EPAPER

Cloves : లవంగం తెచ్చే అదృష్టం

Cloves : లవంగం తెచ్చే అదృష్టం

Cloves : లవంగం వంటగది మసాలా, దినుసు. సాధారణ భారతీయ వంటలలో ఉపయోగించే ఒక అద్భుతమైన మసాలా. అంతే కాకుండా, ఈ సాధారణ మసాలా దాని శక్తివంతమైన ఆరోగ్య ప్రయోజనాల కోసం అనేక మందులు, దంత , జుట్టు సంరక్షణ ఉత్పత్తులలో ఉపయోగిస్తారు.


లవంగం సాంప్రదాయకంగా అనేక ఆచారాలలో, పండుగలలో ఉపయోగిస్తారు. లవంగంతో దిష్టి దుష్ప్రభావాల నుంచి బయటపడవచ్చు. అంతేకాకుండా సానుకూల ప్రకాశాన్ని పెంచుతుందని విశ్వాసం. నవరాత్రులలో దుర్గాదేవికి ఒక జత లవంగాలను నైవేద్యంగా పెడితే జీవితంలో సంతోషం, విజయాలు లభిస్తాయని నమ్ముతారు.

వంటగది మసాలాను ఉపయోగించడం ద్వారా మీ జీవితంలో సానుకూల శక్తిని ఆకర్షించవచ్చు. ఏదైనా ఒక ముఖ్యమైన పని మీద చర్చకు కూర్చున్నప్పుడు గానీ పెద్ద వ్యాపార ఒప్పందాన్ని చేసుకుంటున్నప్పుడు లేదా ఏదైనా మంచి పనికి వెళుతున్నప్పుడు లవంగాన్ని నమలడం విజయం, శ్రేయస్సును కలిగిస్తుందట.


స్వగృహం నుంచి బయలుదేరే ముందు మీ నోటిలో రెండు లవంగాల గింజలను ఉంచుకోవడం వల్ల రోజువారీ జీవితంలో అన్ని అడ్డంకులు తొలగిపోతాయని నమ్ముతారు. అంతేకాదు లక్ష్మీ దేవిని పూజించేటప్పుడు, ప్రతిరోజూ ఎర్ర గులాబీలు, రెండు లవంగాల కాయలను నైవేద్యంగా సమర్పించడం ద్వారా అదృష్టం, డబ్బును ఆకర్షించవచ్చు. ప్రతిరోజూ దీనిని పాటించడం సాధ్యం కానట్లయితే, ఆర్థిక ఆనందం కోసం ప్రతి శుక్రవారం దీన్ని చేయవచ్చు.

Related News

Horoscope 8 September 2024: నేటి రాశి ఫలాలు.. ఈ రాశి వారికి పండగే.. పట్టిందల్లా బంగారమే!

Ganesh Chaturthi 2024: అప్పుల బాధ తొలగిపోవాలంటే.. గణపతిని ఇలా పూజించండి

Lucky Zodiac Signs: సెప్టెంబర్ 18 నుంచి వీరికి డబ్బే.. డబ్బు

Horoscope 7 September 2024: నేటి రాశి ఫలాలు.. గణపతిని పూజిస్తే విఘ్నాలు తొలగిపోతాయి!

Ganesh Chaturthi: గణేష్ చతుర్థి నాడు ఇలా చేస్తే దురదృష్టం దూరం అవుతుంది..

Trigrahi Rajyog Horoscope: మిథున రాశి వారిపై త్రిగ్రాహి యోగంతో ఊహించని మార్పులు జరగబోతున్నాయి

Ganesh Chaturthi 2024: వినాయక చవితి స్పెషల్.. మీ స్నేహితులకు, బంధువులకు ఇలా విష్ చేయండి..

Big Stories

×