EPAPER

Kafal Fruit Benefits : ప్రధాని మోదీకి ఇష్టమైన కఫాల్ ఫ్రూట్‌.. దీని స్పెషల్ ఎంటో తెలుసా!

Kafal Fruit Benefits : ప్రధాని మోదీకి ఇష్టమైన కఫాల్ ఫ్రూట్‌.. దీని స్పెషల్ ఎంటో తెలుసా!
Kafal Fruit Benefits
Kafal Fruit Benefits

Kafal Fruit Benefits : కఫాల్ ఫ్రూట్.. ఇది మీకు వినడానికి కొత్తగా ఉన్నా ఇది రుచికరమైన పండు. ప్రధాని నరేంద్ర మోదీకి ఈ పండంటే అమితమైన ఇష్టం. ఈ కఫాల్ ఫ్రూట్ భారత్‌తో పాటుగా శ్రీలంక, నేపాల్‌లోని హిమాలయ ప్రాంతాల్లో పండిస్తారు. ఇది సుమారు 1500-2000 మీటర్ల ఎత్తులో పెరుగుతుంది. ఈ పండు చూడటానికి చిన్నగా, గుండ్రంగా, ఎరుపు రంగులో ఉంటుంది. ఇది సీజనల్ ఫ్రూట్. జూన్ నుంచి సెప్టెంబర్ నెలలో మాత్రమే ఈ పండు లభ్యమవుతుంది. ఈ పండు అనేక రకాల పోషకాలతో నిండి ఉంటుంది. ఈ పండు తినడం వల్ల ఎటువంటి ప్రయోజనాలు ఉంటాయో తెలుసుకుందాం.


కఫాల్ ఫ్రూట్ లక్షణాలు

  • ఇది చిన్నగా, గుండ్రంగా ఎరుపు రంగులో ఉంటుంది.
  • ఒకే విత్తనంతో లోపల గుజ్జు కలిగి ఉంటుంది.
  • ఇది ముధురమైన రుచిని ఇస్తుంది.
  • ఇది సీజనల్ ఫ్రూట్.
  • జూన్ నుంచి సెప్టెంబర్ నెలలోనే అందుబాటులో ఉంటుంది.

Also Read : ఇడ్లీ తింటున్నారా?.. ఈ షాకింగ్ న్యూస్ తెలుసుకోండి!


చర్మం, జుట్టు ఆరోగ్యం

కఫాల్ ఫ్రూట్‌లో అనేక రకాలైన పోషకాలు ఉంటాయి. ఇది తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో ఉండే పోషకాలు చర్మం, జుట్టు ఆరోగ్యానికి మేలు చేస్తాయి. వీటిని తరచూ తింటే జుట్టు బలంగా, దృఢంగా తయారవుతుంది. అంతేకాకుండా చర్మం కూల్‌గా, హైడ్రేట్‌గా ఉంటుంది. ఇది సీజనల్ ఫ్రూట్ కాబట్టి కచ్చితంగా ఆ సమయంలో వదలకండి.

రక్తపోటు – షుగర్ వ్యాధి

కఫాల్ ఫ్రూట్ షుగర్ పేషెంట్లకు ఎంతో మంచిది. ఇది షుగర్‌ను కంట్రోల్ చేస్తుంది. షుగర్ వ్యాధిగ్రస్తులు ఈ పండ్లను ఎక్కువగా తీసుకోండి. అంతేకాకుండా ఇందులోని పోషకాలు బీపీని అదుపు చేస్తాయి. ఈ ఫ్రూట్ తినడం వల్ల ఆరోగ్యంగా ఉంటారు.

చెవి – పంటి నొప్పులు

కఫాల్ ఫ్రూట్ సీజన్‌లో మాత్రమే లభ్యమవుతుంది. కాబట్టి ఈ ఫ్రూట్ తినడం వల్ల చెవి, పంటి నొప్పుల నుంచి ఉపశమయనం లభిస్తుంది. ఈ నొప్పులతో బాధపడేవారు ఈ పండును తినండి. అలానే ఆస్తమా ఉన్నవారు కూడా ఈ ఫ్రూట్ తీసుకోండి. దీని ద్వారా రిలిఫ్ పొందుతారు.

దగ్గు – అల్సర్స్

కఫాల్ ఫ్రూట్‌లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. అందువల్ల ఇది శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుతుంది. దీని వల్ల దగ్గు, అల్సర్స్, ఫీవర్, రక్త హీనత సమస్యలు రావు. ఒకవేళ వచ్చినా కూడా త్వరగా నయం అవుతాయి.

జీర్ణక్రియ

కఫాల్ ఫ్రూట్ జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తుంది. ఈ పండును గ్యాస్, మలబద్దకం ఉన్నవారు తీసుకోడం వల్ల ఉపశమనం లభిస్తుంది.

Also Read : ఛార్జర్‌కు టేప్ వేసి వాడుతున్నారా..?

గుండె పనితీరు

కఫాల్ ఫ్రూట్ చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. అలానే మంచి కొలెస్ట్రాల్ ‌నుంచి పెంచుతుంది. ఈ ఫ్రూట్‌లో
మెగ్నీషియం, కాల్షియం నిండుగా ఉంటాయి.

Disclaimer: ఈ కథనాన్ని వైద్య నిపుణుల సలహా మేరకు, ఇంటర్నెట్‌లోని సమాచారం ఆధారంగా రూపొందించాం. దీనిని అవగాహనగా మాత్రమే భావించండి.

Tags

Related News

Hair Care Tips: జుట్టు సమస్యలన్నింటికీ చెక్ పెట్టండిలా !

Tips For Skin Glow: క్షణాల్లోనే మీ ముఖాన్ని అందంగా మార్చే టిప్స్ !

Yoga For Stress Release: ఒత్తిడి తగ్గేందుకు ఈ యోగాసనాలు చేయండి

Throat Infection: గొంతు నొప్పిని ఈజీగా తగ్గించే డ్రింక్స్ ఇవే..

Skin Care Tips: గ్లోయింగ్ స్కిన్ కోసం.. ఇంట్లోనే ఈ ఫేస్ ప్యాక్స్ ట్రై చేయండి

Sweets: స్వీట్లు ఇష్టపడేవారు ఈ సమయంలో తింటే అన్నీ సమస్యలే..!

Coffee For Glowing Skin: కాఫీ పౌడర్‌లో ఇవి కలిపి ఫేస్‌ప్యాక్ వేస్తే.. మీ ముఖం మెరిసిపోవడం ఖాయం

Big Stories

×