EPAPER

Arunachal Pradesh: అరుణాచల్‌ ప్రదేశ్‌పై అమెరికా కీలక వ్యాఖ్యలు.. చైనాకు షాక్..

Arunachal Pradesh: అరుణాచల్‌ ప్రదేశ్‌పై అమెరికా కీలక వ్యాఖ్యలు.. చైనాకు షాక్..
Arunachal Pradesh
Arunachal Pradesh

Arunachal Pradesh: అరుణాచల్ ప్రదేశ్ విషయంలో భారత్- చైనా మధ్య రేగిన వివాదంపై అగ్రరాజ్యం అమెరికా స్పందించింది. అరుణాచల్ ప్రదేశ్ భారత్ లో అంతర్భాగమని స్పష్ట చేసింది. చైనా వైఖరిని తప్పుపట్టింది. అరుణాచల్ ప్రదేశ్ విషయంలో డ్రాగన్ చర్యలను వ్యతిరేస్తున్నామని యూఎస్ విదేశాంగ శాఖ ప్రిన్సిపల్ డిప్యూటీ అధికార ప్రతినిధి వేదాంత్ పటేల్ ప్రకటించారు. వాస్తవాధీన రేఖలో చైనా చేస్తున్న ఆక్రమణ ప్రయత్నాలు సరికాదని హెచ్చరించారు.


అరుణాచల్ ప్రదేశ్ పై కన్నేసిన చైనా కొంతకాలంగా కుట్రపూరితంగా వ్యవహరిస్తోంది. ఆ ప్రాంతం తమదేనని చైనా రక్షణశాఖ అధికార ప్రతినిధి సీనియర్ కర్నల్ ఝాంగ్ షియాంగాంగ్ కొన్ని రోజుల క్రితం మొండి వాదన చేశారు. చైనా కామెంట్స్ కు భారత్ దీటుగా బదులిచ్చింది. అరుణాచల్ ప్రదేశ్ భారత్ లో అంతర్భాగమని స్పష్టం చేసింది.

అరుణాచల్ లో ప్రదేశ్ చేపట్టిన అభివృద్ధి పనులను భారత్ వివరించింది. అక్కడ మౌలిక సౌకర్యాలు కల్పిస్తున్నామని తెలిపింది. ఆ ప్రాంతంలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలతో ప్రజలకు మేలు జరుగుతోందని భారత్ విదేశాంగశాఖ అధికార ప్రతినిధి రణ్ ధీర్ జైస్వాల్ ఇటీవల స్పష్టం చేశారు.


Also Read: నేడు అరవింద్ కేజ్రీవాల్ ఈడీ విచారణ .. హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన ఢిల్లీ సీఎం..

భారత్ ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల అరుణాచల్ ప్రదేశ్ లో పర్యటించారు. భారత్ – చైనా సరిహద్దులోని తవాంగ్ లో వెళ్లేందుకు ఉపయోగపడే సేలా సొరంగ మార్గాన్ని ప్రారంభించారు. సైనికులను, ఆయుధాలను తవాంగ్ కు తరలించేందుకు ఈ సొరంగ మార్గం ఉపయోగపడుతోంది. అయితే ఈ ప్రాంతంపైనే చైనా వక్రబుద్ధి చూపుతోంది. జాంగనన్ ప్రాంతాన్ని దక్షిణ టిబెట్ గా చెబుతోంది. అది తమ భూభాగమేనని చైనా వాదిస్తోంది.

Tags

Related News

Nipah virus: కేరళలో నిఫా వైరస్ విజృంభణ.. స్టూడెంట్ మృతి.. రాష్ట్రంలో ఆంక్షలు!

PM Modi: ఇది ట్రైలర్ మాత్రమే.. ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు నాయుడు భేటీ

yashwant Sinha: వాజ్ పేయి సిద్ధాంతాలతో.. పార్టీ పేరు ప్రకటించిన యశ్వంత్ సిన్హా

Delhi: ఢిల్లీకి తదుపరి సీఎం ఎవరు? రేసులో ఆరుగురు పేర్లు.. వీళ్లేనా?

Rajasthan Road Accident: రాజస్థాన్‌లో ట్రక్కును ఢీకొట్టిన తుఫాను.. ఎనిమిది మంది దుర్మరణం

Jammu Kashmir: గాంధీ, నెల్సన్ మండేలాతో బీజేపీ పోల్చుతున్న ఈ బుఖారీ ఎవరు?

PM Narendra Modi: మరో 6 వందే భారత్ రైళ్లు.. వర్చువల్‌గా ప్రారంభించిన ప్రధాని మోదీ

Big Stories

×