EPAPER

CM Arvind Kejriwal Arrest: అపుడు అవినీతిపై పోరాటం.. ఇపుడు అందులో అరెస్ట్ అయిన.. అరవింద్ కేజ్రీవాల్.. ఎలా జరిగింది..?

CM Arvind Kejriwal Arrest: అపుడు అవినీతిపై పోరాటం.. ఇపుడు అందులో అరెస్ట్ అయిన.. అరవింద్ కేజ్రీవాల్.. ఎలా జరిగింది..?
Anti Corruption Crusader To Liquor Scam Accused cm kejriwal
Anti Corruption Crusader To Liquor Scam Accused cm kejriwal

Anti Corruption Crusader to Liquor Scam Accused CM Kejriwal: అవినీతిపై పోరాటం అనే పేరు చెప్పగానే ముందుగా గుర్తుకొచ్చేది అరవింద్ కేజ్రీవాల్. ఆ అంశంపై అలుపెరగని పోరాటం చేశారాయన. అవినీతిపై పోరాటం కాన్సెఫ్ట్ ని తనకు అనుకూలంగా మలుచుకున్నారు, ఉవ్వెత్తున కెరటంలా ఎగిరారు. ఇలాంటి నాయకుడు దేశానికి కావాలని కీర్తించినవాళ్లూ లేకపోలేదు. ఆ అంశమే ఆమ్ ఆద్మీపార్టీకి రాజకీయ పునాదులకు బీజం వేసింది. వెంటనే రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వడం, ముఖ్యమంత్రి కావడం చకచకా జరిగిపోయింది ఇదంతా నాణెనికి ఒకవైపు మాత్రమే. రెండోవైపు వస్తే దాదాపు దశాబ్దం తర్వాత లిక్కర్ కేసులో కేజ్రీవాల్ జైలుకి వెళ్లడం కూడా జరిగిపోయింది.


తొలుత ఐఐటీ విద్యార్థిగా, తర్వాత ఇండియన్ రెవెన్యూ అధికారిగా జీవితం ప్రారంభించారు అరవింద్ కేజ్రీవాల్. రెండు దశాబ్దాల కిందట సామాజిక కార్యకర్తగా జీవితం ప్రారంభించారు. ఐఆర్ఎస్ ఉద్యోగం నుంచి లాంగ్ లీవ్ తీసుకుని ప్రయోగాలు మొదలుపెట్టారు. ఓ సంస్థను స్థాపించి దానికి పరివర్తన్ అనే పేరు పెట్టారు. సహచరులతో కలిసి సొసైటీలో మార్పులు తీసుకురావాలని నిర్ణయించారు. అలాగే దూకుడుగా దూసుకుపోయారు. అక్కడి నుంచి వెనుదిరగలేదు.. ప్రజల అంశాలపై ఫోకస్ పెట్టారు. 2006లో ఎమర్జింగ్ లీడర్ షిప్ విభాగంలో ఆయనకు రామన్ మెగసెసె అవార్డు వరించింది. దీనికితోడు సమాచార హక్కు కోసం ఉద్యమంలో చురుకైన పాత్ర పోషించారు. 2010 ఢిల్లీలో జరిగిన కామన్వెల్త్ క్రీడల్లో భారీ కుంభకోణం వార్తల నేపథ్యంలో అవినీతిపై ఉద్యమాలు మొదలుపెట్టారు. సభలు, సమావేశాలతో దేశ ప్రజలను ఆకట్టుకున్నారు.

సరిగ్గా అదే సమయంలో యూపీఏ ప్రభుత్వం అవినీతిపై కధం తొక్కారు. 2011 ఏడాది ఢిల్లీ వేదికగా జంతర్ మంతర్ వద్ద అవినీతికి వ్యతిరేకంగా జన లోక్ పాల్ డిమాండ్ చేస్తూ గాంధేయవాది, సామాజిక కార్యకర్త అన్నాహజారే ధర్నాకు దిగారు. అప్పుడు అన్నాహజారే వెనుక కేజ్రీవాల్ దర్శనమిచ్చారు. ఆ సభలో కేజ్రీవాల్ స్పీచ్ యూత్ ని బాగా ఆకట్టుకుంది. ఒక్కమాటలో చెప్పాలంటే అవినీతి ఉద్యమానికి కేజ్రీవాల్ అర్కిటెక్ట్ అయ్యారు. కేజ్రీవాల్ వేదికపైకి రాగానే నేతల అవినీతి చిట్టాను విప్పేవారు. అప్పుడు ఆయా వ్యవస్థలతో విసిగిపోయిన లక్షలాది యువత ఆయనతో జత కలిశారు. 2012 జులైలో ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద అవినీతిపై పెద్ద ఎత్తున ధర్నా జరిగినప్పుడు టోపీ కూడా ధరించారు. అప్పుడు కేజ్రీవాల్ అన్నమాటలు ప్రజలను విపరీతంగా ఆకట్టుకుంది.


Also Read: Kavitha EC Custody : నేటితో ముగియనున్న కవిత కస్టడీ.. మరో మూడురోజులు పొడిగిస్తారా ?

ఏ రోజు దేశ ప్రజలు మేలుకుని రోడ్లపైకి వస్తారో.. అప్పుడు ఎంత ప్రభుత్వానయినా తలకిందలు చేస్తారని చెప్పుకొచ్చారు కేజ్రీవాల్. నిరాహార దీక్ష చేస్తున్న కేజ్రీవాల్ కు అన్నాహజారే మద్దతు ఇచ్చారు. దీంతో ఎక్కడ చూసినా కేజ్రీవాల్ పేరు మార్మోగిపోయింది. ఇలాంటి నేత రాజకీయాల్లోకి వస్తే అవినీతి పోతుందని భావించారు. చివరకు ఆ అవినీతి ఉచ్చులో చిక్కుకున్నారు. నాడు.. ఆహో.. ఓహో అన్నవాళ్లే ఇవాళ ఛీదరించుకుంటున్నారు. ఇలా రకరకాలుగా ఉద్యమాన్ని ఢిల్లీ వేదికగా చేసుకుని దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు.

తొలుత రాజకీయాల్లోకి రానని చెప్పే కేజ్రీవాల్, చివరకు అదే ఏడాది నవంబర్ 26న పార్టీ ఏర్పాటు చేస్తున్నట్లు అధికారికంగా స్టేట్ మెంట్ ఇచ్చేశారు. ఆయన ఆశ, శ్వాస అంటూ అవినీతిపైనే ఉండేది. అందుకే అవినీతి ఊడ్చిలా పార్టీ గుర్తు చీపురు పెట్టుకున్నారు. మరుసటి ఏడాది అంటే 2013లో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన ఆమ్ ఆద్మీపార్టీ 28 సీట్లను గెలుచుకుంది. అవినీతి విషయంలో ఏ పార్టీ మీదైతే ఉద్యమం ప్రారంభించారో.. అదే పార్టీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. సీఎంగా అయిన తర్వాత అవినీతి అధికారులు.. కేజ్రీవాల్ పేరు వింటే వణికిపోయేవారు. జనలోక్ పాల్ బిల్లు తేవాలని చాలా ప్రయత్నాలు చేశారు. అందుకు సంకీర్ణ భాగస్వామి కాంగ్రెస్ పార్టీ అంగీకరించలేకపోవడంతో సీఎం పదవికి రాజీనామా చేశారు.

మళ్లీ ఎన్నికలకు వెళ్లి పార్టీని గెలిపించి మళ్లీ ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టారు అరవింద్ కేజ్రీవాల్. తాను నిజాయితీ పరుడని అంటూ తరచూ సర్టిఫికెట్ ఇచ్చుకునేవారు. చివరకు మూడోసారి సీఎం కుర్చీ ఎక్కిందుకు దోహదపడింది. మూడోసారి ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టిన తర్వాత లిక్కర్ పాలసీ ఆప్ ప్రభుత్వాన్ని చుట్టిమట్టేసింది. ఎంతగా అంటే ఓ ఎంపీ, డిప్యూటీ సీఎం, చివరకు ముఖ్యమంత్రి కూడా అవినీతి మరక ఉచ్చులో చిక్కుకున్నారు. ఏ అవినీతిపై పోరాటం చేశారో.. అదే ఇష్యూ ఆయన్ని జైలుకి పంపింది.

Tags

Related News

Nipah virus: కేరళలో నిఫా వైరస్ విజృంభణ.. స్టూడెంట్ మృతి.. రాష్ట్రంలో ఆంక్షలు!

PM Modi: ఇది ట్రైలర్ మాత్రమే.. ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు నాయుడు భేటీ

yashwant Sinha: వాజ్ పేయి సిద్ధాంతాలతో.. పార్టీ పేరు ప్రకటించిన యశ్వంత్ సిన్హా

Delhi: ఢిల్లీకి తదుపరి సీఎం ఎవరు? రేసులో ఆరుగురు పేర్లు.. వీళ్లేనా?

Rajasthan Road Accident: రాజస్థాన్‌లో ట్రక్కును ఢీకొట్టిన తుఫాను.. ఎనిమిది మంది దుర్మరణం

Jammu Kashmir: గాంధీ, నెల్సన్ మండేలాతో బీజేపీ పోల్చుతున్న ఈ బుఖారీ ఎవరు?

PM Narendra Modi: మరో 6 వందే భారత్ రైళ్లు.. వర్చువల్‌గా ప్రారంభించిన ప్రధాని మోదీ

Big Stories

×