EPAPER

Holika Dahan 2024: హోలీకా దహనం.. ఇలా చేస్తే ఇంట్లో ప్రతికూలతలు దూరం!

Holika Dahan 2024: హోలీకా దహనం.. ఇలా చేస్తే ఇంట్లో ప్రతికూలతలు దూరం!
Holika Dahan 2024
Holika Dahan 2024

Do like this with Ashes of Holika Dahan: హిందూ మతంలో హోలీకి చాలా ప్రాధాన్యత ఉంది. ఈ పండుగను దేశంలోని ప్రతి ప్రాంతంలో ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటారు. ప్రజలు ఒకరిపైఒకరు రంగులు చల్లుకుంటారు. హోలీకా దహనం పండుగ హోలీకి ఒక రోజు ముందు జరుపుతారు. ఈ రోజు ప్రత్యేక పూజలు చేస్తారు. ఈ ఏడాది హోలికా దహనంను మార్చి 24న ఆదివారం నిర్వహిస్తారు.


హోలికా దహనం కోసం చతురస్రాకారంలో ఆవు పేడ పిడకలు తయారు చేస్తారు. వాటిని పేర్చి చుట్టూ  చెక్కలు, కర్రలు అమర్చి హోలీ దహనం చేస్తారు. స్త్రీలు ప్రదక్షిణలు చేసి పూజిస్తారు. రాత్రి శుభ సమయంలో హోలికను వెలిగిస్తారు. అయితే ఆ బూడిద మీ తలరాతను మార్చగలదని తెలుసా?

హోలికా దహనం బూడిదతో ఈ పరిహారాలు చేయండి..
హోలికా దహనం మరుసటి రోజు ఇంటిని ఊడ్చి చెత్తను తీసి హోలికా దహనంలో వేయండి. అక్కడ నుంచి బూడిదను తీసుకురావాలి. ఆ బూడిదను ఇంట్లో చల్లుకోండి. దీంతో ఇంట్లో ఉండే ప్రతికూలతలు తొలగిపోతాయి. కుటుంబంలో ప్రేమ పెరుగుతుందని అంటారు. వాస్తు దోషాలు కూడా తొలగిపోతాయనే నమ్మకం.


Also Read: 100 ఏళ్ల తర్వాత హోలీ రోజున చంద్ర గ్రహణం.. ఈ రాశుల వారు బీ కేర్‌ఫుల్..!

సంపద పొందాలనుకుంటే హోలికా దహనం బూడిదను ఇంటికి తీసుకురండి. తర్వాత 7 రంధ్రాలు ఉన్న నాణేన్ని, హోలికా దహనం బూడిదను ఎరుపు రంగు వస్త్రంలో కట్టి భద్రంగా ఉంచండి. ఇలా చేయడం ద్వారా ఆర్థిక సంక్షోభం పరిష్కారం అవుతుంది. డబ్బు సంపాదించడానికి కొత్త మార్గాలు తెరవబడతాయి.

జీవితంలో సమస్యలను ఎదుర్కొంటున్నట్లయితే హోలికా దహనం బూడిదను తీసుకుని అందులో ఉప్పు, ఆవాలు కలపండి. తర్వాత ఇంట్లో రహస్య ప్రదేశంలో ఉంచాలి. ఇలా చేయడం వల్ల ఇంట్లో ఉన్న ప్రతికూలతలు తొలగిపోతాయి. సానుకూల వాతావరణం ఏర్పడుతుంది. కుటుంబ సభ్యుల మధ్య ప్రేమ పెరుగుతుంది.

హోలీ దహనం బూడిదను నుదుటిపై రాసుకుంటే ఆరోగ్యం బాగుంటుదని అంటారు. ఆరోగ్య సంబంధిత సమస్యలు ఉంటే ఆ బూడిదను ప్రతిరోజూ నుదుటిపై రాసుకోవాలి. ఈ బూడిద ఆవు పేడతో తయారు చేస్తారు. అందుకే చాలా ప్రయోజనకరంగా పరిగణిస్తారు.

Also Read: Yadadri Swarnagiri Temple: 22 ఎకరాల్లో యాదాద్రి తిరుమల.. స్వర్ణగిరి దేవాలయ విశేషాలు మీకోసం!

వ్యాపార రంగంలో పురోగతిని సాధించాలంటే హోలికా దహనం బూడిదను తెచ్చి ఒక కట్టలో కట్టండి. అప్పుడు వ్యాపారం సమూదాయం ప్రధాన  ద్వారం వద్ద ఈ కట్టను కట్టండి. ఇది చెడు కన్ను నుంచి మిమ్మల్ని కాపాడుతుంది. వ్యాపారం పురోగతిలో ఉంటుంది.

గమనిక: ఇక్కడ ఇచ్చిన సమాచారం సామాజిక, మత విశ్వాసాలపై ఆధారపడి ఉంటుంది. bigtvlive.com దీనిని ధృవీకరించలేదు. దీని కోసం నిపుణుల సలహా తీసుకోండి.

Tags

Related News

Navratri 2024: నవరాత్రుల్లో 9 రోజులు ఇలా చేస్తే భవాని మాత అన్ని సమస్యలను తొలగిస్తుంది

Pitru Paksha 2024: పితృపక్షంలో ఈ పరిహారాలు చేస్తే మీ పూర్వికులు సంతోషిస్తారు.

Trigrahi yog September 2024 Rashifal: ఒక్క వారంలో ఈ 6 రాశుల జీవితాలు మారబోతున్నాయి..

Auspicious Dream: కలలో ఈ పువ్వు కనపిస్తే ధనవంతులు అవవుతారట.. మీకు కనిపించిందా మరి

Sun Transit 2024: సూర్యుడి సంచారం.. వీరికి ఆకస్మిక ధనలాభం

Khairatabad Ganesh: ఖైరతాబాద్ వినాయకుడు ఎందుకంత ప్రత్యేకం? 70 ఏళ్ల కిందట.. ఒక్క ‘అడుగు’తో మొదలైన సాంప్రదాయం

Sun Transit 2024: సూర్యుని సంచారంతో ఈ నెలలో ఏ రాశి వారికి లాభమో, ఎవరికి నష్టమో తెలుసా ?

Big Stories

×