EPAPER

World Forest Day2024: అడవుల రక్షణ అందరి బాధ్యత.. ప్రపంచ అటవీ దినోత్సవం

World Forest Day2024: అడవుల రక్షణ అందరి బాధ్యత.. ప్రపంచ అటవీ దినోత్సవం

World Forest Day2024


International Day of Forests (international news in Telugu): అడవుల రక్షణ అందరి బాధ్యత. అడవులు, చెట్ల ప్రాముఖ్యత గురించి అవగాహన కల్పించడానికి ఐక్య రాజ్య సమితి జనరల్ అసంబ్లీ 2012 లో ప్రతి ఏటా మార్చి 21న ప్రపంచ అటవీ దినోత్సవాన్ని నిర్వహించాలని నిర్ణయించింది. సుస్థిర అభివృద్ధి, జీవ వైవిద్య పరిరక్షణ, మానవ జీవితంలో అడవుల ప్రాముఖ్యత గురించి వివిరించడంతో పాటు భవిష్యత్తు తరాల కోసం వాటిని రక్షించడానికి ప్రభుత్వ పర్యావరణ సంస్థలు విద్యా సంస్థలు సెమినార్లు, వర్క షాపులు వంటి కార్య క్రమాలు నిర్వహిస్తాయి.

అడవులు కార్భన్ సింక్ లు గా పని చేస్తాయి. ఇవి కార్బన్ డై ఆక్సైడ్ ను స్వీకరించి ఆక్సిజన్ ను విడదల చేయడం ద్వారా వాతావరణ ప్రభావాలను తగ్గించడంలో సహాయ పడతాయి. వృక్ష జంతు జాతులకు ఇవి ఆవాసాలుగా ఉన్నాయి. మానవులకు ఆహారం, ఔషదాలు, ఇతర ఉత్పత్తులను అందిస్తూ ప్రపంచ వ్యాప్తంగా లక్షలాది మందికి జీవనోపాధిని కల్పిస్తున్నాయి.


Also Read: వారాల గర్భవతుల అబార్షన్లపై ట్రంప్ కీలక నిర్ణయం.. ప్రిన్స్ హ్యారీపై చర్యలు ?

అయితే అడవులను నరికి వేయడం, వ్యవసాయం, పట్టణీకరణ వంటి మానవ కార్యకలాపాలకు తోడు కార్చిచ్చు, ప్రకృతి విపత్తుల వల్ల అడవులు అంతరించి పోతున్నాయి. ఆ చర్యల వల్ల జీవ వైవిధ్యం, నేల కోతకు గురికావడం, గ్రీన్ హౌస్ వాయు ఉద్గారాలు పెరుగుతున్నాయి.

దీని వల్ల భూమి, సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. ఇలాగే ఉష్ణోగ్రతలు పెరిగితే ధ్రువ ప్రాతంలో ఉన్న మంచు కరిగిపోయి ప్రపంచ వ్యాప్తంగా సముద్ర తీరంలో ఉన్న నగరాలు మునిగిపోయే ప్రమాదం ఉంది. కావున అడవులను కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంది.అడవులు అన్ని చేస్తున్న జాలిలేన మానవుడు తన స్వార్ధం కోసం అడవులను నరికేస్తున్నాడు. వాటి వల్ల కలిగే అనర్ధాలు ఎక్కువగా ఉన్నా ప్రభుత్వాలు చేయాల్సినంత చెయ్యకపోవడం వల్ల అడవుల పరిపక్షణ అనేది సాధ్యం కావట్లేదు.

అటవీ విస్తీర్ణం ఎక్కువగా ఉన్న జిల్లాగా పేరొందిన.. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు అడవుల జిల్లా అని పేరుంది. 1965 లో దట్టమైన అటవీ ప్రాంతంగా ప్రకటించారు. 1072 లో ఈ ప్రాంతం మొత్తాన్ని వన్య ప్రాణి సంరక్షణ చట్టం క్రింద 1999 లో రక్షిత ప్రదేశంగా ప్రవేశపెట్టారు. ఇక్కడ అటవీ విస్తీర్ణం 2015.44 స్క్వేర్ కిలోమీటర్లు వ్యాపించి ఉంది.

Related News

Lebanon Pager Blasts: లెబనాన్‌లో పేజర్ పేలుళ్లు.. 12 మంది మృతి.. 2800 మందికి గాయాలు

Eswatini king Wife Zuma: 56 ఏళ్ల రాజుకు 16వ భార్యగా 21ఏళ్ల సుందరి.. ‘రాజకీయం కాదు ప్రేమే కారణం’!

Trump: రెచ్చగొట్టే వ్యాఖ్యల ఫలితమే ఇది.. కమలా హ్యారిస్ పై ట్రంప్ కామెంట్స్

Haiti fuel tanker: హైతీలో ఘోర ప్రమాదం..పెట్రోల్ ట్యాంకర్ పేలుడులో 25 మంది మృతి

Donald Trump: ట్రంప్ పై మరోసారి కాల్పులు.. పెద్ద ప్రమాదం తప్పింది

Myanmar Floods: భారీ వరదలు.. 74 మంది మృతి, 89 మంది గల్లంతు

Longest working hours: ఈ దేశాలకి వెళ్లే అవకాశం వచ్చినా వెళ్ళకండి.. అత్యధిక పని గంటలు ఉన్న దేశాలు ఇవే..

Big Stories

×