EPAPER

Crying Rooms in America: ఏడ్చేవాళ్ల కోసం ప్రత్యేక పార్లర్.. ఎక్కడుందో తెలుసా..?

Crying Rooms in America: ఏడ్చేవాళ్ల కోసం ప్రత్యేక పార్లర్.. ఎక్కడుందో తెలుసా..?

A Separate Parlor For Those Who Cry


A Separate Parlor For Those Who Cry: మనిషి జీవితంలో ఎన్నోరకాల ఎమోషన్స్ ఉంటాయి. నవ్వు, ఏడుపు, టెన్షన్స్ లాంటి కామన్ థింక్స్ మన లైఫ్ లో సహజంగా ఉంటాయి. మనిషి జీవితంలో ఒక్కోసారి ఆనందం వచ్చినప్పుడు సంతోషంగా నవ్వడం మొదలు పెడతారు. కొన్ని సార్లు దుఃఖం వచ్చినప్పుడు మనుషలు బాధపడుతూ ఒంటరిగా గడిపేస్తుంటారు. అలాంటి సమయంలో కళ్లల్లో  నీళ్లు రావడం సహజం. కాకపోతే చాలా మంది బాధపడుతున్నప్పుడు ఎవరికి తెలియకుండా లోలోపలే ఒంటరిగా కృంగిపోతుంటారు. అయతే అలాంటి వారి కోసం క్రైయింగ్ రూమ్స్ తీసుకొచ్చాడు ఓ వ్యక్తి. ఏడ్చేవాళ్లకోసం ప్రత్యేకంగా పార్లర్ క్రియేట్ చేసి.. జనాలు కావాలంటే ఇక్కడికి వచ్చి కన్నీళ్లు పెట్టుకొని తమ కోపాన్ని వెళ్లగక్కవచ్చు.

ఇందుకు సంబంధింతచిన పార్లర్ అమెరికాలోని న్యూయార్క్ నగరంలో ప్రారంభించారు. ఈ పార్లర్ పేరు సోబ్ పార్లర్. ఈ పార్లల్ లో ఓ ప్రైవేట్ క్రై రూమ్ తయారు చేసారు. ఇక్కడ వచ్చి ఎవరైతే బాధలో ఉన్నారో వారు ఎంత సమయం కావాలంటే అంత సమయం ఏడవటానికి సౌకర్యం కల్పించారు. దీంతో వారి మనసు తేలిక పడతుంది అని చెబుతున్నారు అక్కడ నిర్వాహకులు. ఈ ప్రత్యేక పార్లర్ ను గత ఏడాది ఆంథోని విలోట్టి ప్రవేశపెట్టాడు.


ప్రస్తుతం చాలా మంది ఒత్తిడి సమస్యతో బాధుపడుతున్నారని, కొందరు వ్యక్తులు ఇంట్లో సమస్యలతో ఒత్తిడికి గురవుతుంటారు. మరి కొందరు అయితే ఆఫీస్ ఒత్తిడితో బాధపడుతుంటారు. కొంత మంది విద్యార్దులు చదువు ఒత్తిడితో బాధుడపతున్నారు. అలాంటి సమయాలలో బాగా ఏడవాలనిపిస్తుంటుంది. మనసుపూర్తిగా ఓడవడం వల్ల ఒత్తిడి నుంచి ఉపశమనం లభిస్తుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. చాలా మంది కుటుంబ బాద్యతలు, ఇంకా కొన్ని కారణాల వల్ల ఒత్తిడికి లోనవుతున్నారు.

Also Read: కొలస్ట్రాల్ ఉన్నా కోడిగుడ్డు తింటున్నారా?.. ఈ సమస్యలు తప్పవు

అలా ఎన్నో సమస్యలతో సతమవుతున్నారని చెప్పుకొచ్చారు. అలాంటి వారు ఎక్కువగా క్రైయింగ్ రూమ్స్ కి రావడానికి ఇష్టడుతున్నారు. అక్కడికి వచ్చే వారంతా తమలాంటి వాళ్ళు వస్తుండడంతో ఒకరి బాధలు ఒకరు తెలుసుకొని రిలీఫ్ అవుతున్నారు. ఈ పార్లర్ లోని క్రై రూమ్స్ లలో కన్నీటి ఆకారంలో ఉన్న అద్దాలు, కన్నీళ్లు తెప్పించే దిండ్లు కనిపిస్తాయి. అంతే కాదు అక్కడ భావోధ్వేగపు పాటలు కూడా వినవచ్చు. ఇక్కడికి వచ్చిన వారు 10 నిమిషాలు ఏడ్చిన తర్వాతే వారికి ఓదార్పు లభిస్తుంది. మరికొంతమందికి కొంత సమయం పడుతుందని ఆంథోని చెబుతున్నారు. ఇప్పుడు ఆ పార్లర్ కు చాలా మంది వస్తుండడంతో పెద్ద చర్చనీయాంశంగా మారింది.

Tags

Related News

Health Tips: నీరు సరిపడా త్రాగకపోతే ఎంత ప్రమాదమో తెలుసా ?

Urine: మూత్రం ఆ రంగులో వస్తుందా? ప్రాణాలు పోతాయ్ జాగ్రత్త!

Viagra Sales: వయాగ్రా.. తెగ వాడేస్తున్నారు, ఇండియాలో భారీగా పెరిగిన సేల్స్.. గణంకాలు చూస్తే షాకవుతారు..

Moringa Powder: మునగ ఆకు పొడితో అద్భుతాలు..ఈ రోగాలన్నీ పరార్ !

Olive Oil: రోజూ అర స్పూన్ ఆలివ్ ఆయిల్ తాగితే.. ఆ ప్రాణాంతక వ్యాధి పరార్

Multani Mitti: ముల్తానీ మిట్టితో క్షణాల్లోనే.. గ్లోయింగ్ స్కిన్

Relationships: మీరు మీ జీవిత భాగస్వామితో మాట్లాడకూడని కొన్ని విషయాలు ఇవిగో, వీటిని మాట్లాడితే బంధానికి బీటలే

Big Stories

×