్తిడి, వాపు, మంట వంటి సమస్యలను తొలగిస్తుంది. అంతేకాకుండా ఎండ ప్రభావంతో చల్లగా ఉండే కూల్ డ్రింక్స్ తాగడం కంటే నిమ్మరసం తాగడం ఆరోగ్యానికి చాలా మంచిది. శరీరాన్ని హైడ్రేటెడ్ గా ఉంచుతుంది.

Tags

Related News

Hair Care Tips: జుట్టు సమస్యలన్నింటికీ చెక్ పెట్టండిలా !

Tips For Skin Glow: క్షణాల్లోనే మీ ముఖాన్ని అందంగా మార్చే టిప్స్ !

Yoga For Stress Release: ఒత్తిడి తగ్గేందుకు ఈ యోగాసనాలు చేయండి

Throat Infection: గొంతు నొప్పిని ఈజీగా తగ్గించే డ్రింక్స్ ఇవే..

Skin Care Tips: గ్లోయింగ్ స్కిన్ కోసం.. ఇంట్లోనే ఈ ఫేస్ ప్యాక్స్ ట్రై చేయండి

Sweets: స్వీట్లు ఇష్టపడేవారు ఈ సమయంలో తింటే అన్నీ సమస్యలే..!

Coffee For Glowing Skin: కాఫీ పౌడర్‌లో ఇవి కలిపి ఫేస్‌ప్యాక్ వేస్తే.. మీ ముఖం మెరిసిపోవడం ఖాయం

Big Stories

×