EPAPER

fake kidnap drama: కిడ్నాప్ పేరుతో మోసం.. కన్న తండ్రిని రూ. 30 లక్షలు డిమాండ్

fake kidnap drama: కిడ్నాప్ పేరుతో మోసం.. కన్న తండ్రిని రూ. 30 లక్షలు డిమాండ్
fake kidnap drama
fake kidnap drama

fake kidnap drama: ఈ జెనరేషన్ యువత ఆలోచనలను తల్లిదండ్రులు అందుకోలేకపోతున్నారు. టెక్నాలజీ యువత మైండ్ సెట్ ను మార్చేస్తుంది. ఒకప్పుడు పిల్లలు ఏది చేయాలన్నా తల్లిదండ్రులను అడిగి వారు ఒప్పుకుంటేనే చేసే పరిస్థితులు ఉండేవి. కానీ ఇప్పటి పరిస్థితులు అలా లేవు. పిల్లల ఇష్టాలను పెద్దలు కాదని అంటే ఒక్క క్షణం ఎందుకు కాదంటున్నారో ఆలోచించకుండా.. తమకు కావాల్సింది చేసి తీరాలని పట్టుబడుతున్నారు. ఒకవేళ దానికి తల్లిదండ్రులు అంగీకరించకపోతే వారే ఏదో ఒక పిచ్చి పనులు చేసి తల్లిదండ్రులకు తలనొప్పిగా మారుతున్నారు. తాజాగా అటువంటిదే ఓ ఘటన వెలుగుచూసింది.


కనీసం కన్న తండ్రి అని కూడా చూడకుండా ఓ కూతురు బెదిరింపులకు పాల్పడింది. కిడ్నాప్ పేరిట కన్న తండ్రి నుండి అక్షరాల రూ. 30 లక్షలు డిమాండ్ చేసింది. దీనిపై విచారణ జరిపిన పోలీసులు అసలు గుట్టును రట్టు చేశారు. వివరాల్లోకి వెళితే

మధ్యప్రదేశ్ కు చెందిన 21ఏళ్ల కూతురు కన్న తండ్రిని కిడ్నాప్ కు గురైనట్లు భయాందోళనకు గురిచేసింది. అంతేకాదు, కిడ్నాప్ పేరుతో రూ. 30 లక్షలు ఇవ్వాలని అప్పుడే తన కూతురిని విడిచిపెడతాం అంటూ చెప్పించింది. దీంతో భయబ్రాంతులకు గురైన యువతి తల్లిదండ్రులు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే ఫిర్యాదు తీసుకుని కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. ఈ క్రమంలో కోటా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అమ్రిత్ దుహాన్ మీడియాకు వివరాలను వెల్లడించారు. ఈ కేసు విచారణ చేసే క్రమంలో షాకింగ్ విషయాలు వెలుగుచూసినట్లు తెలిపారు. అసలు ఆ యువతి కిడ్నాప్ కాలేదని పోలీసులు గుర్తించామన్నారు. మధ్యప్రదేశ్ లోని ఇండోర్ కు 400 కిలోమీటర్ల దూరంలో తన స్నేహితులతో కలిసి ఉంటుందని తెలిపారు. ఈ క్రమంలో యువతిని పట్టుకున్న పోలీసులు విచారించగా అసలు విషయాన్ని యువతి బయటపెట్టిందని స్పష్టం చేశారు.


తాను విదేశాలకు వెళ్లి చదువుకోవాలనే కోరిక ఉండడంతో ఈ పని చేసినట్లు తెలిపింది. అందుకే తన స్నేహితులతో కలిసి కిడ్నాప్ డ్రామా ఆడినట్లు పోలీసుల విచారణలో చెప్పింది. మరోవైపు ఆగస్టు 3వ తేదీన తన తల్లి రాజస్థాన్‌లోని కోటాలో గల ఓ ఇన్ స్టిట్యూట్‌లో కోచింగ్ కోసం జాయిన్ చేసినట్లు యువతి తండ్రి తెలిపాడు. కానీ జాయిన్ చేసిన రెండో రోజు అంటే ఆగస్టు 5వ తేదీన ఆ ఇన్ స్టిట్యూషన్, హాస్టల్ నుంచి వెకెట్ చేసి వచ్చేసిందని కూడా పోలీసులు గుర్తించారు. దాదాపు 6 నుంచి 7 నెలలు యువతి ఎటువంటి కోచింగ్ సెంటర్ లో అడ్మిట్ కాలేదని, కోటాలో లేదని తల్లిదండ్రులకు తెలిపారు. కానీ తన తల్లిదండ్రులకు మాత్రం రోజు కోచింగ్ కి వెళ్తున్నానని.. దానికి సంబంధించిన పరీక్షలు చాలా బాగా రాస్తున్నట్లు తరచూ ఫోటోలు పంపిస్తుందని తల్లిదండ్రులు వాపోయారు. తన స్నేహితురాలితో కలిసి తనకు విదేశాలకు వెళ్లి చదువుకోవాలని ఉందని.. అందువల్లే ఈ కిడ్నాప్ డ్రామా ఆడినట్లు చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

 

Related News

Viral Video: మీరేంట్రా ఇలా ఉన్నారు.. రూ. 10 జిలేబీ కోసం కొట్టుకుంటారా..

Urination: మూత్ర విసర్జన తర్వాత ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చేయవద్దు..

Viral News: సమస్యపై స్పందించట్లేదని ఓలాపై యువతి వినూత్న నిరసన…

World’s Richest Dog: సింహాసనంపై శునకం.. రూ.3300 కోట్ల ఆస్తికి అధిపతి ఈ కుక్క.. ప్రైవేట్ ప్లేన్, బిఎండబ్ల్యూ కారు ఇంకా ఎన్నో..

Man Extracts 23 Teeth: ఒకేరోజు 23 పళ్లు తీయించుకున్నాడు.. తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయాడు..!

Viral Video: వెర్రి వేశాలు కాకపోతే.. అసలు బైక్‌తో రైలు ఇంజిన్ ను లాగొచ్చా..

Shocking Video: ఎంతటి అద్భుతం.. గణేషుడికి నమస్కరించి మోదకం తీసుకున్న చిట్టెలుక..

Big Stories

×