EPAPER

CSK CEO Kasi Viswanathan: ధోనీ ఎప్పుడూ ఇంతే.. సీఎస్కే సీఈవో..!

CSK CEO Kasi Viswanathan: ధోనీ ఎప్పుడూ ఇంతే.. సీఎస్కే సీఈవో..!

CSK CEO on Dhoni


CSK CEO Kasi Viswanathan on Dhoni: మహేంద్రసింగ్ ధోనీ ఏం చేసినా సడన్ గా చెబుతాడు. అప్పటికప్పుడు నిర్ణయాలు తీసుకుంటాడని అంటారు. కానీ అది కరెక్ట్ కాదు. ప్రస్తుత కెప్టెన్సీ మార్పుపై తనెప్పుడో ఒక ట్వీట్ చేశాడు. మీకొక మంచి వార్త చెబుతానని అన్నాడు. కాకపోతే ఏ మ్యాచ్ లోనైనా విజయం కోసం ఆఖరి బాల్ వరకు ఎదురుచూడటం ధోనీ అలవాటు. అదే పని ఇప్పుడు కెప్టెన్ మార్పు విషయంలో కూడా చేశాడు. ఐపీఎల్ ముందురోజు…కెప్టెన్లు అందరినీ ఫొటో షూట్ కి పిలిచే వేళ, అసలు విషయం చెప్పాడు.

ఈ విషయంపై చెన్నయ్ సూపర్ కింగ్స్ సీఈవో కాశీ విశ్వనాథ్ కొన్ని ఆసక్తికరమైన విషయాలు చెప్పాడు. అదేమిటంటే ధోనీ తమకు కూడా ఈ రోజే నిర్ణయం చెప్పాడని అన్నాడు. మేం ఎప్పుడు ధోనీ నిర్ణయాన్ని వ్యతిరేకించమని, గౌరవిస్తామని అన్నాడు. తనేం చెబితే, అదే ఫైనల్ అన్నాడు.


రుతురాజ్ గైక్వాడ్ కెప్టెన్ అన్నప్పుడు ఆశ్చర్యం వేసిందని అన్నాడు. కాకపోతే గడచిన మూడు సీజన్ల నుంచి జట్టులో టాపర్ తనేనని, అందుకే తనపై ధోనీ బాధ్యతలు పెట్టాడని అన్నాడు. నిజానికి రెండేళ్ల క్రితమే సీఎస్కే బాధ్యతలను రవీంద్ర జడేజాకి అప్పగించారు. కానీ అది సక్సెస్ కాలేదు. ఇప్పుడవుతుంది అని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

Also Read: ధోనీ చెప్పే కొత్త కబురు ఇదేనా..? రుతురాజ్ గురించి ముందే తెలుసా..?

ఆ సమయంలో రవీంద్ర జడేజా కెప్టెన్సీ బాధ్యతలు తట్టుకోలేక పోయాడు. సీఎస్కే దారుణ ప్రదర్శన చేసింది. అయితే మధ్యలోనే మళ్లీ ధోనీకి పగ్గాలు అప్పగించారు. దాంతో రవీంద్ర జడేజా గాయం పేరు చెప్పి వెళ్లిపోయాడు. తర్వాత ఐపీఎల్ 2023 సీజన్ లో ధోనీ సారథ్యంలో ఆడి మ్యాచ్ విన్నర్ గా మారాడు. ముఖ్యమైన ఫైనల్ లో ఒంటి చేత్తో చెన్నైని గెలిపించాడు.

Related News

Vinesh Phogat Bajrang Punia: ‘వినేశ్ ఫోగట్ చీటింగ్ చేసి ఒలింపిక్స్‌కు వెళ్లింది’.. బిజేపీ నాయకుడి వివాదాస్పద వ్యాఖ్యలు

Duleep Trophy 2024: మళ్లీ ముంబై బ్యాటర్ వచ్చాడు.. అదరగొట్టిన ముషీర్ ఖాన్..181

Paralympics Hokato Hotozhe: పారాలింపిక్స్ లో భారత్ పతకాల సంఖ్య 27!.. హై జంప్ లో గోల్డ్, షాట్ పుట్ లో కాంస్యం!

Wrestlers: బ్రేకింగ్ న్యూస్.. కాంగ్రెస్ పార్టీలో చేరిన రెజ్లర్లు వినేష్ ఫొగట్, బజరంగ్ పునియా

US Open 2024: యూఎస్ ఓపెన్..నెంబర్ వన్ ర్యాంకర్ ఓటమి

Duleep Trophy 2024: ముషీర్ ఖాన్ సెంచరీ.. అక్షర్ పటేల్ అదుర్స్

Rishabh Pant: అంతర్జాతీయ క్రికెట్ లో ఒత్తిడి తప్పదు: రిషబ్ పంత్

Big Stories

×